పశ్చిమ గాంగులు:
రాజధాని - కోలార్
రాచమర్ల కాలంలో చాముండరాయ శ్రావణ బెళగొళలో గోమఠేశ్వర/బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్టించాడు (18 మీటర్ల ఎత్తు)
తూర్పు గాంగులు:
రాజధాని - కళింగాపురం
అనంతవర్మన్(1078-1143):
భువనేశ్వర్‌లో లింగరాజ దేవాలయం (ఎరోటిక్/నగ్న విగ్రహాలు), పూరీలో జగన్నాధ దేవాలయమును నిర్మించాడు.
నరసింహ-1(1238-1264):
కోణార్క్‌లో సూర్య దేవాలయమును నిర్మించాడు
ఇతర అంశాలు:
చాళుక్యులు:
చాళుక్య శాసనాలు కేవలం మహాసంధి విగ్రహక అంటే శాంతి యుద్ధాల మంత్రి, మహా బ్రాహ్మణ అంటే ప్రధానమంత్రి అని పేర్కొన్నాయి.
వీరి సామ్రాజ్యాన్ని రాష్ట్ర దేశ నాడు అనే విభాగాలుగా చేశారు. “భోగ” అనే మరొక పాలనా విబాగం. ఇది బహుశా ఆధునిక తాలూకా అయి ఉండవచ్చు. దీని పాలకుడు భోగపతి.
వీరి గ్రామ పాలన వ్యవస్థలో మహాజనులు(గ్రామ పెద్దలు), గముండ, గ్రామకుంట లేదా గ్రామ భోగిక అనే రాజోద్యోగులు, కరణాలు అనేవారు గ్రామ లెక్కలను నిర్వహించేవారు.
వీరు పంటలో 1/6 వంతు భూమిశిస్తు వసూలు చేసేవారు.
పండగ పబ్బాలను జరపడానికి, దేవాలయాలకు పూజా ద్రవ్యాలను సమర్పించడానికి పన్నులు వేసేవారు.
రాష్ట్రకూటులు:
వీరి సామాజ్యం రాష్ట్రాలుగా, విషయాలుగా విభజించబడింది.
భుక్తి అనేది తర్వాత పాలనా విభాగం. ఇది చిన్న గ్రామ సముదాయాలుగా విభజించబడినది. అతి చిన్న పాలనా విభాగం గ్రామం.
పల్లవులు:
వీరి కాలంలో పెద్దలు, మంత్రులు, ఇతర వర్దాలవారు కలసి రాజును ఎన్నుకొన్నటువంటి అతి సాధారణ సన్నివేశం. ఈ విధంగా నందివర్మను ఎన్నుకొన్నారు.
వీరి కాలంలో “అధికరణ” అనేవారు న్యాయ పాలనాధికారులు. ధర్మాసన అనేది గ్రామ న్యాయస్థానం.
రాజ్యాన్ని నాడు, కొట్టం, ఉర్ అనే విభాగాలుగా విభజించారు.
చోళుల పరిపాలన:
వీరి రాజధాని మొదట్లో తంజావూర్ వద్ద ఉంది. రాజేంద్ర చోళుడి కాలం నుండి కొత్తగా నిర్మితమైన 'గంగైకొండ' చోళపురం” రాజధానిగా ఏర్పడింది.
రాజుకు సలహా ఇవ్వడానికి “అధిగరైగళ్ల్" అనే పేరుతో ఉద్యోగుల సభ ఉండేది.
కడగమ్ అనే పేరుతో రాజ్యంలో చాలాచోట్ల సైనిక స్థావరాలను నెలకొల్పారు.
'వరిప్-పొట్టగమ్' అనే పేరుతో భూమిశిస్తు రికార్డులను చోళులు ప్రవేశపెట్టారు.
చోళ రాజ్యం నాడు, మండలం, కుగ్రమ్‌గా వర్గీకరించారు. కుర్రమ్ అనే విభాగం గ్రామమైతే, నాడు అనేది దానికంటే పెద్దది. నాడు పాలనలో “బ్రహ్మదేయ” ముఖ్యపాత్ర వహించింది.
మొదటి పరాంతకుడి కాలానికి చెందిన “ఉత్తరమెరూర్” శాసనం స్థానికసభ ఏర్పాటు మరియు పనితీరు గురించి వివరిస్తుంది.
క్రీ.శ. 6-13వ శతాబ్ధాల మధ్యకాలంలో వ్యవసాయం:
దక్షిణ భారతదేశంలో వ్యవసాయ భూమిని “ఎరిపట్టి' లేదా “చెరువుకట్టు భూమి” అని ప్రత్యేకంగా వ్యవహరించారు.
భూమి వంటలో 6వ లేదా 10వ భాగాన్ని వ్యవసాయదారుడు పన్నుగా చెల్లించేవాడు.
ఈ కాలంలో మణిగారమ్, నానాదేశీయులు, తిస్పైవ అయుత్తు-ఐన్నూరువర్ అనే వృత్తి సంఘాలవారు ఉండేవారు. మణిగారమ్ అంటే స్థానిక వర్తక సంఘం, నగరమ్ అంటే దక్షిణ భారతంలో ఒక వ్యవస్థీకరించబడిన విక్రయ కేంద్రం.
చోళుల కాలంలో తూర్పు తీరంలో మహాబలిపురం, నాగాపట్నం, మోటుపల్లి, కృష్ణపట్నం, పశ్చిమ తీరంలో చౌల్స్ సోపార, కాలికట్ ప్రసిద్ధ రేవు పట్టణాలు.
సాహిత్యం:
ఒకటో పరాంతక చోళుని కాలంలో వెంకటమాధవ రాగార్థ దీపిక రచించాడు.
క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన భారవి “కిరాతార్జునీయం” రచించాడు. ఇతనికి తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధనునితో, పల్లవరాజు సింహ . విష్ణువుతో సంబంధముంది.
మహేంద్రవర్మ రచనలైన మత్తవిలాస ప్రహసన, భగవదజ్జుక సమకాలీన మతాల గూర్చి పేర్కొనబడింది.
దండి, పల్లవ నరసింహవర్మ ఆస్థానకవి. “కావ్యదర్శనం” అనే సంక్షిప్త అలంకార శాస్త్రాన్ని గతంలో "దశకుమార" చరిత్రను రచించాడు. ఇది సమకాలీన జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది.
జైన రచయిత సోమదేవ సూరి 'యశస్థితచంపు' నీతి వాక్యామృతి అను కృతులను రాశాడు.
కన్నడంలో:
మొట్టమొదటి గ్రంథం నృపతుంగుని “కవిరాజ మార్గం” అలంకార శాస్త్రంపై దీన్ని అత్యుత్తమ గ్రంథంగా పరిగణిస్తారు.
పంప “అదిపురాణం”లో మొదటి తీర్ధంకరుని జీవిత చరిత్ర, “విక్రమార్ద్డున విజయం” మహాభారత కథకు అనుసరణ.
ఈ కాలంలోనే పొన్న శాంతి పురాణాన్ని రెండో తీర్ధంకరునిపై రన్న “అజితపురాణ'మనే చంపూ కావ్యాన్ని కూర్చాడు.
మొట్టమొదటి తెలుగు సాహిత్య గ్రంథం -నన్నయ “మహాభారతం”
చాళుక్య, రాష్ట్రకూట రాజులు ధరించిన 'శ్రీపృథ్వీ వల్లభ' అనే బిరుదు వారు బహుశా విష్ణు అవతారమని చెప్పుకోవడానికి కావచ్చు.
వాస్తు శిల్ప కళలు:
ఆంధ్ర దేశంలో క్రీ.శ. 6వ శతాబ్ధంలో విష్ణుకుండినులు చెప్పుకోదగినవారు.
పోషణలో విజయవాడలోని దేవాలయం, ఉండవల్లిలోని అనంతశయన గుడి నేటికి ప్రతీకలుగా ఉన్నాయి.
మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో మామల్ల శైలికి చెందిన పది మండపాలుండేవి. వీటిని రథాలు అని కూడా అంటారు.
రెండో నరసింహవర్మ రాజసింహుడు మహాబలిపురంలో నిర్మించిన తీర దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనది.
చోళ ఆలయాలు:
వీరి ప్రధాన శైలి 'విమాన' నిర్మాణం.
చోళుల ఆలయాలన్నింటిలో తంజావూరులోని బృహదీశ్వరాలయం రాజరాజచోళుడు నిర్మించిన గొప్ప నిర్మాణం.
రాజేంద్ర చోలుడు గంగైకొండ చోళపురంలో ఇంచుమించు ఇటువంటి చిన్న దేవాలయాలను నిర్మించాడు.
నటరాజ కాంస్య విగ్రహాలకు చోళులు ముఖ్యంగా చెప్పుకోదగినవారు.
చాళుక్య దేవాలయాలు:
అలంపురంలోని నవ బ్రహ్మాలయం, పుట్టడకల్, విరూపాక్ష దేవాలయాలు వీరి కాలంలో చెప్పుకోదగినవి.
రాష్ట్రకూటులు:
వీరి కాలంలో ఎల్లోరాలో అనేక గుహలు నిర్మించబడ్డాయి. ఒకటో కృష్ణుని కాలంలో కైలాసనాథుని ఏక శివాలయం నిర్మించబడింది.