గిరిజన పండుగలు
తీజ్ పండుగ
బంజారా యువతులు తండావాసుల సహకారంతో చేసుకునే పండుగ తీజ్.
బంజారా కవులు వర్షాకాలంలో జరుపుకుంటారు
ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు
తీజ్ మొక్కలను గౌరవప్రదంగా అలంకరించే కార్యక్రమం తీజ్తోడొరో అంటారు
ఆకిపెన్
గోండుల యొక్క గ్రామ దేవతను ఆకిపెన్ అంటారు
గోండుల గ్రామ దేవత అయిన ఆకిపెన్ కు వీరు మొదటగా పండిన పండ్లు, కాయలు, మొదటిగా పూసిన పూలను సమర్పిస్తారు
గోండు మాండలికంలో ఈ పండుగను నావోంగ్ అంటారు
పెర్సపేన్
ఈ పండుగను ప్రతి సంవత్సరం ఏప్రిల్మే- నెలలో మరియు డిసెంబర్జ-నవరి నెలల్లో జరుపుకుంటారు
సీతల్ (సీత్లా) పండుగ
దీనిని బలుల పండుగ గా పిలుస్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటారు
ఒకరోజు ముందుగా నానబెట్టిన జొన్నలు, పప్పుధాన్యాలు కలిపి తయారు చేసిన ఘూగ్రి(గుగ్గిళ్ళను) కన్నెపిల్లలకు సీత్లా)కు సమర్పిస్తారు
నిషానీ దేవత
ఈ దేవత విశాఖపట్నంలోని షెడ్యూల్ ఏరియా తెగల యొక్క గ్రామ దేవత
తెలుగు నూతన సంవత్సర పండుగ ఉగాది లేదా చైత్ర పండుగ సందర్భంగా నిషాని దేవతను పూజిస్తారు
చైత్ర మాసంలో జరుపుకుంటారు కాబట్టి దీనిని 'చైత్ర పురబ్' అని పిలుస్తారు. ఇది ఎటికల పండుగగా లేదా ఈటెల పండుగగా బాగా ప్రఖ్యాతి
ఇది ఖమ్మం లోని గిరిజన ప్రాంతాలలో కూడా వేరే పేరుతో జరుపుకుంటారు
పెద్ద దేవుడు
తెలంగాణలోని గిరిజనులు వైశాఖమాసంలో గ్రామ సంక్షేమం కోసం పెద్ద దేవుడు గౌరవార్థం ఈ పండుగను జరుపుకుంటారు
భూమిలో త్రిభుజాకార ఆకృతిలో ఒక రాయిని పాతిపెట్టి దేవునిగా కొలుస్తారు. పరిగి పిట్టను ఈ సందర్భంగా బలిస్తారు.
ఈ పండుగను పొలాలను సాగు చేయడానికి ముందు అనగా మే లేదా జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు రావాలని కోరుకుంటూ జరుపుకుంటారు
నోట్: గోండులు పోలంరాజు, సత్తిపెన్, ఆవుల పెన్, మాసోబా అనే దేవతలను పూజిస్తారు