కాకతీయుల కాలంనాటి మతం
వీరికాలంలో శైవ మతం బాగా వ్యాప్తి చెందింది.
శైవమతం 3 శాఖలుగా చీలిపోయి వ్యాప్తి చెందింది
1. పాశుపత శైవం
2. కాలముఖ శైవం (స్థాపకుడు - లకులీశ్వరుడు )
3. కాపాలిక శైవం
గణపతిదేవుడు పాశుపత శాఖను ఆదరించాడు. ఇతని గురువు విశ్వేశ్వర శంభు గోళకి మఠాలను స్థాపించి శైవమతాన్ని వ్యాప్తి చేసాడు.
వీరశైవ గురువులను జంగములు అంటారు
వీరి మత పుస్తకాలను ఆగములు అంటారు
వీరి అనుచరులను లింగాయతులు అంటారు
వీరికాలంలో బౌద్ధమతం పూర్తిగా అంతరించింది. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు.
సాహిత్యం
కాకతీయుల అధికారిక బాష - సంస్కృతం
వీరు తెలుగు భాషకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు
వీరికాలంలో అనేక తెలుగు పుస్తకాలు రచించబడ్డాయి
1. రంగనాథ రామాయణం - గోనబుద్ధారెడ్డి
2. భాస్కర రామాయణం - భాస్కరుడు
3. బసవపురాణం - పాల్కురిసోమనాథుడు
4. పండితారాధ్య పురాణం - పాల్కురిసోమనాథుడు
5. మార్కండేయ పురాణం - మారన
వీరికాలంలో రచించబడిన సంస్కృత గ్రంధాలు
1. నీతిసారం - రుద్రదేవుడు / ఒకటవ ప్రతాపరుద్రుడు
2. సకల నీతిసారం - ముడితి సింగన్న
3. నీతిసార ముక్తావళి - బద్దెన
4. సుమతీ శతకం - బద్దెన
5. ప్రతాపరుద్ర యశోభూషణం - విద్యానాథుడు
6. పురుషార్థ సారం - శివదేవయ్య
7. క్రీడాభిరాభం - వినుకొండ వల్లభాచార్యులు
8. ప్రేమాభిరామం - త్రిపురాంతకుడు
తెలంగాణ సాహిత్యంలో కాకతీయుల కాలం స్వర్ణయుగం అంటారు
తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కురిసోమనాథుడు ని తెలంగాణ సాహిత్యంలో ఆదికవిగా కీర్తించబడతారు.
వాస్తు శిల్పకళ
కాకతీయుల కాలంలో ఆలయ నిర్మాణాల్లో పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించారు.
వీరు త్రికూట ఆలయాలు నిర్మించారు
రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్పగుడిని నిర్మించాడు. ఈ దేవాలయంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి.
రుద్రదేవుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడిని నిర్మించాడు
గణపతిదేవుడు ఓరుగల్లులో స్వయంభు దేవాలయాన్ని నిర్మించాడు
వీరికాలంలో ప్రధానంగా కనిపించేవి తోరణాలు.
Tags: Kakatiya Dynasty Study material in telugu pdf, history of Kakatiya Dynasty, tspsc Kakatiya Dynasty notes in telugu, free download study material for Kakatiya Dynasty in telugu, telangana Kakatiya Dynasty lecture notes in telugu, Kakatiya Dynasty class room notes in ancient history of telugu, Kakatiya Dynasty, Kakatiya Dynasty empires list, list of Kakatiya Dynasty kings