Telangana Government Schemes-Panchayat Raj Schemes in Telangana

TSStudies
0
Telangana Panchayat Raj Schemes

పంచాయతీరాజ్ పథకాలు (Panchayat Raj Schemes in Telangana)

తెలంగాణ పల్లె ప్రగతి 
లక్ష్యం : పేదల సమ్మిళిత అభివృద్ధి 
నిరుపేదల జీవనాభివృద్ధి పెంపొందించడానికి తెలంగాణ పల్లె ప్రగతి 
2015 ఆగస్టు 22న మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఈ పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు.

గ్రామజ్యోతి పథకం 
ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ పథకం ప్రారంభించబడింది. 
లక్ష్యం: గ్రామ స్వపరిపాలన గ్రామస్వరాజ్యం 
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2015 ఆగస్టు 17న ఆదర్శ గ్రామమైన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లె లో ప్రారంభించారు. 
2015 ఆగస్టు 17 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ జ్యోతి వారోత్సవాలు నిర్వహించారు. 
'మన ఊరు-మన ప్రణాళిక' కార్యక్రమానికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.

మన ఊరు మన ప్రణాళిక 
ప్రారంభించిన తేదీ: July 14, 2014 
ఇది హైదరాబాద్ జిల్లాలో ప్రారంభమైనది. 
గ్రామ సచివాలయం వేదికగా గ్రామంలోని వైద్యం, విద్య, వ్యవసాయం, సాగునీరు వంటి సమస్యలు ఈ పథకంలో భాగంగా పరిష్కరిస్తారు. 
ప్రణాళికల రూపకల్పనలో ప్రజాభాగస్వామ్యం పెంచటం 
ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ద్వారా సూక్ష్మ స్థాయిలో గ్రామ ప్రణాళికలు ఏర్పాటు చేసి వారి అవసరాలు తీర్చడం.

ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం 
ప్రారంభించిన తేదీ: ఆగస్టు 10, 2017 
ప్రారంభించిన ప్రదేశం: పోచంపాడు గ్రామం, నిజామాబాద్ జిల్లా 
ప్రారంభించిన వారు: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు

Post a Comment

0Comments

Post a Comment (0)