Committees on the surplus budget on 1969 Telangana Movement

TSStudies
0

Committees on the surplus budget on 1969 Telangana Movement - 1969 ఉద్యమంలో మిగులు నిధుల పై కమిటీలు

లలిత్ కుమార్  కమిటీ(Lalith Kumar Committee)
జనవరి 19, 1969 న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కాగ్ అధికారి అయిన లలిత్ కుమార్ కమిటీ నేతృత్వంలో తెలంగాణ మిగులు నిధుల పై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 
ఈ కమిటీ నవంబర్ 1, 1956 నుండి మార్చి 31, 1968 వరకు జరిగిన కేటాయింపులన్నీ పరిశీలించి నివేదికను సమర్పించింది.
ఈ నివేదికలో 1956 నవంబర్1 నుండి 1968 మార్చి 31వరకు ఎక్సైజ్ డ్యూటీ తో సహా చూస్తే తెలంగాణ రెవిన్యూ ఖాతాలో 102 కోట్ల మిగులు ఉందని దీనిలో నికర మిగులు 63.92 కోట్లు అని పేర్కొంది.


జస్టిస్ భార్గవ కమిటీ(Justice Bhargava Committee) 
1969 ఏప్రిల్ 22న ఈ కమిటీని ఏర్పాటు చేశారు 
ఈ కమిటీ చైర్మన్ జస్టిస్ వశిష్ట భార్గవ్ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి) 
సభ్యులు: 
1) ప్రొఫెసర్ ఎమ్ వి మధుర్ (ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్) 
2) హరి భూషణ్ భాను (డిప్యూటీ కాగ్)
కమిటీ కార్యదర్శి - టి ఎస్ కృష్ణస్వామి 
ఈ కమిటీ తన నివేదికను అక్టోబరులో ప్రభుత్వంకు అందజేసింది కానీ ప్రభుత్వం అధికారికంగా ఈ నివేదికను విడుదల చేయలేదు 

కమిటీ నివేదిక
1956 నుండి 68 మధ్యకాలంలో మిగులు నిధులు 28.34 కోట్లు అని పేర్కొంది 
తెలంగాణ నిధులు తెలంగాణలోనే ఖర్చు పెట్టాలని నిబంధనను ప్రభుత్వం పాటించలేదు.
పెద్ద మనుషుల ఒప్పందం ఖచ్చితంగా పాటించడం మాత్రమే కాక ఆ ఒప్పందపు స్ఫూర్తిని అమలు చేయడానికి అవసరమైన అదనపు చర్యలు కూడా తీసుకోవాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.


వాంచూ కమిటీ
ఈ కమిటీ అధ్యక్షుడు కె ఎన్ వాంచూ
ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలకు కేంద్ర ప్రభుత్వం 1969 ఏప్రిల్ లో నియమించింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)