పరివర్తన కాలం-8

TSStudies
వేములవాడ చాళుక్యులు(Chalukyas of Vemulavada):
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా ఉంటూ బోధన్‌, వేములవాడలను కేంద్రాలుగా చేసుకొని తెలంగాణలో పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు.
వీరి రాజధానులు:
తొలి రాజధాని - బోధన్‌
తర్వాత రాజధాని - వేములవాడ
బి.యన్‌. శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణలోని సపాదలక్ష దేశమును రాష్ట్రకూటుల సామంతులుగా బోధన్‌, గంగాధర, వేములవాడ వట్టణాలను రాజధానులుగా పాలించినవారు వేములవాడ చాళు క్యులు.
సపాదలక్ష దేశము అనగా ఒక లక్షా యాఖై వేల బంగారు నాణెముల ఆదాయం కలిగిన దేశం (కొందరి అభిప్రాయం ప్రకారం లక్షా పాతిక వేల గ్రామాలు కలిగిన దేశం).
గోదావరి నదికి దక్షిణాన గల మంజీర నది నుండి మహాకాళేశ్వర పర్యంతం వ్యావించివున్న భూభాగమే పోదననాడు. దీన్నే సపాదలక్ష దేశం అంటారు. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం.
తర్వాత కాలంలో ఈ ప్రాంతం కరీంనగర్‌ జిల్లాలోని సబ్బినాడని, సబ్బిసాయర్‌ మండలమని పిలువబడింది
క్రీ.శ. 750-973 వరకు సుమారు 225 సం॥ల పాటు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా పాలించారు
Chalukyas of Vemulavada dynasty in telugu,founder of Chalukyas of Vemulavada,Chalukyas of Vemulavada history in telugu,vemlavada chalukyas dynasty in telugu.founder of vemlavada chalukya dynasty in telugu,kings list of Chalukyas of Vemulavada,kings list of vemulawada chalukyas dynasty,tspsc notes in telugu,tspsc study material in telugu,ts studies,tsstudies,ts study circle,indian history in telugu,ancient indian history in teluug,telangana history in teluug,indian ancient history in telugu,telangana history notes in telugu

తొలి పాలకులు :
1) సత్యాశయ రణవిక్రముడు క్రీ.శ. 641-660
2) పృథ్వీపతి క్రీ.శ. 660-695
3) మహారాజు క్రీశ. 695-725
4) రాజాధిపత్య పృదువిక్రముడు క్రీ.శ. 725-750

వేములవాడ చాళుక్య మూల పురుషుడు సత్యాశయ రణవిక్రముడు (కొల్లిపర శాసనం ప్రకారం)
ఇతను బాదామి చాళుక్య రాజైన 2వ పులకేశి నుండి బోధన్‌ ప్రాంతాన్ని పొంది పాలించారు
సత్యాశ్రయ రణవిక్రముడి తర్వాత మిగతా వారు ఈ రాజ్యాన్ని పాలించినవ్పటికీ వీరి పరిపాలనకు సంబంధించిన విషయాలు పెద్దగా తెలియలేదు

వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీశ. 750-780) :
ఇతను వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు
ఇతను రాష్ట్రకూట రాజ్య స్థాపకుడైన దంతిదుర్గుడి వద్ద సేనాధిపతిగా ఉంటూ అనేక యుద్ధాలలో పాల్గొని చిత్రకోట దుర్గాన్ని అనగా చిత్తూరు దుర్గాన్ని జయించాడు.
దంతిదుర్గుడు ఇతని సేవలకు గుర్తింపుగా బోధన్‌, కరీంనగర్‌ జిల్లాలతో కూడిన సపాదలక్ష అనే దేశానికి సామంతరాజుగా నియమించాడు
ఇతను బోధన్‌ పట్టణాన్ని రాజధానిగా చేనుకొని పాలించాడు
ఇతను బోధన్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు
విక్రమార్జున విజయం ప్రకారం ఇతనికి గజదళం ఎక్కువగా ఉందని మరియు ఏనుగులు బోధన్‌ పట్టణంలోని నూనె సముద్రంలో స్నానమాదేవని తెలుస్తోంది
కొల్లిపర తామ్ర శాసనం ప్రకారం ఇతను తురుష్క యవన, కాంబోజ, ఆపష్మీర, నేపాలీ, మగధ, కళింగ దేశాలను జయించినట్లు తెలుస్తోంది.
వినయాదిత్య యుద్ధమల్లుడికి ఇద్దరు కుమారులు
1. మొదటి అరికేసరి
2. భీరన్న గృహుడు

మొదటి అరికేసరి :
బిరుదులు - సహస్రనామ, సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర
ఇతను 'కొల్లిపర' అనే శాసనాన్ని వేయించాడు
ఇతను ద్రువిడి సామంతుడిగా తూర్పు చాళుక్య రాజైన 4వ విష్ణువర్థునిపై యుద్ధం చేసి వేంగి, త్రికళింగలను కొల్లిపర శాసనం, విక్రమార్జుని విజయం ద్వారా తెలుస్తోంది.
ఈ విజయాలకు గుర్తుగా ధృవుడు మొదటి అరికేసరికి నల్గొండ జిల్లాలోని రామడుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ అనే ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు.
దీంతో వేములవాడ చాళుక్య రాజ్యం తూర్పు వైపున విస్తరించడం వల్ల మొదటి అరికేసరి తన రాజధానిని బోధన్‌ నుండి వేములవాడకు మార్చాడు.
మొదటి అరికేనరి కాలాముఖ శైవాచార్యుడైన ముగ్దశివాచార్యునికి రామడుగు విషయంలోని బెల్మోగ అనే గ్రామాన్ని దానం చేని కొల్లివర శాననాన్ని వేయించాడు
బి.యన్‌.శాస్తి ప్రకారం బెల్మోగ అనే గ్రామం నల్గొండ జిల్లాలోని పెద్దవూర గ్రామమని తెలుస్తోంది.
ఇతను గొప్ప శైవ భక్తుడు
మొదటి అరికేసరి సోదరుడు భీరన్న గృహుడి కురవగుట్ట అనే శాసనం ప్రకారం నాగర్‌కర్నూల్‌, దేవరకొండ, పెద్దవూర ప్రాంతాలు కొంతకాలం వేములవాడ చాళుక్య రాజ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

నరసింహుడు (క్రీ.శ.800-835) :
ఇతను అరికేసరి పెద్ద కుమారుడు

2వ యుద్ధమల్లుడు :
ఇతను నరసింహుడి యొక్క కుమారుడు

1వ బద్దెగుడు / బద్దెన (క్రీ.శ.870-895) :
మొదటి అరికేసరి తర్వాత పేర్కొనదగినవాడు
బిరుదు - సోలదండడు (అనగా 42 యుద్దాలు చేసిన వీరుడు)
ఇతను 2వ కృష్ణుని తరపున తూర్పు చాళుక్య రాజైన మొదటి భీముని మీద యుద్ధం చేసి, అతడిని ఓడించి బందీగా పట్టుకున్నట్లు పర్భణీ అనే శాసనం వల్ల తెలుస్తోంది.
బద్దెగ తన రాజ్యాన్ని బస్తర్‌ (చక్రకూట రాజ్యం) వరకు విస్తరింపజేశాడు
ఇతను తన పేరు వీదుగా వేములవాడలో బద్దేశ్వరాలయాన్ని నిర్మించాడు. దీనినే వేములవాడలోని భీమేశ్వరాలయంగా గుర్తించారు

3వ యుద్ధమల్లుడు (క్రీ.శ..895-910) :
ఇతను 1వ బద్దెగుడి కుమారుడు

2వ నరసింహుడు (క్రీశ.910-930) :
ఇతను 3వ యుద్ధమల్లుడి కుమారుడు
ఇతను రాష్ట్రకూట రాజైన 3వ ఇంద్రుడి యొక్క సామంతుడు
ఇతను 3వ ఇంద్రుడి పక్షాన ఉత్తర బారతదేశంపై దండెత్తి లాట (గుజరాత్‌), మాళవ (మధ్యప్రదేశ్‌) ప్రాంతాలను జయించినట్లు వేములవాడ శాసనం ద్వారా తెలుస్తోంది.
కాలప్రియ అనే చోట 2వ నరసింహుడు గూర్జర ప్రతీహార రాజైన మహిపాలుడిని ఓడించి, తన సైన్యాన్ని గంగా, యమున నదీ తీరాలకు నడిపి కన్యాకుబ్జ అనే నగరం వద్ద తన అశ్వాలకు నీరు తాగించాడు
తిరిగి వచ్చేటపుడు తన విజయాలకు గుర్తింపుగా కాలప్రియ వద్ద విజయ స్తంభాన్ని నాటాడు.
దీనికి ప్రతిఫలంగా 3వ ఇంద్రుడు తన సోదరి జాకవ్వను ఇతనికి ఇచ్చి వివాహం జరిపించాడు
కాలప్రియ అనే ప్రాంతాన్ని నేటి యమునా నదీతీరంలోని కాల్ఫీగా గుర్తించారు
ఇతని కాలంలో వేములవాడలో జైన చౌముఖాలు చెక్కబడ్డాయి

2వ అరికేసరి (క్రీశ.930-655) :
ఇతను 2వ నరసింహుడు, జాకవ్వల కుమారుడు
వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు
బిరుదులు - త్రిభువనమల్ల, ఉదాత్తనారాయణ, ఆరూడ సర్వజ్ఞ పాంబరాంకుశ, అమ్మన గంధవారణ, గుణార్జవ, గుణనిధి
ఇతను తన మేనమామ 3వ ఇంద్రుడి కుమార్తె రేవక నిర్మాడితో పాటు మరో రాష్ట్రకూట రాకుమార్తె అయిన లోకాంబికను కూడా వివాహం చేసుకున్నాడు
ఇతని కాలంలో రాష్ట్రకూటుల రాజ్యంలో వారసత్వ యుద్దాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రకూట రాజులైన బద్దెగుడు(3వ అమోఘవర్షుడు), 4వ గోవిందుడికి మధ్య జరిగిన వారసత్వ యుద్దాలలో 2వ అరికేసరి బద్దెగుడకి మద్దతు పలికాడు
2వ అరికేసరి గొప్పకవి, పండితుడు
ఇతని ఆస్థానకవి - పంపకవి (పంపడు)
పంపకవి రచనలు - విక్రమార్జుని విజయం, ఆది పురాణం పంపకవి విక్రమార్జుని విజయంలో 2వ అరికేసరిని నాయకుడిగా అర్జునితో పోల్చి మహాప్రబంధంగా తీర్చిదిద్దాడు.
దీనికి గాను 2వ అరికేసరి పంపకవికి జగిత్యాల తాలూకాలోని ధర్మపురి అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి, కవితా గుణార్ణవుడు అనే బిరుదు ఇచ్చాడు.
పంపకవి సోదరుడు జీనవల్లభుడు వేయించిన కర్య్యూల శాసనం ప్రకారం పంపకవి క్రీ.శ.902లో జన్మించాడని, క్రీ.శ.941లో ఆదిపురాణంను రచించాడని తెలుస్తోంది.
ఆదివురాణం జైనమత మొదటి తీర్ణంకరుడైన వృషభనాథుని చరిత్ర/పంచ కళ్యాణం గురించి తెలుపుతుంది
2వ అరికేనరి అనేకమంది జైన గురువులను, పండితులను ఆదరించాడు
జీనవల్లభుడి ప్రోత్సాహంతో మల్లియరేచన అనే అతడు కవిజనాశ్రయం అనే ఛందో గ్రంథాన్ని రచించాడు.
(గమనిక : వేములవాడ భీమకవి కవిజనాాశయం అనే ఛందో గ్రంథాన్ని రచించినట్లు వాడుకలో ఉంది. )
2వ అరికేసరి తన పేరుతో బోధన్‌లో అరికేసరి జీనాలయాన్ని నిర్మించాడు.
కరీంనగర్‌ శాసనాన్ని బట్టి సబ్బినాడులోని 20 వేల గ్రామాలు ఉన్నట్లు, చెన్నూరు శాసనాన్ని బట్టి పోదననాడు 2వ అరికేసరి రాజ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాగరాజు (క్రీశ.955-960) :
ఇతను 2వ అరికేసరి, రేవక నిర్మాడిల కుమారుడు
రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుని సామంతుడు.
గంగాధర వట్టణాన్ని రాజధానిగా చేనుకొని పరిపాలించాడు
ఇతని ఆస్థానకవి - సోమదేవసూరి
సోమదేవసూరి యశస్తిలక చంపూ అనే కావ్యాన్ని యశోధర మహారాజు చరిత, సన్నావతి ప్రకరణ, యుక్తి చింతామణి అనే గ్రంథాలను రచించాడు.
ఇతనికి సంతానం లేని కారణంగా ఇతని సోదరుడు రాజ్యానికి వచ్చాడు.

2వ బద్దెగుడు/భద్రదేవ (క్రీశ.960-65) :
ఇతను 2వ అరికేసరి, లోకాంబికల కుమారుడు
ఇతను తన విద్యా గురువు అయిన సోమదేవసూరి కోసం శుభదామ జీనాలయమును నిర్మించినట్లు వేములవాడ శాసనం తెలుపుతోంది
శుభదామ జీనాలయమునకు బద్దెగ జీనాలయము అనే 'పేరు కూడా ఉంది.

3వ అరికేసరి (క్రీశ.965-973) :
ఇతను 2వ బద్దెగుని కుమారుడు
ఇతను వేములవాడ వంశ చాళుక్యులలో చివరివాడు
ఇతను సోమదేవసూరికి వనికటుపలు గ్రామాన్ని శుభదామ జీనాలయాన్ని దానమిస్తూ క్రీ.శ. 966లో పర్చణీ తామ్ర శాసనం వేయించాడు.
వేములవాడ చాళుక్యులు పర్చణీ తామ శాసనంలో తాము సూర్యవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు.
3వ అరికేసరి రాజధాని - వేములవాడ
రేపాక శాసనం ప్రకారం క్రీ.శ.968లో 3వ అరికేసరి రేపాక అనే గ్రామంలో జైనాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. రేపాక అనే గ్రామం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల తాలూకాలో కలదు.
క్రీ.శ.973 నాటికి వేములవాడ చాళుక్య వంశం అంతమయింది.
కానీ, కాజీపేట దర్గా శాసనం ప్రకారం కాకతీయ మొదటి ప్రోలరాజు 3వ అరికేసరి కుమారుడైన 3వ బద్దెడుగుని పారద్రోలి ఉంటారని, దీంతో వేములవాడ చాళుక్య రాజ్యం అంతరించిందని బి.యన్‌.శాస్త్రీ గారు పేర్కొన్నారు.
వేములవాడ చాళుక్యుల అనంతరం తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల ఆధీనంలోకి వచ్చింది.

పరిపాలన
వీరి కాలంలో గ్రామం 12 మంది ఆధీనంలో ఉండేది
1 గ్రామాధికారి
2 న్యాయాధికారి
3 కరణం
4 గ్రస్థి
5 నీరుడికాడు
6 తలారీ
7 జ్యోతిష్యుడు
8 కమ్మరి
9 వడ్రంగి
10 చాకలి
11 మంగలి
12 గ్రామ ఉపాధ్యాయుడు
వీరికి భూమిపై లభించే పన్ను ముఖ్య ఆదాయవనరుగా ఉండేది
వడ్డీ వ్యాపారం అమలులో ఉండేది
వృత్తికారులు - సాలె, చర్మకార, కంచర
అధికారులు - గౌండ, గౌడ, పటేల్‌, రెడ్డి
మతం
శైవ మతంతో పాటు జైనమతం కూడా బాగా అభివృద్ధి చెందినది.
వేములవాడ చ్వాళుక్య రాజులలో కొందరు జైనమతాన్ని పోషించారు. మరికొందరు శైవ మతాన్ని పోషించారు
జీనవల్లభుడు లాంటి వారు జైన మందిరాలను నిర్మించి, జైన మత అభివృద్ధికి తోడ్పడ్డాడు
బొమ్మలగుట్ట అనే ప్రాంతం జైన మత కేంద్రం వర్ధిల్లింది.
వైదిక మతం నుండి జైన మతంలోకి మారినవారు తమ పూర్ణాన్ని విడిచిపెట్టేవారు కాదు.
వేములవాడ చాళుక్యులు తమ పేర్ల మీదుగా అరికేసరి, బౌద్ధేశ్వర లాంటి ఆలయాలు నిర్మించారు.

సాహిత్యం
పంపా కవి
కన్నడ సాహిత్యంలో ఆదికవి - పంపా కవి
ఇతని రచనలు - ఆదిపురాణం, విక్రమార్జుని విజయం
పంపా కవి బద్దెగని మొసళాయండిదిరం తీరెనీరో కొత్త
భీమననతి గర్వదింపిడియెగా వర్ణించారు. అనగా మడుగులోని మొసలిని పట్టుకున్నట్లు చాళుక్య భీమున్ని బద్దెగ బంధించాడని చెప్పబడింది.
ఇతను 2వ అరికేసరి ఆస్థానకవి

జీనవల్లభుడు
ఇతను పంపా కవి సోదరుడు
ఇతను కర్యాల శాసనాన్ని వేయించాడు
తెలంగాణలో క్రీ.శ.940 నాటి కర్యాల శాసనంలో మొదటిసారి పద్యాలు లభించాయి. ఈ శాసనంలో 3 కంద పద్యాలతో పాటు సంస్కృత, కన్నడ పద్యాలు కూడా ఉన్నాయి
ఇతను కర్యాలగుట్టపై చక్రీశ్వరీ జీనాలయమును నిర్మాంచాడు.

మల్లియ రేచన
ఇతను రచించిన కవిజనాశ్రయం అనే ఛందో గ్రంథం తెలుగులో మొదటి లక్షణ గ్రంథం

సోమదేవసూరి
ఇతను సుప్రసిద్ధ జైనమతాచార్యుడు
బిరుదులు - శ్యాద్వాద చలసింహ తార్కిక చక్రవర్తి, కవిరాజు
రచనలు -  యశస్థిలక చంపూకావ్యం, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి, సన్నావారి ప్రకరణ, యశోధర మహారాజు చరిత్ర

2వ బద్దెగుడు
రచనలు - నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీ శతకం
కొందరు చరిత్రకారుల ప్రకారం బద్దెన మరియు బద్దెగుడు ఒకరేనని పేర్కొంటారు