Kakatiya Dynasty Rudrama Devi History
రుద్రమదేవి (క్రీ.శ. 1262 - 1289)
రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి, కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీర వనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతి దేవునికి సంతానం లేదు అందువల్లన రుద్రంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడురుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమ్ముడమ్మ, ఈమె మహాదేవుని భార్య, వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిక్షేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశ కర్తగా చెప్పుకున్నారు.
రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాధిపతి మరియు మహ ప్రధాని.
జీవిత విశేషాలు:
కాకతీయులలో గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి 'రుద్రమహారాజు' బిరుదుతో కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యుల కింద వేంగీ ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకు వెల్లినాయి. పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరబాణుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమదేవి తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లన్నింటిని అణచివేసింది.
రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలల్లో దేవగిరి యాదవ రాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు అయితే రుద్రమదేవి యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకు తరిమి కొట్టింది. వేరే దారి లేక మహాదేవుడు సంధికి దిగి వచ్చి యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు.
రుద్రమదేవి యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, 2వ ప్రతాపరుద్రుని కూడా ఈయనే గురువు. రుద్రమదేవి తానె స్వయంగా కాయస్థ రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తుంది. కాయస్థ అంబదేవునితో జరిగిన యుద్ధాలలో రుద్రమదేవి మరణించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
రుద్రమదేవి కల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోదృతి.
ప్రఖ్యాత పథికుడు 'మార్క్ పోలో' చైనా దేశంనుండి తిరిగి వెళ్తూ దక్షిణ భారతదేశమును సందర్శించి రుద్రమదేవి గురుంచి, ఆమె పాలన గురుంచి బహువిధములుగా పొగిడాడు. మోటుపల్లి రేవు నుంచి కాకతీయుల సముద్ర వ్యాపారము గురుంచి కూడా వివరముగా వ్రాసాడు.
Tags: History of Kakatiya Dynasty, Kakatiya Dynasty Rudrama Devi Kakatiya Dynasty, Kakatiya Dynasty notes in telugu, Kakatiya Dynasty history, telangana history Kakatiya Dynasty notes in telugu, ap history Kakatiya Dynasty notes in telugu, Indian history Kakatiya Dynasty notes, appsc study material in telugu, tspsc study material in telugu, rani rudrama devi history in telugu