బాదామి చాళుక్యులు:
బాదామి చాళుక్యుల జన్మస్థలం - హిరణ్య (కడప, కర్నూలు)
వీరు త్రిలోచన పల్లవులచే ఓటమి పాలై జన్మస్థలాన్ని విడిచి పెట్టారు.
వీరు మొదట ఇక్ష్వాకులు మరియు వాకాటకుల వద్ద అధికారులుగా ఉండేవారు
వాకాటక రాజ్యం విష్ణుకుండినుల రాజ్యంలో విలీనమైన తర్వాత విష్ణుకుండినులు సామంతులుగా ఉన్నారు
తదనంతరం పశ్చిమ దిశలో బాదామి వైపు పయనించి అక్కడ స్వతంత్ర రాజ్యం స్థాపించారు
బిల్హణుని 'విక్రమాంక దేవ చరితం' ప్రకారం వీరు అయోధ్య ఇక్ష్వాకు వంశస్తులు
వీరి మూల పురుషుడు జయసింహ వల్లభుడు
జయసింహ వల్లభుని మనవడు 1వ పులకేశి
1వ పులకేశి (క్రీశ.540-66) :
బాదామి చాళుక్య వంశ స్థాపకుడు.
1వ కీర్తివర్మ (566-96):
ఇతని విజయాల గురించి బాదామి శాననంలో పేర్కొనబడ్డాయి
ఇతను హంగ, వంగ, కళింగ మొదలగు రాజ్యాలను ఓడించి తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు
బనవాసి కదంబులను కూడా ఓడించాడు.
మంగలేశ :
బిరుదు - పరమ భాగవత
1వ కీర్తివర్మ కుమారుడైన 2వ పులకేశి మైనర్ అవుటచే అతని రక్షకుడిగా బాబాయి అయిన మంగలేశ పరిపాలించాడు.
ఇతను రేవతి ద్వీపాన్ని జయించాడు
2వ పులకేశి (క్రీశ. 610-642) :
బాదామి చాళుక్యులలో గొప్పవాడు
బిరుదు - పరమేశ్వర
ఇతను ఐహోల్ శాననాన్ని వేయించాడు. దీన్ని లిఖించినవాడు రవికీర్తి
ఐహోల్ శాసనం ప్రకారం 2వ పులకేశి కనౌజ్ పాలకుడు అయిన హర్షవర్థనుడిని నర్మద యుద్ధంలో ఓడించాడు
ఇతని ఆస్థానాన్ని 'హుయాన్‌త్సాంగ్' సందర్శించాడు
ఇతను పర్షియా రాజు ఖుస్రోకు తన రాయబారాన్ని పంపాడు
పుల్లలూర్ యుద్ధంలో మహేంద్రవర్మన్‌ను ఓడించి, కృష్ణా-గోదావరి నదుల మధ్యనున్న వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి దాన్ని పాలించుటకు తన సోదరుడైన కుబ్జవిష్ణువర్ధనుడిని పంపాడు
ఈ కుబ్జ విష్ణువర్ధనుడే క్రీ.శ.624లో వేంగిలో స్వతంత్రం ప్రకటించుకొని వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యుల పరిపాలనను ప్రారంభించాడు
మణిమంగళ్ యుద్ధంలో పల్లవ రాజు 1వ నరసింహవర్మన్ 2వ పులకేశిని హతమార్చాడు. అప్పుడే 1వ నరసింహవర్మన్ 'వాతాపికొండ' అనే బిరుదు పొందాడు.
2వ పులకేశి మరణానంతరం బాదామి చాళుక్య పాలకులు
ఆదిత్యవర్మ క్రీ.శ. 642-45
చంద్రాదిత్యుడు క్రీశ. 645-49
రణరంగుడు క్రీ.శ. 649-55
మొదటి విక్రమాదిత్యుడు క్రీ.శ. 655-811
వినయాదిత్యుడు క్రీ.శ 681-96
విజయాదిత్యుడు క్రీ.శ. 696-733
2వ విక్రమాదిత్య క్రీశ. 733-44
2వ కీర్తివర్మ (క్రీశ.744-55) :
బాదామి చాళుక్యలలో చివరివాడు
రాష్ట్రకూట దంతిదుర్గుడు ఇతడిని ఓడించి బాదామి చాళుక్య పాలనను అంతం చేసాడు.
శిల్పకళ:
బాదామి చాళుక్యులు వేసర అనే శిల్పకళను ప్రవేశపెట్టారు
ద్రవిడ శిల్పకళ(విమాన శిల్పకళ) మరియు బౌద్ధ శిల్పకళ మిశ్రమాన్ని వేసర శిల్పకళ అంటారు
వీరు వేసర శిల్పకళలో 90 దేవాలయాలు నిర్మించారు
వీటిలో 70 దేవాలయాలు ఐహోల్‌లో ఉన్నాయి. 10 దేవాలయాలు బాదామిలో, 10 దేవాలయాలు పట్టడిగల్‌లో ఉన్నాయి
పట్టడిగల్‌లో ప్రధాన దేవాలయాలు - పాపనాథ, విరూపాక్ష దేవాలయాలు
ఆలంపురంలో నవబ్రహ్మ, జోగులాంబ ఆలయాలు వీరి కాలం నాటివే
కృష్ణా, తుంగభద్ర నదుల కలయిక వద్ద నిర్మించబడిన సంగమేశ్వర ఆలయం కూడా వీరి కాలం' నాటిదే