నిజాముల్ ముల్క్:
ఇతని అసలు పేరు - మీర్
ఖమ్రుద్దీన్
చిన్ కిలిచ్ ఖాన్ (ఔరంగజేబు చే)
నిజాముల్ ముల్క్ (ఫారూఖ్
సియార్ చే)
ఫతేజంగ్ (ఫారూఖ్
సియార్ చే)
- నిజాముల్ ముల్క్ రాజధాని - ఔరంగాబాద్
- ఇతను అప్పటి మరాఠా పీష్వా అయినా 1వ బాజీరావు తో అనేక యుద్ధాలు చేసి పరాజయంపాలై క్రింది ఒప్పందాలను కుదుర్చుకున్నాడు
ముంగీ షివ్ గాం 1728
వార్నా 1731
దుర్రాసారాయి 1738
- ముంగీ షివ్ గాం ఒప్పందం ప్రకారం నిజాముల్ ముల్క్ చౌత్ (1/4వ వంతు) మరియు సర్ దేశ్ ముఖీ (1/10వ వంతు) పన్నులను తన సరిహద్దు ప్రాంతాల నుండి వసూలు చేసుకొనుటకు మరాఠాలకు అనుమతి ఇచ్చినాడు
- 1739 లో పర్షియా పాలకుడు నాదిర్షా కర్నల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీ వైపు పయనించాడు
- ఈ విషయాన్ని తెలుసుకొన్న మొఘల్ చక్రవర్తి మొహ్మద్ షా రంగీలా ఢిల్లీ వదిలి పారిపోయాడు
- ఈ విషయాన్ని తెలుసుకొని దక్కన్ పాలకుడు అయిన నిజాముల్ ముల్క్ మహమ్మద్ షా రంగీలాకు సహాయం చేయడానికి ఢిల్లీకి బయలు దేరాడు
- నిజాముల్ ముల్క్ ఢిల్లీలో నాదిర్షా సైనికులు జరుపుతున్న నరమేధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించాడు
- నాదిర్షా మరియు మొహ్మద్ షా రంగీలా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చాడు
- అప్పుడు కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం, సుమారు 70 కోట్ల విలువైన సొత్తు నాదిర్షాకు ఇవ్వడం జరిగింది
- కోహినూర్ వజ్రం → కల్లూరు → అబ్దుల్లా కుతుబ్ షా → షాజహాన్ → మొహ్మద్ షా రంగీలా → నాదిర్షా → అఫ్గాన్ షాషుజా → రంజిత్ సింగ్ → దలీప్ సింగ్ → బ్రిటీష్ (లాహోర్ ఒప్పందం 1846)
- 1748 లో ఆఫ్ఘన్ దండయాత్రికుడు అహ్మద్ షా అబ్దాలీ మొదటిసారిగా భారతదేశంపై దాడి చేశాడు
- అప్పటి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా కు సహాయం చేయుటకు నిజాముల్ ముల్క్ దక్కన్ నుండి ఢిల్లీకి బయలు దేరాడు
- మార్గమధ్యంలో మహారాష్ట్రలోని బుర్హాన్పూర్ లో నిజాముల్ ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు. ఇతనికి ఆరుగురు కుమారులు ఉండేవారు
- పెద్ద కుమారుడు ఘాజీ ఢిల్లీలోనే ఉండుటకు నిర్ణయించుటచే రెండవ కుమారుడు నాజీర్ జంగ్ దక్కన్ పాలకుడయ్యాడు
- నిజాముల్ ముల్క్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు కవిపండిత పోషకుడు మరియు గొప్ప ఉదారవాది
- నిజాముల్ ముల్క్ కలంపేరు - షాకీర్
- ఇతను ప్రజల యోగక్షేమాలు ముఖ్యమని వాటిని ముందు చూడాలని తన మరణ శాసనం లో రాసుకున్నాడు