Judgments on Mulkhee Rules

TSStudies
0

ముల్కీ నిబంధనల పై కోర్టు తీర్పులు

ముల్కి అనగా స్థానికుడు గైర్ ముల్కీ అనగా స్థానికేతరుడు ముల్కీ గైర్ ముల్కీ అనే సమస్య బహమనీల కాలం నుండి ఉంది.
1888లో మీర్ మహబూబ్ అలీఖాన్ ముల్కీ హక్కుల కోసం చర్యలు తీసుకున్నాడు.
1919లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముల్కీ పదానికి నిర్వచనం ఇచ్చాడు. 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్న వారు స్థానికులుగా పరిగణించబడతారు వీరే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా స్థానికులకు రక్షణ కల్పించే ఈ ముల్కీ నిబంధనలు కొనసాగాయి.
1948 నుండి 1952 మధ్య కాలంలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి స్థానికేతరులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించారు దీంతో ముల్కీ ఉద్యమం ఉత్పన్నమైనది.
1952 సెప్టెంబర్ లో పెద్ద ఎత్తున గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది.
1957లో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారము ప్రజా ఉద్యోగ చట్టం-1957 తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం స్థానికుడి కి  నిర్వచనం ఇవ్వబడింది.

ముల్కీ నిబంధనల పై కోర్టులో కేసులు తీర్పులు
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో గల ఉద్యోగుల పిటిషన్ 

నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం 1959లో స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. దీనిలో అధికంగా ఆంధ్రులను ఉద్యోగాల్లో నియమించింది 
ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ లో అధికంగా ఆంధ్రులే ఉద్యోగాల్లో ఉన్నారు 
దీన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి ఆంధ్రులు ధర్మల్ పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు పొందారని తక్షణమే వారిని తొలగించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశారు. 
హైకోర్టు విచారణ జరిపి ఈ క్రింది తీర్పు వెలువరించింది హైకోర్టు విచారణ జరిపి ఈ క్రింది తీర్పు వెలువరించింది
తెలంగాణ ప్రజా ఉద్యోగ చట్టం 1957 క్రిందకు ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు రాదు కావున కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ లో జోక్యం చేసుకోలేము. 
హైకోర్టు యొక్క ఈ తీర్పు తరువాత, 1969 తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.

జీవో 36 పై పిటిషన్
రవీంద్రనాథ్ పాల్వంచలో నిరాహార దీక్ష చేపట్టిన తరువాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది 
దీనితో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి 1969 జనవరి 21 నా జీవో 36ను విడుదల చేసి 1969 ఫిబ్రవరి 28లోపు స్థానికేతరులను తమతమ ప్రాంతాలకు పంపి వేస్తామని పేర్కొంది 
తక్షణమే ఈ జీవో 36ను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ఉద్యోగులు జనవరి 25న హైకోర్టులో కేసు వేశారు 
1969 జనవరి 31న కొందరు తెలంగాణ మహిళా ఉద్యోగులు తమ భర్తలు ఆంధ్రులని వారిని ఆంధ్రాకు పంపి వేస్తే తమ కుటుంబాలు ఇబ్బంది పడతాయని జీవో 36 కు వ్యతిరేకంగా దాఖలు చేశారు 
1969 ఫిబ్రవరి 3న హైకోర్టు సింగిల్ బెంచ్ చిన్నపరెడ్డి విచారణ జరిపి ఈ క్రింది తీర్పు ఇచ్చింది 
జీవో 36 లోని మూడవ పక్షం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ జీవో 36 రాజ్యాంగ విరుద్ధమైనది కావున కొట్టి వేస్తున్నాము 
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తులతో జగన్మోహన్ రెడ్డి మరియు ఆవుల సాంబశివరావు ఒక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసింది
కొందరు సుప్రీంకోర్టులో కూడా జీవో 36ను సవాలు చేశారు 1969 ఫిబ్రవరి 18న వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది మరియు జీవో 36 పై కూడా స్టే విధించి  ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపరాదని పేర్కొంది 
1969 ఫిబ్రవరి 20న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ క్రింది తీర్పునిచ్చింది "ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమైనది అయితే నాన్ ముల్కీ ఉద్యోగులను వెనక్కి పంపకుండా వారికి ఉన్న చోటనే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలి "
సుప్రీంకోర్టులో జీవో 36 పై విచారణ కొనసాగుతున్నందున దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది 
1969 మార్చి 7న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 36 పై స్టే ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసింది 
1969 మార్చి 29న సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు జీవో 36ను కొట్టేసింది ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపరాదని తీర్పు ఇచ్చింది.  
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కేంద్రం జస్టిస్ వాంచూ అధ్యక్షతన న్యాయ నిపుణుల సంఘాన్ని నియమించింది. 


1970 డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇస్తూ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే, రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ముల్కీ నియమాలు అమలులో ఉన్నట్లే అని పేర్కొంది 
దీంతో కొందరు ఆంధ్ర ఉద్యోగులు పై తీర్పును పునః పరిశీలన జరపాలని హైకోర్టును ఆశ్రయించారు 
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల తో ఫుల్ డివిజన్ బెంచ్ లు ఏర్పాటు చేసింది 
1972 ఫిబ్రవరి 14న వాదనలు విన్న హైకోర్టు బెంచ్(4:1) ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవని కావున ఈ తీర్పు ఇచ్చింది. 
ఈ తీర్పును వ్యతిరేకించిన న్యాయమూర్తి కొండ మాధవరెడ్డి 
తక్షణమే పి.వి.నరసింహారావు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశాడు 
పివి నరసింహారావు యొక్క వియ్యంకుడు నరసింగరావు సుప్రీం కోర్టులో ఈ కేసు వాదించాడు 
1972 అక్టోబర్ 3న సుప్రీం కోర్టు తన తీర్పును ఇస్తూ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అధికరణ 35(బి) నేటికీ అమలులో ఉన్నట్లే అని పేర్కొంది 
తీర్పు అనంతరం పివి నరసింహారావు మాట్లాడుతూ వివాదంపై ఇది తుది తీర్పు సుప్రీంకోర్టు చెప్పినవి ఆఖరి మాటలు అని పేర్కొన్నారు 
దీనితో ఆంధ్రులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు 

ముల్కీ నిర్వచనం పై పిటిషన్ 
ముల్కీ నియమాలు రాజ్యాంగ సమ్మతమైన వే అని సుప్రీంకోర్టు తన తుది తీర్పును ఇచ్చిన తరువాత కొందరు నిర్వచనం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు 
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు 1973 ఫిబ్రవరి 16న ఒకసారి 1973 జూలై 23న మరోసారి తన తీర్పును వెలువరించింది 

1973 ఫిబ్రవరి 16 తీర్పు 
తెలంగాణలో పుట్టి పెరిగిన వారిని మాత్రమే ముల్కీలు గా పరిగణించడం సబబు కాదు బయట నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వారిని కూడా ముల్కీలు గా పేర్కొనవచ్చు 

1973 జూలై  23 తీర్పు 
ముల్కీ నిబంధన ఆరంభంలో నియమానికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అనంతరం ప్రమోషన్ సీనియారిటీ రిటైర్మెంట్ లకు కాదు

Post a Comment

0Comments

Post a Comment (0)