Telangana Government Schemes-మిషన్ భగీరథ

TSStudies
0
Telangana Government Schemes-మిషన్ భగీరథ
మిషన్ భగీరథ (ఇంటింటికి త్రాగునీరు కష్టాలు తీరు) 
ప్రారంభం: 7 ఆగష్టు 2016
 ప్రారంభించిన ప్రదేశం: కోమటి బండ, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా 
ప్రారంభించిన వారు: ప్రధాని నరేంద్ర మోడీ 

ముఖ్యాంశాలు 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ నల్ల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని అందించాలని రూ. 42 వేల కోట్ల అంచనా వ్యయంతో మిషిన్ భగీరథ బృహత్ ప్రాజెక్టును ప్రారంభించారు.  
దీని ద్వారా 26 వేల గ్రామాలకు 67 కు పైగా పట్టణాలకు తాగు నీటిని అందించడం ముఖ్య ఉద్దేశం 
మిషన్ భగీరథలో గ్రామీణ ప్రాంతాలలో ఒక్కొక్కరికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాలలో 135 లీటర్లు, నగరంలో 150 లీటర్ల శుభ్రపరిచిన సాగునీరుని  అందిస్తారు 
ఈ పథకం కోసం కృష్ణా, గోదావరి జలాల నుండి శుద్ధి చేసిన 59.94 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.  

ప్రాజెక్ట్ స్వరూపం 
26 సెగ్మెంట్లు, 67 ఇంటెక్ వెల్స్, 153 నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు, 
1,69,705 కిలోమీటర్ల పొడవుతో 35,514 ఓ హెచ్ ఆర్ లు

మిషన్ భగీరథ పనులను ఇప్పటికే 5,752 గ్రామీణ ఆవాసాలకు, 15 పట్టణాలకు, 2900 గ్రామాలకు చేరాయి.  
ప్రాజెక్టు యొక్క కాలపరిమితి 4సంవత్సరాలు
ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకం గూర్చి 22 మే 2016 న జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు

మిషన్ భగీరథ చైర్మన్క: ల్వకుంట్ల చంద్రశేఖర రావు 
మిషన్ భగీరథ వైస్ చైర్మన్: వేముల ప్రశాంత్ రెడ్డి (బాల్కొండ ఎమ్మెల్యే )

మిషన్ భగీరథలో భాగంగా చేపడుతున్న వాటర్ పైప్ లైన్ తో పాటుగా టీ-ఫైబర్ ప్రాజెక్ట్ (ఆప్టికల్ ఫైబర్ డక్ట్) ను  చేపడుతున్నారు. దీని ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. 
మిషన్ భగీరథ మొబైల్ యాప్ వెబ్ సైటులో  సెప్టెంబర్ 17, 2017 న ఎర్రమంజిల్ లోని గ్రామీణ నీటిపారుదల కార్యాలయంలో కేటీఆర్ ప్రారంభించారు. 

2018-19 బడ్జెట్లో రూ.1801 కోట్లు కేటాయించారు 
మిషన్ భగీరథ పథకానికి ఫ్రాన్స్ లోని బోర్డ్ ఎక్స్ నగరపాలక సంస్థ సేవలు అందిస్తుంది. 

Note: జలహారం పథకం పైలాన్ ను 8 జూన్ 2017 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 



Post a Comment

0Comments

Post a Comment (0)