Kakatiya Dynasty Study Material in Telugu 8

TSStudies
కాకతీయుల కాలంనాటి సమాజం 

కాకతీయుల కాలాన్ని తెలుగు వారి స్వర్ణయుగం అంటారు. 
వీరికాలంలో చతుర్ వర్ణ వ్యవస్థ ఉండేది కానీ వీరు ఆయా వృత్తులకు పరిమితం కాలేదు. శుద్రులూ అధికసంఖ్యలో ఉంది పాలక వర్గంగా ఎదిగారు. అందువల్లనే కాకతీయుల యుగాన్ని శూద్రుల స్వర్ణయుగం అని కూడా అంటారు. 
ధర్మసాగర శాసనం 'జలకరండం' అనే సంగీతవాద్య పరికరాన్ని ప్రస్తావించింది. 
బ్రాహ్మణ కుల సంఘాలను మహాజనులు అనేవారు. 
వైశ్య కుల సంఘాలను వైశ్య నకరం అనే వారు. 
అప్పట్లో వేశ్యలకు గౌరవప్రదమైన స్తానం ఉండేది. 
వీరికాలంలో ప్రధాన వినోదం-తోలుబొమ్మలాట 

వినుకొండ వల్లభాచార్యుని క్రీడాభిరామం 
కేతన దశకుమార చరిత్ర : ఆభరణ అలంకారాల గురుంచి 
సోమనాథుని బసవ పురాణం : స్త్రీలు, పురుషులు ధరించే వస్త్రాలు 


ఆర్ధికవ్యవస్థ 

కాకతీయులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇఛ్చారు. 
వీరికాలంలో గొలుసు చెరువుల వ్యవస్థ ఉండేది/
    పాకాల చెరువు, రామప్ప చెరువు, లక్నవరం, రుద్రసముద్ర తటాకం, కేసముద్రం, జగత్ కేసరి సముద్రం, బయ్యారం చెరువు, భద్రకాళి చెరువు, పోచారం చెరువు, పోట్ల చెరువు, శనిగరం చెరువు, ధర్మసాగర్ చెరువు, దేవి చెరువు మొదలగు చెరువులను త్రవ్వించారు. 

నోట్: కాకతీయుల గొలుసు చెరువుల స్ఫూర్తితోనే TRS ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. 
చెరువులు సప్త సంతానాలో ఒకటిగా ఆనాడు పరిగణించేవారు. 
సప్త సంతానాలు:
1. తన సంతానం 
2. ఇతరుల సంతానం
3. రచన 
4. ఇల్లు 
5. వనము 
6. చెరువు 
7. గుడి 

సాగుభూమిని 3 రకాలుగా వర్గీకరించారు 
1. వేలిచేను 
2. నీరునెల 
3. తోటభూమి 

పొలాన్ని గడ / దండ /కోల అనే ప్రమాణంతో కొలిచేవారు. 
భూమి శిస్తును వారి అనేవారు.  సాధారణంగా భూమి శిస్తు 1/6 వ వంతు ఉండేది. 
అప్పట్లో వైశ్యలపై మరియు బిచ్చగాళ్లపై  గణాచారి పన్ను విధించేవారు. 
పశువుల మేతపై పుల్లరీ పన్ను విధించేవారు. 
రాజదర్శనం కోసం దరిశనం అనే పన్ను చెల్లించేవారు 
నిర్మల్ ఖడ్గాలు డమాస్కస్ (సిరియా) కు ఎగుమతి చేశారని పేర్కొంటారు. 
మార్కుపోలో అప్పటి గోల్కొండ వజ్రపుగనుల గురుంచి పేర్కొంటారు. 
వీరి కాలంలో అతి ముఖ్యమైన ఓడరేవు - మోటుపల్లి 
వీరికాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధానకేంద్రం - ఓరుగల్లు 
రాజుయొక్క సొంత పొలాన్ని రాచదొడ్డి అనేవారు. 
వీరికాలంలో సాగు చేయబడని పంట - కంది. 




Tags: Kakatiya Dynasty Study material in telugu pdf, history of Kakatiya Dynasty, tspsc Kakatiya Dynasty notes in telugu, free download study material for Kakatiya Dynasty in telugu, telangana Kakatiya Dynasty lecture notes in telugu, Kakatiya Dynasty class room notes in ancient history of telugu, Kakatiya Dynasty, Kakatiya Dynasty empires list, list of Kakatiya Dynasty kings