Govt Action During 1969 Telangana Movement - 1969 ఉద్యమంలో ప్రభుత్వ చర్యలు

TSStudies
0
1969 ఉద్యమంలో ప్రభుత్వ చర్యలు 
ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1969 ఏప్రిల్ 11న పార్లమెంట్ లో తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి అష్ట సూత్ర పథకాన్ని(8 Points Formula in Telangana) ప్రతిపాదించింది. 

అష్ట సూత్ర పథకం 
1. ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన మిగులు నిధుల లెక్కలు తీయడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించి ఒక నెల రోజుల్లో నివేదిక అందజేయాలి. 
2. మిగులు నిధుల తరలింపు వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించడానికి కావలసిన నిధులను సమకూర్చటం. 
3. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను తయారు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని(Regional Development Committee) ఏర్పాటు చేయటం.  
4. ప్రణాళికలను అమలు పరచడానికి ప్రణాళిక సంఘం సలహాదారుని అధ్యక్షతన ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం. 
5. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఇంకా ఎక్కువ అధికారాలు కల్పించడం. 
6. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడానికి కావలసిన రాజ్యాంగపరమైన ఏర్పాటు చేయడం. 
7. తెలంగాణ ఉద్యోగస్తుల సర్వీసుకు సంబంధించిన సమస్యలను పరిశీలించి తగు పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడే ఒక కమిటీ కి అప్పగించటం. 
8. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రద్ధ చూప వలసిన అవసరం ఉన్న దృష్ట్యా కనీసం ఆరు మాసాలకు ఒకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రధానమంత్రి సమక్షంలో జరపటం.



Post a Comment

0Comments

Post a Comment (0)