యధాతథ స్థితి ఒప్పందం (1947 నవంబర్ 29)
హైదరాబాద్ లో నిజాం పై వ్యతిరేకత అధికమవ్వడంతో ఉస్మాన్ అలీఖాన్ భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన వాడు చటారి నవాబ్.
ఒప్పందంలోని ప్రధానాంశాలు
ఒప్పందంలోని ప్రధానాంశాలు
1 హైదరాబాద్ భారతదేశం లో ఒక అనుబంధ రాజ్యం గా ఉంటుంది
2 హైదరాబాద్ యొక్క విదేశీ వ్యవహారాలు రక్షణ పూర్తిగా భారతదేశం ఆధీనంలో ఉంటుంది
3 ఒక సంవత్సరం లోపు హైదరాబాద్ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడాలి
4 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ అయిన ఇతరులు విడుదల చేయ బడాలి
5 తక్షణమే హైదరాబాదులో వాక్ సభ స్వాతంత్రాలు కల్పించాలి
6 భారత దేశ కరెన్సీ హైదరాబాదులో చెల్లుతుంది
7 ఒకవేళ భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం సంభవిస్తే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి
యధాతధ ఒప్పందం ఈ వ్యతిరేకిస్తూ ఖాసింరజ్వీ అతని బృందం సభ్యులపై దాడులకు దిగారు దీంతో చట్టారీ నవాబ్ తన పదవులకు రాజీనామా చేశాడు
అప్పుడే మహేందియార్ జంగ్ 1947 డిసెంబర్ లో హైదరాబాద్ ప్రధానిగా నియమించబడ్డాడు ఖాసింరజ్వీ తనకు అనుకూలమైన లాయక్ అలీ ని హైదరాబాద్ ప్రధానమంత్రిని చేయవలసిందిగా ఉస్మాన్ అలీ ఖాన్ పై వత్తిడి చేశారు దీంతో 1947 డిసెంబర్ లోనే లాయక్ అలీ ని హైదరాబాదుకు ప్రధానిగా నియమించాడు.
లాయక్ అలీ ప్రధాని కావడం తో యధాతథ స్థితి ఒప్పందం ఉల్లంఘన ప్రారంభమైంది హైదరాబాద్ లో యథాతథ స్థితి ఒప్పందం ఉల్లంఘన తోపాటు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి ఇదే సమయంలో నానజ్ అనే ప్రాంతాన్ని భారత దేశ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది లాయక్ అలీ దీనిని తీవ్రంగా పరిగణించారు
భారత ప్రభుత్వం హైదరాబాద్ పై ఆర్థిక ఆంక్షలు విధించడం కారణంగా బయటి ప్రాంతం నుండి హైదరాబాదు లోకి వస్తువుల ప్రవేశం నిలిచిపోయింది.
దీంతో హైదరాబాద్ లో అనేక వస్తువుల పై కొరత ఏర్పడింది దీంతో హైదరాబాద్ మరియు భారత ప్రభుత్వాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది
హైదరాబాద్ లో భారతదేశాల సంస్థానాల వ్యవహారాల కార్యదర్శి వీపీ మీనన్ హైదరాబాద్ లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి తెలియజేసేవాడు
భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త తొలగించుటకు అప్పటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ప్రయత్నించాడు.