బోనాలు
వడి: ప్రసాదం లేదా అన్నం ఒక దగ్గర కుప్ప పోయడమే వడి
సాక: బెల్లం పానకంతో తయారుచేస్తారు. బోనాలు అమ్మవారి గుడి దగ్గరకు వచ్చిన తరువాత అందరూ అమ్మవారికి సాక పోస్తారు
పోతురాజు: ఏడుగురు దేవతలకు ఒకే ఒక్క తోడబుట్టిన తమ్ముడు అతని పేరే పోతురాజు. ఇతను ఒంటి నిండా పసుపు నింపుకొని, ఎర్రని ధోవతి మోకాళ్ళ పైకి కట్టుకుని, చేతిలో పసుపుతో చేసిన కొరడా ను ధరించి కాళ్ళకు గజ్జలు, నుదిటిపై పెద్ద కుంకుమ బొట్టు తో ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే పోతురాజు దూకుడు వీరభద్రుడి దూకుళ్లే (దక్ష యజ్ఞ ధ్వంసంలో వీరభద్రుడు ఏ విధంగా దూకుతాడో పోతురాజు కూడా అదే విధంగా దూకుతాడు).
తొట్టెల సమర్పణ: ఇంటి ఆడపడుచు సంతానం కలగాలని, బాలారిష్టాలు పోవాలని అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తారు
రంగం భవిష్యవాణి: బోనాల పండుగ తర్వాత రోజు ఉదయం అమ్మవారిని ఆవహించిన అవివాహిత స్త్రీ మాతంగి పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తుంది
గావు పట్టడం: ఈ పూజలో పాల్గొన్న ఆ వర్గానికి చెందిన ఒక వ్యక్తి లేదా పోతురాజు మేకపోతు గొంతు పట్టి కొరుకుతాడు. దీనికి గళం తెగిపోయేంతవరకు విధిలిస్తాడు. గొంతు పట్టి కొరకడాన్ని గావు పట్టడం అంటారు . ప్రస్తుతం ఇది కూష్మాండబలి (గుమ్మడికాయ, సొరకాయ) గా మారి తన నోటితో తుంపి గావు పట్టడం చేస్తున్నారు.
ఫలహారపు బండ్లు: ఇంటి ఆడపడుచు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తయారు చేసుకొని బోనాల రోజు సాయంత్రం గొర్రెలు,ఒంటెల సాయంతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి ప్రసాదాన్ని సమర్పిస్తుంది.
సాగనంపటం: కొలువు పోతురాజు బలి తరువాత అమ్మవారిని మంగళవాయిద్యాలతో అన్ని వీధుల గుండా ఊరేగిస్తూ ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.
- అమ్మవారిని పూజించే హిందువుల పండుగ
- బోనం, బోనాలు, భోనకాడు, బోనకత్తె, బోనాం అనే పదాలన్నిటికీ భోజనం అని, అన్నమని, వంటపాత్ర అని అర్థాలున్నాయి మరియు భుక్తి, తినుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి
- భోజనం పదమే భోనంగా మారింది
- మహంకాళి, పెద్దమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఉప్పలమ్మ, ఎల్లవ్వ, పోలేరవ్వ, ఈదులమ్మ, వడ్ఢవ్వ వంటి దేవతల దగ్గరకు అన్నం ప్రసాదంగా తీసుకెళ్లడాన్ని బోనం అంటారు
- పకృతి మహా శక్తివంతమైంది. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఇవన్నీ ప్రకృతి వికాసానికి దోహదం చేస్తాయి. ఇందులో ఏది విజృంభించిన భూతాలు (ప్రాణాలు) తట్టుకోవడం కష్టం. వీటివల్లనే చెట్టూ-చేమా, రాయి-రప్ప, మట్టి-గట్టూ పుట్టాయనే విశ్వాసం మానవుల్లో ఏర్పడిన కాలం నుండి ఈ ఆరాధన ప్రారంభమయింది
- వీటి మీద అధ్యయనం చేసిన జానపద నర శాస్త్ర విజ్ఞాన వేత్తలు దీనినే మాత్రారాధనం అంటారు
- మాత్రారాధనం తెలంగాణ తొలిదశలో పల్లెల్లో ఎక్కువగా కనిపించిన కారణంగా గ్రామ దేవతారాధనం అన్నారు. అందుకే బోనాల పండుగను కూడా గ్రామ దేవతారాధనం కింద పరిగణిస్తారు
- బోనాల పండుగలో ముఖ్యంగా అమ్మవారు ఆషాడమాసంలో తన పుట్టింటికి వెళుతుందని అని నమ్మకం
- 2014 జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది
- ఆషాడ మాసం తొలి ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో, హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ, అక్కన్న, మాదన్న మహంకాళీ, లాల్ దర్వాజా మహంకాళి దేవాలయంలో మొత్తం 14 అమ్మవారి దేవాలయాల్లో జరిగి తిరిగి గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ముగుస్తాయి
- దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఈ బోనాల ఉత్సవం కలదు. అయితే పచ్చికుండను నెత్తిన పెట్టుకొని చేసే కరగ నృత్యం అనేది కొన్ని చోట్ల కనిపిస్తుంది
- అమ్మవారికి ఘటంతో (కలశం) స్వాగతం పలుకుతారు. ఈ ఘటంలోకి సూష్మరూపంలో ఉన్న విగ్రహాన్ని తెచ్చి పెడతారు. దీనినే ఉత్సవ విగ్రహం అంటారు.
- బోనంపై ఉన్న దీపం అనేది సూర్యుడికి సూచిక
- బోనం కుండకు రంధ్రాలు చేసి లోపల పెట్టిన దీపం చైతన్య స్వరూపుడైన పరమాత్మకు సూచిక. ఇదే అంతర్యామి. అంతర్యామి వల్లే ఈ చైతన్యం, ఈ వెలుగు