Introduction to Asaf Jahi Dynasty
అసఫ్ జాహీలు
స్థాపకుడు
|
నిజాం ఉల్-ముల్క్
|
చివరివాడు
|
మీర్ ఉస్మాన్ అలీఖాన్
|
రాజధాని
|
ఔరంగాబాద్, హైదరాబాద్
|
భాష
|
పారశీకం, ఉర్దూ
|
తెగ
|
తురానీ
|
సంస్కరణల మూలపురుషుడు
|
1వ సాలార్ జంగ్
|
- దక్షిణ భారతదేశ మధ్యభాగంలో అనగా దక్కన్ పీఠభూమిలో 224 సంవత్సరముల పాటు పాలించిన అసఫ్ జాహీలు సౌదీ అరేబియాకు (అప్పట్లో టర్కీ రాజ్యంలో అంతర్భాగం) చెందిన వారు
- భారత దేశంలోని 562 సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం - హైదరాబాద్
- అసఫ్ జాహీలు టర్కీ (సౌదీ అరేబియా) లోని తురానీ తెగకు చెందిన వారు.
- ఔరంగజేబు పాలనా కాలంలో తురానీ తెగవారు భారతదేశంలోకి ప్రవేశించారు
- ఔరంగజేబు తురానీతెగకు చెందిన మీర్ ఖమ్రుద్దీన్, అతని తండ్రి మరియు తాతలకు ఉన్నత పదవులు ఇచ్చాడు
- మీర్ ఖమ్రుద్దీన్ ఈ క్రింది మొగల్ చక్రవర్తుల వద్ద పని చేసాడు
ఔరంగజేబు
|
4000 మన్సబ్ దారీ ర్యాంక్
|
1వ షా ఆలం
|
అవధ్ సుబేదార్
|
ఫారూఖ్ సియార్
|
దక్కన్ సుబేదార్
|
మొహమ్మద్ షా రంగీలా
|
మాళ్వ సుబేదార్ & మొఘల్ ప్రధాని
|
- సయ్యద్ సోదరులు (అబ్దుల్లా మరియు హుస్సేన్) మహమ్మద్ షా రంగీలాను ఒక కీలుబొమ్మలాగా నియంత్రించేవారు
- ఈ సయ్యద్ సోదరులను హతమార్చడంలో మీర్ ఖమ్రుద్దీన్ కీలక పాత్ర పోషించాడు
- దీని తరువాత అతను కొంతకాలం ఢిల్లీలో మొగల్ ప్రధానిగా పనిచేశారు ఢిల్లీలో కుట్రలు అధికంగా ఉండటం వల్ల దక్కన్ లో స్వతంత్ర పరిపాలన చేసుకోవాలని నిర్ణయించాడు
- 1724 అక్టోబర్ లో మీర్ ఖమ్రుద్దీన్ షఖర్ఖేదా యుద్ధంలో అప్పటి దక్కన్ సుబేదార్ అయిన ముబారీజ్ ఖాన్ ను ఓడించి తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు
- తాను మొఘల్ సామంతగా ఉంటూ స్వతంత్ర పరిపాలన చేస్తానని ప్రకటించాడు
- దీంతో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా మీర్ ఖమ్రుద్దీన్ అసఫ్ జా అనే బిరుదును ఇచ్చి దక్కన్ సుబేదారుగా నియమించాడు.
- అప్పటినుండి అసఫ్ జాహీల పాలన ఆరంభమైనది