Balamitra Kathalu-పాలపిట్ట తెలివి

TSStudies

Moral Story-పాలపిట్ట తెలివి (Fox and Pala Pitta)

లోకంలో మరొక వ్యక్తి మీద ఆధారపడాలి అనుకునేవారు చాలామంది ఉంటారు. మనం అలా మరొకరి మీద ఆధారపడకూడదు ఒకవేళ ఎవరన్నా మనల్ని భయపెట్టి పబ్బం గడుప కుంటే వారిని యుక్తితో జయించాలి ఎలాగంటారా? 
ఒక చెట్టు మీద పాలపిట్ట గూడు కట్టుకొని గుడ్లను పెట్టి పొదిగి పిల్లల్ని చేసింది. ఉదయం సాయంత్రం ఆహారం తెచ్చి పిల్లలకు పెట్టి జాగ్రత్తగా పెంచసాగింది. కొన్నాళ్ళకి ఎదిగిన పిల్లల అరుపులు ఒక సోమరి నక్క విన్నది. దానికి ఆహారం వెత్తుక్కోవడమంటే మహా బద్ధకం. 

Balamitra Kathalu-
మాయమాటలు చెప్పి రోజు గడుపుకుంటుంది .  ప్రకారం నక్క చెట్టు పైకి చూస్తూ "పాలపిట్టా! నా మిత్రుడు ఏనుగుతో నీ చెట్టు కూల్చేయించి నీ పిల్లల్ని మింగుతాను" అని బెదిరించింది.  భయపడిన పాలపిట్ట నా పిల్లల జోలికి రాకుంటే నీ కోరిక తీరుస్తాను ఏం కావాలి? అని బతిమాలింది. జిత్తులమారి నక్క తన పథకం పారినందుకు పొంగిపోతూ 'నువ్వు నాకు కోళ్ళు ఉన్న ఇల్లు వెతికి చూపించాలి నేను వాటిని మింగి మీ సంతానం జోలికి రాను' అని చెప్పింది. అందుకు అంగీకరించిన పాలపిట్ట రివ్వున ఎగిరి వెళ్ళి ఒక రైతు ఇంట ఉన్న కోళ్లను చూసి నక్కకి చెప్పింది.  రాత్రి కోళ్ళను సృష్టిగా తినేసి వచ్చి చెట్టు దగ్గర పడుకుంది. నక్క పొట్ట పగిలే టట్టు తినడం వల్ల మెలుకువ రాలేదు. వచ్చాక చెట్టు పైకి చూసింది.  
పాలపిట్ట! నక్క బావ అని పలకరించింది . బావా లేదు గీవా లేదు చెట్టుని కూల్చేయించి నీ పిల్లల్ని తింటాను అంది. అంత పని చెయ్యకు నక్కబావ నీకేం కావాలో చెప్పు అంది పాలపిట్ట. నక్క 'నాకు బాతుని ఆరంగించాలని ఉంది అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వచ్చి నాకు చెప్పాలి' అని భయపెట్టింది. వెంటనే పాలపిట్ట ఎగిరి వెళ్ళింది. నక్క చెట్టు కింద కూర్చుంది. 
ఒక అల్ప ప్రాణిని భయపెట్టే ఆకలి తీర్చుకుంటున్నావు అది నీకే చేటు. మోసం ఎల్లకాలం సాగదు ఎప్పుడో అప్పుడు నువ్వు మోసపోతావు కష్టపడి ఆహారం సంపాదించుకో అని మనస్సాక్షి హితవు చెప్పింది. నక్క చెవిన పెట్టలేదు సరికదా! ఆపద వస్తే ఉపాయంతో బయట పడతాను అని ఎదురు చెప్పింది.  రాత్రి నక్క పాలపిట్ట చెప్పిన చోటికి వెళ్లి బాతులని తినేసి వచ్చి భుక్తాయాసంతో పడుకుంది. లేచాక చెట్టు పైకి చూస్తూ "పాలపిట్ట! కోళ్లు, బాతుల్ని కమ్మగా తిన్నాను.  రాత్రి కాదు పగలే సీమ కోడి రుచి చూడాలని ఉంది ఎక్కడ ఉందో చూసి వచ్చి చెప్పకుంటే చెట్టును కూల్చేయించి నీ పిల్లల్ని తింటాను" అని యధాప్రకారం బెదిరించింది. 
పాలపిట్ట వద్దంటూ ' సోమరి నన్ను బెదరగొట్టి కడుపు నింపుకుంటుంది, నక్కకి తగిన శాస్తి చేయకుంటే దానికి జీవితాంతం ఆహారాన్వేషణ చేయాలని' బాధపడుతుండగా ఒక ఉపాయం తట్టింది.  
"నక్కబావా! సీమ కోళ్లని ఎప్పుడో చూశాను నువ్వు అడగలేదని చెప్పలేదు" అని ఊరించింది. నక్క లొట్టలు వేసుకుంటూ చెప్పు చెప్పు ఎక్కడ ఉన్నాయి అని ఆత్రంగా అడిగింది. పాలపిట్ట చెప్పను చూపిస్తాను నువ్వు కళ్ళు మూసుకొని నా వెంట రావాలి అంది. వెంటనే నక్క సమ్మతించింది తర్వాత పైన ఎగిరేళ్లే పాలపిట్ట అరుపువింటూ కింద వెంబడించసాగింది. చాలా దూరం పోయాక నక్క బావా కళ్ళు తెరిచి చూడు కనబడతాయి అన్నది పాలపిట్ట. 
మరుక్షణం ఆబగా కళ్ళు తెరిచిన నక్కకి  వేటకుక్కలు కనిపించగానే ప్రాణభయంతో దౌడు తీయసాగింది. కానీ అవి వాయువేగంతో వెళ్లి నక్కను చుట్టుముట్టి చంపేశాయి. పాలపిట్ట నక్క పీడ విరగడయ్యినందుకు వ దేవతకి ప్రణామాలు అర్పించింది. తన పిల్లలకి ఇక ముప్పు రాదని ఆనందించింది, భయాన్ని వదులుకుంది, ధైర్యాన్ని పదిలపరుచుకుంది. ఇతరులను మోసం చేయాలనుకుంటే మనకే నష్టం జరుగుతుందిఅలా చేసే నక్క ప్రాణాలు పోగొట్టుకుంది.