తెలంగాణాలో వెట్టి, భగీల వ్యవస్థ-2 The System of Vetti and Bhagi in Telangana

TSStudies
The System of Vetti and Bhagi in Telangana
తెలంగాణాలో వెట్టి, భగీల వ్యవస్థ

కుమ్మరులు 
  • కుమ్మరులు అధికారులకు భూస్వాములకు అవసరమైన కుండలివ్వాలి. జాగిర్ద్రార్ గానీ, దేశ్ ముఖ్ గాని హైదరాబాదులో నివాసముంటున్నా, అంత దూరము నడిచి వెళ్లి అవసరమైన కుండలన్నీ ఇచ్చిరావాలి. గ్రామ చావడి లో మకాం వేసిన అధికారికి అవసరమైన కుండలిచ్చిరావాలి. వంట కూడా చేసి పెట్టాలి. మంగలి వారు ప్రతిరోజు దేశ్ ముఖ్ ఇండ్లలో సేవ చేసి రావాలి. రాత్రివేళ భూస్వామి పాదాలను అతని ఒళ్ళు మర్ధనా చేయాలి.
గొల్లవారు 
  • భూస్వాముల ఇండ్లలో ఏదైనా వేడుక జరుపుకున్న ప్రతిసారి గ్రామానికంతటికీ పండగ, పబ్బాలు వచ్చినప్పుడు గొల్లవారు ప్రతి మందనుంచి ఒక గొర్రెనిచ్చి తీరాలి. ఏదో ఒక సాకుతో నైనా భూస్వాములు ఎప్పుడు పడితే అప్పుడు కోరితే గొఱ్ఱె ఇచ్చి తీరాలి.
వ్యాపారులు 
  • గ్రామాలలో వ్యాపారం చేసే వారు పోలీస్ పటేల్ నుండి చీటీ అందగానే గ్రామంలోకి వచ్చిన  అధికారి కైనా మంచి నెయ్యి తో సహా అవసరమైన సరుకులనీ వంతులవారీగా సరఫరా చేయవలసి ఉండేది. వాళ్ళ వద్ద ఏదైనా సరుకు లేకపోయినా ఏదైనా సరుకు ఇవ్వకపోయినా ఇవ్వటానికి వ్యతిరేకించినా నానావిధాలైన చిత్రహింసలకు, అవమానాలకు గురి చేయబడ్డారు 
గ్రామ ప్రజలు 
  • గ్రామ ప్రజలు ప్రత్యేకించి సరఫరా చేయడానికి ఇతర వస్తువులు లేని పేద ప్రజలు ఉచితంగా కోడిపెట్టలు సరఫరా చేయవలసి వచ్చేది.  వెట్టినుండి రైతులను కూడా వదిలి పెట్టేవారు కాదు. ఎవరైనా అధికారి వచ్చినప్పుడల్లా రైతులు వారిని ఉచితంగానే తమ బండ్లలో ఎక్కించుకెళ్ళాలి.  వేళ పడితే వేళప్పుడు ఎడ్లకు మేత వేయడం కూడా ఆపి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చాలి. తమ స్వంత పొలాల్లో పని ప్రారంభించటానికి ముందే గ్రామ అధికారుల, భూస్వాముల పొలాలు దున్ని పెట్టాలి. భూస్వాముల భూములు తడిసే అంతవరకూ రైతుల పొలాలకు నీళ్లు అందనిచ్చేవారు కాదు. అధికారులు, భూస్వాముల పొలాల్లో వ్యవసాయ కార్మికులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలి.  తర్వాత గాని వారు తమ జీవనభృతి కోసం మిగతా రైతులు పనులలోకి వెళ్ళటానికి వీలు లేదు.
ఉద్యోగులు 
  • వివిధ రూపాలలో సాగిన నిర్బంధ చాకిరి చేయించుకున్నది, వసూళ్లు సాగించింది భూస్వాములు మాత్రమే కాదు. చిన్న ఉద్యోగులు, పెద్ద ఉద్యోగులు, గ్రామాలలో నివసిస్తున్న వారు లేదా పర్యటన కోసమో, ప్రత్యేక తనిఖీల కోసమో గ్రామాలకు వచ్చిన వారందరూ విధమైన చాకిరీ చేయించుకోవడం, వసూళ్లు సాగించడం జరిగేది 
బాలికలు 
  • ఈ ఫ్యూడల్ దోపిడీలలో కెల్లా దారుణమైనది. భూస్వాముల ఇళ్ళలో బానిసలుగా బాలికలను పంపించే పద్ధతి . భూస్వాములు తమ కుమార్తెల పెళ్లిళ్లు చేసినప్పుడు బానిసలుగా బాలికలను బహూకరించి, పెండ్లి జరిగిన తమ కుమార్తెలతో పాటే, వారి అత్తవారింట్లో పనిచేయడానికి పంపేవారు. భూస్వాములు బానిస యువతులను ఉంపుడుగత్తెలుగా కూడా ఉపయోగించుకునేవారు 

  • విధంగా వెట్టి విధానం తెలంగాణ ప్రజల జీవిత విధానాన్ని అట్టడుగు స్థాయికి దిగజారింది. బానిసత్వం లోకి నెట్టింది. 
  • మానవుని ఆత్మ గౌరవాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది.  వెట్టి విధానం రద్దు కోసం ఉద్యమం విస్తృతంగా వ్యాపించింది 
  • తమ అక్రమ వసూళ్లలను ఉధృతం చేయడానికి, సాగు చేసుకుంటున్న రైతులను వారి భూముల నుండి భేదాఖల్ చేసి పొలాలను ఇతరులకు కౌలుకు ఇవ్వటానికి వివిధ తరహాలకు చెందిన ప్యూడల్ భూస్వాములు ప్రయత్నించినప్పుడు, అంతకు ముందు కూడా రైతులు వీరోచిత పోరాటాలు సాగించారు.