Kakatiya Dynasty Study Material in Telugu 7

TSStudies

Kakatiya Dynasty Lecture Notes in Telugu

కాకతీయుల పరిపాలన 
వీరి పరిపాలనలో వికేంద్రీకృత రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు 
రాచరికం పితృస్వామికంగా ఉండేది. 
కాకతీయుల కాలంలో రాజ్యం క్రింది విధంగా విభజించబడింది 
రాజ్యం -- రాజు 
నాడు -- అమాత్యులు 
స్థలం -- స్థలకాపతి 
గ్రామం -- గ్రామాధిపతి (12 మంది)

పరిపాలనలో రాజుకు సహకరించడానికి అనేకమంది మంత్రులు ఉండేవారు. వీరిలో ముఖ్యమైనవారు మహాప్రధాని, ప్రధాని, ప్రెగ్గడ (అంతఃపుర అధ్యక్షుడు), అమాత్య. 

నాడులో నాయంకర / నాయక వ్యవస్థను మొట్టమొదటి సరిగా ప్రవేశపెట్టిన వాడు -- గణపతిదేవుడు 
వీరి రాజ్యంలో మొత్తం 77 మంది నాయకులు ఉండేవారు. వీరికి పన్ను వసూలుతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత కూడా ఉండేది. 
వీరు కార్యకలాపాలను నిబంధలప్రకారం నిర్వహించేవారు వీటిని లెంకవళి దర్మం అంటారు. 
గ్రామంలో పరిపాలన కొరకు అయ్యగార్ల విధానం ఉండేది. మొత్తం 12 మంది అయ్యగార్లు ఉండేవారు. వీరిలో 3గురు ప్రభుత్వ సేవకులు, మిగిలినవారు గ్రామ సేవకులు. 

ప్రభుత్వ సేవకులు:
1. కరణం -- పన్ను లెక్కలు 
2. రెడ్డి/కాపు -- పన్ను వసూలు 
3. తలారి -- శాంతి భద్రతలు 

గ్రామసేవకులు:
1. కుమ్మరి 
2. కంసాలి 
3. కమ్మరి 
4. వడ్రంగి 
5. మంగలి 
6. చాకలి 
7. వెట్టి 
8. పురోహిత 
9. చర్మకారుడు 

న్యాయపరంగా న్యాయమూర్తిని ప్రాద్వివాక అనేవారు. ఇతను జారీచేసే ఆదేశాలను ముద్రవర్తులు అంటారు 
2వ ప్రతాపరుద్రునికి నవలక్ష ధనుర్దారాధీశ్వరుడు అనే బిరుదు కలదు. దీని అర్ధం తొమ్మిది లక్షల కాల్బలం, 20 వేల అశ్వక బలం, 100 గజబలం కల్గినవాడు. 


Tags: Kakatiya Dynasty Study material in telugu pdf, history of Kakatiya Dynasty, tspsc Kakatiya Dynasty notes in telugu, free download study material for Kakatiya Dynasty in telugu, telangana Kakatiya Dynasty lecture notes in telugu, Kakatiya Dynasty class room notes in ancient history of telugu, Kakatiya Dynasty, Kakatiya Dynasty empires list, list of Kakatiya Dynasty kings