List of Telangana Forts-తెలంగాణలోని కోటలు
| రాయగిరి కోట | యాదాద్రి భువనగిరి జిల్లా |
| పానగల్ కోట | వనపర్తి జిల్లా |
| కోడూరు కోట | ఆదిలాబాద్ జిల్లాలో వెంకట్రాయుడు నిర్మించాడు |
| రాజాపేట కోట | యాదాద్రి భువనగిరి జిల్లాలో 1775 సం. లో రాజారాయన్న నిర్మించాడు |
| నగునూరు కోట | కరీంనగర్ జిల్లాలో కలదు |
| ప్రతాపగిరి కోట | కాటారం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా |
| రాచకొండ కోట | రంగారెడ్డి జిల్లా. రేచర్ల సింగమనాయకుడు దీని నిర్మాణానికి పునాది వేసాడు |
| దోమకొండ కోట | కామారెడ్డి జిల్లా, ఇది పాకనాటిరెడ్డి శాఖకు చెందిన కామినేని వంశస్థులది |
| ఘన్ పూర్ ఖిల్లా | వనపర్తి జిల్లా. గోనగన్నారెడ్డి కాలంలో నిర్మించబడింది |
| వనపర్తి గడికోట | వనపర్తి జిల్లా. 1868 సం.లో జొన్నమండల దొరసాని ఈ కోట నిర్మాణాన్ని చేపట్టింది |
| ఇందూరు కోట | నిజామాబాద్ జిల్లా, రాష్ట్రకూట రాజయిన మూడవ ఇంద్రుడు నిర్మించాడు |
| కౌలాసి కోట | కామారెడ్డి జిల్లా, రాష్ట్రకూట రాజయిన మూడవ ఇంద్రుడు నిర్మించాడు |
| వరంగల్ కోట | వరంగల్ జిల్లా, కాకతి గణపతిదేవ నిర్మాణాన్ని ప్రారంభించాడు. రాణి రుద్రమదేవి పూర్తి చేసింది |
| గోల్కొండ కోట | హైదరాబాద్, ఈ ప్రాంతాన్ని పూర్వం మంగళవరం/గొల్ల కొండ అని పిలిచే వారు |
| గద్వాల కోట | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద సామ భూపాలుడు నిర్మించాడు |
| దేవరకొండ కోట | నల్గొండ జిల్లాలోని ఈ కోట నిర్మాణాన్ని మాధవ నాయుడు ప్రారంభించాడు |
| ఖమ్మం ఖిల్లా | ఖమ్మం |
| గాంధారి కోట | మంచిర్యాల జిల్లా |
| భువనగిరి ఖిల్లా | యాదాద్రి భువనగిరి జిల్లాలో 4వ త్రిభువన మల్లు కోట నిర్మాణం పూర్తి చేశాడు |
| సిర్పూర్ కోట | కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భీమ్ బల్లాల్ సింగ్ నిర్మించాడు |
| మెదక్ కోట | మెదక్ జిల్లా, రెండవ ప్రతాపరుద్రుని చే నిర్మించబడింది |
| జగిత్యాల కోట | జగిత్యాల జిల్లాలో నక్షత్ర ఆకారంలో ఇబ్రహీంఖాన్ దంసా నిర్మించాడు |
| నిర్మల్ కోట | నిర్మల్ జిల్లా |
| ములంగూర్ కోట | కరీంనగర్ జిల్లా కేశవపట్నంలోని ములంగూర్ గ్రామం దీనిని నిర్మించినది వోదగిరి మొగ్గురాజు |
| రామగిరి ఖిల్లా | పెద్దపల్లి జిల్లా |
| ఎలగందుల కోట | కరీంనగర్ జిల్లా, ఎలగందుల |