1. చరిత్ర పరిశోధకుడైన రాబర్ట్ బ్రూస్ పూట్ తెలంగాణాలో ఈ క్రింది వాటిలో ఏ యుగం గురుంచి పరిశోదనలు ప్రారంభించిన తొలి వ్యక్తిగా చెప్పబడ్డాడు
1) హిస్టారిక్ పీరియడ్
2) ప్రీ హిస్టారిక్ పీరియడ్
3) ప్రోటో హిస్టారిక్ పీరియడ్
4) పైవన్నియూ
2. సాంచీ స్థూపానికి రెండవ శాతకర్ణి ఏ దిక్కు తోరణాన్ని నిర్మించాడు
1) ఉత్తరం
2) దక్షిణం
3) తూర్పు
4) పడమర
3) అజంతా గుహల్లో శాతవాహనులు సంబందించిన గుహలు ఏవి?
1) 10, 11
2) 8, 11
3) 9, 11
4) 9, 10
4) మేనత్త కుమార్తెలను వివాహమాడి సంప్రదాయం ప్రవేశపెట్టిన రాజవంశం ఏది
1) వాకాటకులు
2) శాతవాహనులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
5) జతపరచండి
(a) ఫలక్ నామా ప్యాలస్ (1) 1890
(b) చంచలగూడ (2) 1874
(c) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (3) 1882
(d) నిజామీయ అబ్సర్వేటరీ (4) 1884
1) a-4 b-3 c-2 d-1
2) d-4 c-2 a-1 b-3
3) b-4 a-3 c-1 d-2
4) c-4 d-1 b-2 a-3
6) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు మరణించాడు
1) 1967 మే 24
2) 1967 ఫిబ్రవరి 24
3) 1967 నవంబర్ 24
4) 1967 మార్చ్ 24
7) రామతీర్థ శాసనమును వేయించింది ఎవరు
1) రెండవ మాధవవర్మ
2) ఇంద్రభట్టారకవర్మ
3) మహా రాజేంద్రవర్మ
4) రెండవ విక్రమేంద్ర వర్మ
8) విష్ణుకుండినుల కాలంలో గజదళాధిపతిని ఏమని పిలిచేవారు
1) వీరకోశ
2) రజ్జక
3) హస్తికోశ
4) ఫలదార
9) రెండవ బేతరాజు ఎవరికీ సంబందించిన దండయాత్రలో పాల్గొని సబ్సి మండలంలోని 1000 గ్రామాలను, ముదిగొండ రాజ్యంలోని కొంతభాగాన్ని బహుమానంగా పొందాడు
1) 4వ విక్రమాదిత్య
2) 6వ విక్రమాదిత్య
3) 1వ ప్రోలరాజు
4) 2వ విక్రమాదిత్య
10) కాకతీయరాజు దుర్గరాజుకు చలమర్తిగండ అనే బిరుదు ఉంది. ఈ బిరుదు గల మరొకరు ఎవరు
1) 2వ ప్రోలరాజు
2) 1వ బేతరాజు
3) 1వ ప్రోలరాజు
4) 2వ బేతరాజు
11) కాకతీయ రాజ్యం అంతమయ్యే నాటికీ ఢిల్లీలో ఎవరు చక్రవర్తిగా ఉన్నారు
1) మహ్మద్ బీన్ తుగ్లక్
2) గియాజుద్దీన్ తుగ్లక్
3) అల్లాఉద్దీన్ ఖిల్జీ
4) ఫిరోజ్ షా తుగ్లక్
12) రేకపల్లిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజవంశం
1) ముసునూరి వంశం
2) వెలమ వంశం
3) రెడ్డి రాజులు
4) కాపయ వంశం
13) మొహ్మద్ కూలీ కుతుబ్ షా భార్య భాగ్యమతికి హైదర్ మహల్ అనే పేరు ఇచ్చిన వ్యక్తి
1) ఫెరిస్తా
2) బరౌనీ
3) ట్రావెర్నియర్
4) మార్క్ పోలో
14) పుష్కర సంత ప్రధానంగా దీనికి సంబందించినది
1) అన్ని జంతువులు
2) మతపరమైంది
3) ఒంటెలు
4) గొర్రెలు
15) నవీనపేట వారం సంత తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది
1) నిజామాబాద్
2) వరంగల్
3) రంగారెడ్డి
4) మెదక్
16) స్వామి దయానంద సరస్వతి శిష్యుడు స్వామి నిత్యానంద సరస్వతి ఆర్య సమాజం వ్యాప్తికి ఏ సంవత్సరంలో హైదరాబాద్ ను సందర్శించాడు
1) 1891
2) 1892
3) 1893
4) 1894
17) 13 వ మహిళా ఆంద్రసభ ఎక్కడ నిర్వహించ బడింది
1) చిలుకూరు
2) హైదరాబాద్
3) కంది
4) నిజామాబాద్
18) 1922 లో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించినది ఎవరు
1) పి యస్ వెంకట్రావ్
2) యస్ బి వెంకట్రావ్
3) బి యస్ వెంకట్రావ్
4) యస్ పి వెంకట్రావ్
19) ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని విజ్ఞాచంద్రిక మండలి తెలుగులో ఏ సంవత్సరంలో ప్రచురించింది
1) 1905
2) 1906
3) 1910
4) 1911
20) గాంధీ లైబ్రరీ ఏ సంవత్సరంలో నిర్మించారు
1) 1920
2) 1930
3) 1940
4) 1950
21) ఏ రోజున తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది
1) 2014 జులై 16
2) 2014 జూన్ 16
3) 2015 జులై 16
4) 2015 జూన్ 16
22) "ప్రతి వంటకత్తె ఒక రాజకీయ వేత్త కావలి" అని ఎవరు చెప్పారు
1) కార్ల్ మార్క్స్
2) లెనిన్
3) స్టాలిన్
4) హిట్లర్
23) 'సుజాత' పత్రిక సంపాదకుడు
1) ముదిగొండ వీరిశిలింగం
2) రామానుజాచార్యులు
3) పసుడూముల నృసింహవర్మ
4) వెల్దుర్తి మాణిక్యరావు
24) తెలంగాణాలో మొట్టమొదటి కార్మికుల సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది
1) 1929
2) 1928
3) 1927
4) 1926
25) తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ స్వతంత్రంగా ఏర్పడిన తొలి పత్రిక ఏది
1) భాగ్యనగర్
2) దక్కన్ కేసరి
3) దివ్యవాణి
4) హితబోధిని
జవాబులు
1) 2 | 2) 2 | 3) 4 | 4) 3 | 5) 1 |
6) 2 | 7) 3 | 8) 3 | 9) 2 | 10) 4 |
11) 2 | 12) 1 | 13) 1 | 14) 3 | 15) 1 |
16) 2 | 17) 3 | 18) 3 | 19) 3 | 20) 3 |
21) 2 | 22) 2 | 23) 3 | 24) 2 | 25) 4 |
Tags: Telangana History Online Test in Telugu, Telangana History Online Quiz in Telugu, Telangana History Practice Questions with Answers in Telugu, kiran study circle, telangana history study material download for group 2
Chala tq bro and tq for supporting
ReplyDelete