1952 Mulkhi Agitation - ముల్కీ ఉద్యమం 1952

TSStudies
0
ముల్కీ ఉద్యమం 1952

నిజాం రాజ్యం భారత దేశంలో విలీనం తరువాత ఏర్పడిన మిలటరీ పాలన(జనరల్ J N చౌదరి) పౌర ప్రభుత్వ పాలనా కాలంలో (M K వెల్లోడి) పెద్ద ఎత్తున నాన్ ముల్కీలను(స్థానికేతరులు) వివిధ ప్రభుత్వ శాఖలలో నియమించడం జరిగింది.
మద్రాసు, బాంబే, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్దమొత్తంలో అధికారులను దిగుమతి చేసుకోవడం వల్ల  హైదరాబాద్ రాష్ట్ర ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి ముల్కీ ఉద్యమానికి దారి తీశాయి.
ముల్కీ ఉద్యమం మొదటగా వరంగల్ జిల్లా లో ప్రారంభమైంది.
వరంగల్ జిల్లా లో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేస్తున్న పార్థసారథి అనే అధికారి కొంత మంది టీచర్లను  బదిలీ చేసి వారి స్థానంలో నాన్ ముల్కీలను నియమించినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
పార్థసారథి పై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిన షేండార్కర్ అనే అధికారి 1952 జులై 26 న వరంగల్ వచ్చాడు. దీనితో స్థానికంగా ఉన్న విద్యార్థులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి పూనుకున్నారు.ముల్కీ ఉద్యమంలో విద్యార్థులు తొలిసారిగా నిరసన 1952 జులై 26న జరిగింది.

హన్మకొండ నుంచి సుబేదారి  వరకు వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
1952 జులై 28న బుచ్చయ్య కన్వీనర్ గా ఏర్పడి విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ ముల్కీ నిబంధనల పై ఒక తీర్మానాన్ని చేసి అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు పంపించింది.  దీనిపై ముఖ్యమంత్రి సరైన స్పందన లేకపోవడంతో ఆగస్టు 24, 1952న మరొక లేఖను పంపారు.

1952 ఆగస్టు 22న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వరంగల్ లో పర్యటించారు.
ఈ లేఖలో 27 ఆగస్టు 1952 లోపు ముల్కీ నిబంధనల పై ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలి. అలా కాని పక్షంలో 27 ఆగస్టు 1952 నుంచి కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అంతటా సమ్మె నిర్వహిస్తామని తెలపడం జరిగింది.
కానీ ముఖ్యమంత్రి యొక్క డిమాండ్ల అంగీకారాన్ని కలెక్టర్ కు తెలియజేసిన, ఆ సమాచారం విద్యార్థులకు అందటం ఆలస్యం అవటంతో 27 ఆగస్టు 1952న ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ అనంతరం ఆగస్టు 30 న నిరసన తెలుపుతున్న కొంత మంది విద్యార్థులను చెల్లాచెదురు చేయడానికి లాఠీచార్జి చేశారు.ఈ లాఠీచార్జికి నిరసనగా ఖమ్మం, ఇల్లందు, మిర్యాలగూడ, నల్గొండ, మహబూబాబాద్ ప్రాంతాలలో పూర్తిస్థాయి హర్తాళ్లు జరిగాయి. తరువాత ఆగస్టు 31, 1952న సైఫాబాద్ నుంచి అబిడ్స్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

సెప్టెంబర్ 2న నాన్ ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావ్, స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ వంటి నినాదాలతో విద్యార్థులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు.
సిటీ పోలీస్ కమిషనర్ అయిన శివకుమార్ లాల్ 1952 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్షన్ 22 కింద ఊరేగింపులు సభలు సమావేశాలు నిషేధాజ్ఞలు జారీ చేశాడు.
పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల గురించి సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన రాంలాల్ విద్యార్థులకు తెలియజేశారు.
సెప్టెంబర్ 3 న సిటీ కాలేజ్ మరియు పత్తర్ఘడ్ ప్రాంతాలలో నిరసన చేస్తున్న ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 4న అఫ్జల్ గంజ్ ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి మరణించాడు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో కాల్పులలో కొంతమంది విద్యార్థులు మరణించగా చాలా మంది గాయపడ్డారు.
ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులకు నిరసనగా ఆందోళన కారులు బూర్గుల రామకృష్ణారావు యొక్క కారును సెప్టెంబర్ 5న తగలబెట్టారు. 

ముల్కీ ఉద్యమం యొక్క తీవ్రతను గమనించిన ప్రభుత్వం సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం కొండా వెంకట రెడ్డి, డాక్టర్ మేల్కోటే, పూల్ చంద్ గాంధీ,  నవాజంగ్ సభ్యులుగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

సెప్టెంబర్ 3 మరియు 4 తేదీలలో జరిగిన కాల్పులపై విచారణ చేపట్టేందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న  జస్టిస్  పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేసింది.

ఈ కమిషన్ తన రిపోర్టును డిసెంబర్ 28, 1952 న ఇస్తూ మొదటిసారి కాల్పులు జరిపినప్పుడు ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు, పోలీసు అధికారులు, పోలీసు బలగాల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలిసింది. సరైన సందర్భంలో పోలీసులు కచ్చితంగా వ్యవహరించలేకపోయారని తెలిపింది.
ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఆందోళనకారుల మధ్య చర్చలు విఫలం కూడా అల్లర్లు జరగడానికి కారణంగా చెప్పింది.
జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ అయిన 'ది జ్యుడీషియరీ ఐ సర్వ్ డ్'  లో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల  దుష్ప్రవర్తన వల్ల రాష్ట్రమంతటా అల్లర్లు వ్యాపించాయని పేర్కొన్నారు .



Post a Comment

0Comments

Post a Comment (0)