బతుకమ్మ
- బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఇది తొమ్మిది రోజులు జరుగును
- ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక
- తంగేడి పూలు, గునుగు, బంతి పువ్వులు, చామంతి, రుద్రాక్ష, కాకర, కట్ల, బీర, మల్లే, జాజిపూలను వరుసగా ఒకదాని పై ఒకటి పేర్చుతూ బతుకమ్మను తయారు చేస్తారు
- 2014 జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా(Telangana State Festival) దీన్ని ప్రకటించింది
- బతుకమ్మ పండుగను ఒక్కో పేరుతో పిలుస్తూ విభిన్న ఫలహారాలు చేస్తుంటారు.
- ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభించి సద్దుల బతుకమ్మను చెరువులతో విడవడంతో పండుగ ముగుస్తుంది
- ఎందరో గ్రామదేవతలకు ఉత్సవ విగ్రహాలు ఉన్నప్పటికీ బతుకమ్మకు మాత్రం ఉత్సవ విగ్రహం ఉండదు
- నిమజ్జనం తరువాత పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు "వాయినమమ్మా వాయినం" అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు
- మొదటిరోజు- ఎంగిలిపూల బతుకమ్మ (మహాలయ అమావాస్య రోజు) నూకలు, నువ్వుల ఫలహారం
- రెండవ రోజు- అటుకుల బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి) ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు పలహారం
- మూడవరోజు- ముద్దపప్పు బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ ద్వితీయ) తడి బియ్యం, పాలు, బెల్లం పలహారం
- నాలుగవ రోజు- నాన బియ్యం / తండుల బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ తృతీయ) తడి బియ్యం, పాలు, బెల్లం పలహారం
- ఐదవ రోజు- అట్ల బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి) అట్లు
- ఆరవరోజు- అలిగిన బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ పంచమి)
- ఏడవ రోజు- వేపకాయల బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ షష్టి) బియ్యపు పిండిని వేపపండ్ల ఆకారంలో తయారీ
- ఎనిమిదవ రోజు- వెన్న ముద్దల / నవనీత బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) వెన్న,నువ్వులు, బెల్లం పలహారం
- తొమ్మిదవ రోజు- సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ) (ఆశ్వయుజ శుద్ధ అష్టమి) పెరుగన్నం, చింతపండు, నిమ్మకాయ, చిత్రాన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, సత్తుపిండి, నువ్వుల పిండి, పల్లి పిండి పలహారాలు