రాష్ట్రకూటులు
రాష్ట్రకూటులు వుందట బాదావి చాళుక్యుల సామంతులుగా కొంతకాలం పాలించారు
వీరి మూల పురుషుడు - ఇంద్రవర్మ
రాష్ట్రకూటుల స్థాపకుడు - దంతిదుర్లుడు
వీరి మొదటి రాజధాని - ఎల్లోరా
తర్వాత రాజధాని - మాన్యఖేట్
వీరు సుమారు 200 నం॥ల పాటు మహారాష్ట్ర కర్ణాటకలతో పాటు తెలంగాణను పాలించారు
దంతిదుర్లుడు :
ఇతను బాదామి చాళుక్య చివరి రాజు అయిన 2వ కీర్తివర్మను ఓడించి రాష్ట్రకూట రాజ్య స్థాపన చేశాడు
ఇతను ఎల్లోరా నుంచి పాలించాడు
ఇతను ఎల్లోరాలో దశావతార దేవాలయం నిర్మించాడు. ఈ దేవాలయంలో విష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని వధిస్తున్న దృశ్యం అత్యధికంగా ఆకర్షిస్తుంది
ఇతను ఎల్లోరా మరియు సమంగడ్ శాసనాలను వేయించాడు
ఇతను తన కుమార్తె రేవను పల్లవ రాజు అయిన నందివర్మకు ఇచ్చి వివాహం చేశాడు
1వ కృష్ణుడు (758-772) :
ఇతను ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయ నిర్మాణమును ప్రారంభించాడు
ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు 100 సంలు పట్టింది
2వ గోవిందుడు (772-80) :
సింహాసనం కోసం ఇతనికి మరియు ఇతని సోదరుడు ధృవుడు మధ్య వారసత్వ యుద్ధం జరిగింది
ఈ వారసత్వ యుద్ధంలో వేంగి చాళుక్య రాజు 4వ విష్ణువర్ధనుడు 2వ గోవిందుడికి సహకరించాడు. దీంతో 2వ గోవిందుడు పాలకుడు కాగలిగాడు. కానీ, 2వ గోవిందుడు ఎక్కువ కాలం సింహాసనంపై కొనసాగలేకపోయాడు. ధృవుడు తిరుగుబాటు చేసి క్రీ.శ.780లో సింహాసనాన్ని ఆక్రమించాడు
ధృవుడు (780-92) :
ఇతని బిరుదులు - నిరూపమ,ధారవర్ష శ్రీవల్లభ, కవి వల్లభ
ఇతను వేములవాడ రాజు అయిన 1వ అరికేసరి సహాయం పొంది వేంగి చాళుక్య రాజు 4వ విమ్ణువర్థనుడిని ఓడించి అతని కుమార్తె అయిన శీలమహాదేవిని వివాహమాడాడు
ఇతను బెంగాల్‌లో పాలవంశ రాజు అయిన ధర్మపాలుడిని ఓడించాడు
ఇతనే మొట్టమొదటగా ఉత్తర భారతదేశంలో రాష్ట్రకూటుల అధికారాన్ని వ్యాప్తి చేశాడు
3వ గోవిందుడు (792-814) :
ఇతను గొప్ప యుద్ధ వీరుడు
ఇతను ప్రతిహార రాజు నాగభట్టుడిని ఓడించాడు. ఇతను కనోజ్‌ను పాలిస్తున్న చక్రాయుధుడిని కూడా ఓడించాడు.
అమోఘవర్షుడు (814-80) :
ఇతనికి గల మరో పేరు - నృపతుంగ
ఇతను అతి పిన్న వయస్సులో పాలకుడు అయ్యాడు
ఇతని సంరక్షకుడు కర్కరాజు
రాష్ట్రకూట పాలకుల్లో గొప్పవాడు అమోఘవర్షుడు
ఇతను ఎల్లోరాలోని 38వ గుహలో ఖోటా కైలాస ఆలయమును నిర్మించాడు
ఇతను మాన్యభఖేట్ పట్టణాన్ని నిర్మించి, రాజధానిని ఎల్లోరా నుంచి మాన్యఖేట్‌కు మార్చాడు
ఇతను జైన మతాన్ని ఆదరించాడు
భారతదేశంలో జైన మతాన్ని ఆదరించిన చివరి గొప్ప పాలకుడిగా అమోఘవర్షుడు ప్రసిద్ధి చెందాడు
ఇతను ఒక గొప్ప కవి కూడా
ఇతను కవిరాజమార్గం మరియు ప్రశ్నోత్తర రత్నమాల అనే గ్రంథాలను రచించాడు
ఇతని ఆస్థానకవి హరిసేనుడు హరి వంశమును రచించాడు
పంపా రచించిన ఆదిపురాణంలో కొంత భాగాన్ని హరిసేనుడు రచించాడు
ఇతని ఆస్థానాన్ని అరబ్ యాత్రికుదైన సులేమాన్ సందర్శించి, అమోఘవర్షుడి గొప్పతనాన్ని ప్రశంసించాడు
2వ కృష్ణుడు (880-913) :
ఇతను వేంగి చాళుక్య రాజు అయిన గుణగ విజయాదిత్యుడిచే ఓడించబడ్డాడు
3వ ఇంద్రుడు (913-29) :
ఇతను గొప్ప యుద్ధవీరుడు
ఇతను క్రీ.శ.916లో కనోజ్‌ను ఆక్రమించాడు
(అప్పట్లో కనోజ్ ఆక్రమణ కొరకు పాల వంశం, ప్రతిహార వంశం, రాష్ట్రకూటుల మధ్య యుద్దాలు జరిగేవి)
ఇతని తర్వాత నామామాత్రపు పాలకులు
2వ అమోఘవర్షుడు - క్రీ.శ. 929-30
4వ గోవిందుడు- క్రీశ. 930-36
బద్దెగ - క్రీశ. 936-39
3వ కృష్ణుడు (939-67):
ఇతను ఉజ్జయిని మహిపాలుడిని ఓడించాడు.
ఇతను తక్కోళం యుద్ధంలో చోళ పరాంతకుడిని ఓడించాడు
ఇతని ఆస్థానకవి హలాయుధుడు కవిరహస్యం అనే గ్రంథాన్ని రచించాడు
ఇతని ఆస్థానంలోనే పొన్న కవి ఉండేవాడు. పొన్న కవి శాంతినాథ పురాణంను రచించాడు
2వ కర్మ్కరాజు (967-73) :
ఇతను రాష్ట్రకూటుల చివరి రాజు
2వ త్రైలవుడు ఇతడిని ఓడించి మాన్యఖేట్‌లో కళ్యాణి చాళుక్యుల రాజ్య స్థాపన చేశాడు. దీంతో రాష్ట్రకూటుల పాలన అంతమైంది
ఇతని తర్వాత రాస్త్రకూటుల్లో ఒక నామమాత్రపు రాజుగా 4వ ఇంద్రుడు కొనసాగాడు
సాంస్కృతిక వికాసం:
బాదామి చాళుక్యుల కాలంలో ప్రారంభమైన వేసర శిల్పకళ రాష్ట్రకూటుల పాలనా కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది
రాష్ట్రకూటుల కాలంలో నిర్మించబడిన దశావతార దేవాలయం, ఎల్లోరా కైలాసనాథ దేవాలయాలు వారి వాస్తు, శిల్పకళకు ఒక నిదర్శనం.
వీరి ప్రఖ్యాత గుహ శిల్పకళ ఎలిఫెంటా గుహల్లో కనిపిస్తుంది
ఎలిపెంటా గువాల్లో ఉన్న (తిమూర్తి శిల్పం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినది
వీరి అధికారిక భాష సంస్కృతం అయినప్పటికీ వీరి కాలంలో కన్నడ భాష బాగా అభివృద్ధి చెందింది.