మౌంట్ బాటన్ మధ్యవర్తిత్వం
మౌంట్ బాటన్ తన పత్రికల వ్యవహారాల కార్యదర్శి అయిన అలెన్ క్యాంప్ బెల్ హైదరాబాద్ కు పంపి రెండు ప్రభుత్వాల మధ్య శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నించాడు.
క్యాంప్ బెల్ మరియు లాయక్ అలీ ల మధ్య క్రింది అంశాలపై చర్చ జరిగింది
1. హైదరాబాద్ లో చట్టబద్ధత లేని సాయుధ దళాలను రద్దు చేయాలి
2. 1949 జనవరి 1 లోపు హైదరాబాదులో రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి
3. విదేశాలకు రాజకీయ దూతలను పంపకూడదు
4. ఆర్థిక సంబంధాల కొరకు విదేశాలకు దూతలను పంపవచ్చు
లాయక్ అలీ మొదట్లో పై అంశాలను అంగీకరించినప్పటికీ వాటిని అమలు చేయలేదు.
అప్పుడే మహమ్మద్ అలీ జిన్నా హైదరాబాదులో పర్యటించి హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్ లో విలీనం చేయాలని ఉస్మాన్ అలీఖాన్ ను కోరాడు, కానీ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం జిన్నా ప్రతిపాదనను తిరస్కరించాడు.
రజాకార్ నాయకుడైన ఖాసిం రజ్వీ హైదరాబాదులో ఉత్తేజభరితమైన ప్రసంగాలు చేస్తూ ఢిల్లీలోని ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగుర వేస్తానని అని ప్రకటించాడు.
అప్పటి ఉప ప్రధాని అయినా వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని ఒక పుండుగా పరిగణించి దాన్ని తక్షణమే తొలగించాలని పేర్కొన్నాడు.
హైదరాబాద్ పై సైనిక దాడి చేయుటకు ఒక వ్యూహాన్ని రచించమని అప్పటి దక్షిణ కమాండ్ అయినా లెఫ్టినెంట్ జనరల్ ఈ ఎన్ గోడార్డ్ ను వల్లభాయ్ పటేల్ ఆదేశించాడు.
ఈ ఎన్ గోడార్డ్ హైదరాబాద్ దాడికి ప్రణాళికను రూపొందించి వల్లభాయ్ పటేల్ కు అందజేశారు. అయితే అప్పుడు హైదరాబాద్ పై సైనిక దాడి జరగకుండా ప్రధానంగా అడ్డుకున్నది గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్.
1948 ఆగస్టు లో మౌంట్ బాటన్ భారత గవర్నర్ జనరల్ పదవి నుండి తప్పుకొని బ్రిటన్ కు వెళ్ళిపోయాడు. అప్పుడు రాజగోపాలాచారి భారతదేశ గవర్నర్ జనరల్ గా నియమించబడ్డాడు. తక్షణమే వల్లభాయ్ పటేల్ రాజాజీ ని కలిసి హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలంటే సైనిక దాడి చేయాల్సిందేనని మొత్తం పరిస్థితులను వివరించారు అయితే రాజాజీ దీన్ని సైనిక చర్య అనకూడదని ఇది మన అంతర్గత వ్యవహారమని కావున దీన్ని పోలీస్ చర్యగా పరిగణించాలని పేర్కొన్నాడు.