How Nizam Rule Ended - నిజాం పాలన అంతం -2

TSStudies
0
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలు 

1938 జనవరి 29 న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది. 
1938 సెప్టెంబర్ 8 న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం విధించబడింది. 
1946 జూలై లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేయబడింది 
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిజాం కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రఖ్యాత ఉద్యమం - జాయిన్ ఇండియా ఉద్యమం 

హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలని స్వామి రామానందా తీర్థ 1947 ఆగస్ట్ 7న జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు 

1947 ఆగష్టు 15 న మోతీలాల్ మంత్రి హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ వద్ద భారతదేశ తిరంగ పతాకాన్ని ఎగురవేశారు 

కమ్యూనిస్టు కార్యకలాపాలు 

అప్పట్లో కమ్మూనిస్టులు 2 వర్గాలుగా ఉండేవారు 
1. కఠిన వైఖరి కల్గిన వర్గం 
2. మృదువైఖరి కలిగిన వర్గం 

ఆరుట్ల సోదరులు (రామచంద్ర రెడ్డి, లక్ష్మి నరసింహ రెడ్డి ) కఠిన వైఖరి కలిగిన వర్గం. వీరు నిజాం పాలన కొనసాగాలని భావించేవారు. 
మృదువైఖరికి చెందిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముక్దుం మొహినుద్దీన్ మొదలగువారు హైదరాబాద్ సంస్థానంను భారత యూనియన్ లో విలీనం చేయాలని భావించేవారు. 

పత్రికలు 

1. ఇమ్రోజ్ - షోయాబుల్లాఖాన్, బూర్గుల రామకృష్ణారావులు స్థాపించారు. సంపాదకుడు-  షోయాబుల్లాఖాన్
2. తెలుగుదేశం - రాజ్యలక్ష్మీదేవి 
3. స్టేట్ కాంగ్రెస్ - తాళ్లూరి రామానుజస్వామి 
4. హైదరాబాద్ -  మర్రి చెన్నారెడ్డి 
5. గోల్కొండ - సురవరం ప్రతాపరెడ్డి 


ఆర్యసమాజ్ కార్యకలాపాలు 

1892లో ఆర్యసమాజ్ శాఖను దయానంద సరస్వతి హైదరాబాద్ లో స్థాపించారు 
దీనికి మొదటి అధ్యక్షడు - కమతా ప్రసాద్ జీ మిశ్రా 
1939లో హైదరాబాద్ డే అనే పేరుతో సదస్సులు నిర్వహించింది. 
1947 డిసెంబర్ 4న ఆర్య సమాజ్ లోని నారాయణరావ్ పవార్ హైద్రాబాద్ లోని కింగ్ కోఠి వద్ద నిజాం ఉస్మాన్ అలీఖాన్ పై బాంబు దాడి చేసాడు. 
నారాయణరావ్ పవార్ కు శిక్షణ ఇచ్చినవారు - కొండా లక్ష్మణ్ బాపూజీ 
ఈ కేసులో 7వ నిందితుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 

బాకర్ అలీ మీర్జా కార్యకలాపాలు

ఇతను అనేక మంది ముస్లింలను ఏకం చేసి హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేయాలని ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఉస్మాన్ అలీఖాన్ కు ఇచ్చాడు. వెంటనే ఇతను గృహ నిర్బంధానికి గురయ్యాడు. 


Post a Comment

0Comments

Post a Comment (0)