Balamitra Kathalu-పరోక్ష సహాయం

TSStudies

Moral Story-పరోక్ష సహాయం 

అదొక పల్లె ఊరినిండా పూరిళ్లతో  పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండేది. గ్రామస్తులు ఎక్కువమంది దగ్గర్లో ఉన్న కొండపై పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉండేవారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు కొనడానికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న పొరుగూరు వెళ్ళవలసి వస్తుండేది. 
ఇదంతా గమనించిన పొరుగూరు షావుకారు రంగస్వామి తన వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు పల్లెలో స్థిరపడ్డాడు. మొదట్లో అందరి తలలో నాలుకగా ఉంటూ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఊరులోనే అంగడి రావడంతో గ్రామస్థులు కూడా సంతోషించారు. అడవి దినుసులకు పట్టణంలో గిరాకీ ఉండడంతో వస్తుమార్పిడి వ్యాపారానికి మాత్రమే క్రమేపీ ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టాడు. 
మొదట పూరింట్లో ప్రారంభమైన దుకాణం లాభాలు పెరగడంతో తన అంతస్తును మార్చాడు. సంపాదించింది దాచుకోవడానికి వీలుగా భవంతిని కూడా నిర్మించుకున్నాడు. ధనాశకు తోడుగా దురాశ తోడైంది. వడ్డీ వ్యాపారం చేయనారంభించాడు. ఇతరుల అవసరాలను బలహీనతగా తీసుకొని తన వ్యాపారానికి పదును పెట్టాడు. ఆ ఊర్లో పోటీ వ్యాపారం లేకపోవడంతో రంగస్వామి ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది. 
అది వేసవి కాలం అనుకోకుండా ఊరిలో అగ్ని ప్రమాదం సంభవించింది ఊరంతా కాలిపోయింది ఒక రంగస్వామి భవంతి తప్ప. అందరూ గగ్గోలు పెట్టారు. రంగస్వామికి మాత్రం సంతోషం రెట్టింపైంది. గ్రామస్తులు అప్పులకు వస్తే అధిక వడ్డీలు వసూలు చేయవచ్చని కలలుగన్నాడు. డబ్బుమూటలు ముందు పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు కానీ పిడుగులాంటి వార్త రంగస్వామి చెవిన పడింది. 
గ్రామస్తులు ఊరంతా ఖాళీ చేసి కట్టుబట్టలతో దూర ప్రాంతాలకు వలస పోవడానికి సిద్ధపడ్డారని, అందరూ పోతే మిగిలింది తన ఒక్క ఇల్లే!. లక్షలు వెచ్చించి కట్టించింది ఇప్పుడు పనికిరాకుండా పోతుంది. వ్యాపారం మరి ఉండదు అప్పు తీసుకున్న వారు ఊరు దాటితే వసూళ్లకు వారి చుట్టూ తిరగడానికి కాలం సరిపోతుంది భార్యతో విషయాలు చెప్పి గొల్లుమన్నాడు. 
"గ్రామస్తులు నిర్ణయంలో తప్పులేదు కష్టపడే వాడు ఎక్కడైనా బతకగలడు. మనవి వ్యాపారపు లెక్కలు వారికి బతుకు చిక్కులు ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. కష్టంలో ఉన్న వారికి ఓదార్పు అవసరం వారిని ఏదో ఒక విధంగా మీరు ఆదుకుంటే బాగుంటుంది" సలహాగా చెప్పింది భార్య. 
అందుకేగా "వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా కూర్చున్నది" అన్నాడు రంగస్వామి. 
Moral stories for kids in telugu,balamitra kathalu in telugu,balamitra telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,chandamama kathalu,bethala kathalu in telugu,vikramarka kathlu in telugu,batti vikramarka kathalu in telugu,batti vikramarka stories in telugu,panchatantra history,panchatantra kathalu in telugu,panchatantra stories in telugu,panchatantra stories by vishnu sharma,vishnu sharma panchatantra,neeti kathalu,moral stories in telugu,telugu moral stories,telugu stories for kids,moral stories short,The 10 Best Short Moral Stories With Valuable Lessons,inspirational Moral Stories,children's stories with morals,Images for moral stories,telugu short stories,Chandamama Balamitra Kathalu,మీరు స్వార్థపు సాయం చేయాలనుకుంటున్నారు. సర్వం కోల్పోయిన వారికి ఇది అదనపు భారంగా ఉంటుంది. వారు ఊరు వదిలితే మనకు బతుకు ఉండదు. గడించిన చోటే దానం చేయమన్నారు పెద్దలు. డబ్బుమూటలలో కొన్ని వారికి ఉచితంగా అందజేస్తే భగవంతుడు మరో రూపంలో సాయం అందిస్తాడు మనకు. మనలో మానవత్వపు విలువలను శోధించటానికి భగవంతుని పెట్టిన పరీక్ష ఇది వివరించింది భార్య. 
భార్య చెప్పిన మాటల్లో యదార్థం కనిపించడంతో నిరాశ్రయులైన గ్రామస్తులు దగ్గరకు వెళ్లాడు. వారిని ఓదార్చాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి కుటుంబానికి ఉచితంగా తన ధనసాయం అందించాడు. గ్రామస్తులంతా కృతజ్ఞతాభావంతో చేతులెత్తి నమస్కరించారు. అందరి దృష్టిలో రంగస్వామి ఇప్పుడు దేవుడు. గ్రామస్తులందరూ ఊర్లోనే ఉన్నారు రంగస్వామి వ్యాపారం యథావిథిగా సాగుతోంది. 
"చూశారా! మీ నిస్వార్థ సాయం గ్రామస్తుల జీవితాల్లో వెలుగులు నింపితే, మన వ్యాపార అభివృద్ధికి పరోక్షసాయంగా నిలిచింది. సాయం ఎప్పుడు వృధా కాదు" అంది భార్య.