తెలంగాణాలో వెట్టి, భగీల వ్యవస్థ-1 The System of Vetti and Bhagi in Telangana

TSStudies

The System of Vetti and Bhagi in Telangana
తెలంగాణాలో వెట్టి, భగీల వ్యవస్థ 

వెట్టి విధానం :
  • ఒక వ్యక్తి లేదా ఒక సంఘాన్ని శారీరక నిర్బంధానికి గురిచేసి, వారితో చాకిరీ చేయించుకుని ప్రతిఫలాన్ని ఇవ్వకపోగా, వారి నుండే వసూళ్లను (ధన రూపం/వస్తు రూపం) బలవంతంగా రాబట్టుకుని వారి శ్రమను వారి జీవితాలను దోచుకునే విధానమే వెట్టి విధానం  
దళితులు:
  • ప్రతి దళిత  కుటుంబం వెట్టిచాకిరీ చేయటానికి కుటుంబంలోని ఒక్కరిని కేటాయించవలసి ఉండేదిచిన్న పల్లెలో ప్రతి ఇంటి నుండి ఒక మనిషిని పంపడం జరిగిందిపటేల్ పట్వారి, మాలి పటేల్ లేదా దేశ్ ముఖ్  ఇండ్లలో  గృహ సంబంధమైన పనులు చేయటం, పోలీస్ స్టేషన్ లకు, తాలూకాపీసులకు  రిపోర్టులను మోసుకెళ్ళడం, గ్రామ చావిడికి, బందిలిదొడ్డికి కాపలా కాయడం రోజువారి పని లో భాగమేఇదికాక గ్రామ చావిడికి ఎవరైనా అధికారి వచ్చినప్పుడు వాళ్లకు మరింత ఎక్కువ పని ఉండేదిచిలుకూరు గ్రామంలో ప్రతి రోజు 16 మంది హరిజనులు వెట్టిచాకిరీ చేస్తుండేవారుఅడవుల నుండి కట్టెలు కొట్టి తెచ్చేవారు. టపా మోసుకెళ్లే వారు. టపా గాని, ఇతర సరఫరాలను మోసికెళ్ళినందుకు వారికి రెండున్నర మైళ్లకు ఒక అణా చొప్పున ఇవ్వబడుతునట్లు కాగితాల మీద ఉండేదిఅయితే ఆచరణలో అది కూడా ఇచ్చేవారు కారు విధానాన్ని 'కోసుకు వీసం' అనేవారు  
చర్మకారులు:
  • చర్మకారుల గా పనిచేసే దళితులు తోళ్లను  పదును చేసి చెప్పులు కుట్టినందుకు, వ్యవసాయ పనులకు, బావుల నుండి నీరు తొడడానికి, అవసరమైన తోలు పరికరాలు తయారు చేసినందుకు, అరకలకు పట్టీలు తయారు చేసినందుకు భూస్వాములు ఏమీ చెల్లించేవారు కాదుదళితులు భూస్వాములకు వాటిని ఉచితంగానే సరఫరా చేయవలసి వచ్చేదిమిగతా రైతాంగం మాత్రం దళితులకు ధాన్యరూపం లోనూ, ఇతర వ్యవసాయ పంటల రూపంలోనూ నిర్ణితమైన మేర చెల్లించేవారు  
బోయలు, బెస్తలు, రజకులు:
  • బోయలు, బెస్తలు, రజకుల వంటి మరికొన్ని ఇతర వెనుకబడిన కులాలవారు భూస్వామి కుటుంబాలకు చెందిన పురుషులను, స్త్రీలను పల్లకిలోనో, మేనాలోనో ఎక్కించుకొని తమ భుజాల మీద మోసుకు వెళ్ళవలసి వచ్చేదితమ బంధువులను చూచి రావాలి అనుకున్నప్పుడు, తీర్థాలూ, తిరునాళ్లను సందర్శించవలసినప్పుడల్లా భూస్వాములు విధంగా వారిచే నిర్బంధంగా మోయించుకునేవారుభూస్వామి కుటుంబాల వారు వేగంగా నడిచే ఎడ్లబండ్లలో ప్రయాణం చేసేటప్పుడు బండి ముందు దారి బాగుచేయడానికి, బండి వెనక కాపలాదారుగా వారు పరుగెత్తాల్సి వచ్చేదివారు గుర్రాలపై స్వారీ చేసేటప్పుడు గుర్రాల వద్ద పనిచేసే వ్యక్తులు వాటి వెంట పరుగెత్తాల్సి ఉండేది .
కల్లు గీత కార్మికులు:
  • కల్లుగీత కార్మికులు కల్లు గీత గీత గీస్తూ, భూస్వాముల కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేయడం కోసం 5 నుండి 10 చెట్ల వరకు ప్రత్యేకంగా వారికోసం కేటాయించి ఉండాలివారికి రోజుకు ఐదు కుండల కల్లు సరఫరా చేయాలిపండుగలు పబ్బాలప్పుడు మరింత ఎక్కువ కల్లు ఇచ్చిరావాలి.
చేనేత పని వారు:
  • చేనేత పనివారు భూస్వాముల ఇళ్ళలో పనిచేసే నౌకర్లలకు బట్టలు సరఫరా చేయాలివడ్రంగులు, కమ్మరులు భూస్వాములకు వ్యవసాయ పరికరాలన్నీ ఉచితంగా సరఫరా చేయాలిమరమ్మతులను విధంగానే చేయాలి
రజకులు, దేశ్ ముఖ్ లు:
  • రజకులు, దేశ్ ముఖ్ లు గ్రామ అధికారుల ఇళ్లల్లో బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, గ్రామ చావిడిలో మకాం వేసిన అధికారుల కొరకు మంచాలు, పరుపులు మోసుకెళ్లాలివంట చేయడానికి అవసరమైన అన్నీ చేరవేయాలివారే అధికారుల ఇళ్లల్లో పసుపు కారం కొట్టాలి