నిబద్దుడిఎంపిక
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగే మౌనంగాశ్మశానం కేసి . అప్పుడుశవంలోని బేతాళుడు “రాజా, నీ కోరికలునెరవేర్చుకోవడానికి అద్భుత శక్తులను పొందాలని నీవింత శ్రమిస్తున్నావని నా అనుమానం. లేదాఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్ధపరులేనని, తమ బాగు తాము చూసుకునేవారేననినీవు భావిస్తుండవచ్చు. దురాశాపరులనుంచి, తమ సమస్యలు తప్పితే ఇంకేవీ పట్టించుకోనిఅధిక సంఖ్యాక ప్రజలనుంచి నిజాయితీపరులను, విశ్వసనీయులను, వాస్తవమైన మనుషులను వేరుచేసి గుర్తించడం చాలాకష్టం. దురాశాపరులలో కూడా అటువంటి నిజాయితీపరులుఉంటారని నీవు తెలుసుకోవడానికి నడవసాగాడు నీకుఒక కథ చెబుతాను విను"అంటూఇలా చెప్పసాగాడు.
పూర్వం, కాశీరాజుకు ప్రపంచమంతటి నుంచి గౌరవ ప్రపత్తులు లభించేవి. దేవేశ్వర ప్రతాపసింహుడు కాశీ పాలకుడిగా ఉండేవాడు. ప్రతాప్సింహుడుధైర్యసాహసాలకి, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ప్రజల శ్రేయస్సు, సంతోషంకోసంఅతడు శతవిధాలా పాటుపడేవాడు. కాశీ ప్రజలు కూడా తమరాజును ఎంతగానో గౌరవించేవారు. రాజ్యపరిపాలనలో సుద్వీర్ణకాలం గడిపిన తర్వాత రాజు కూడా అలసిపోయాడు. ఈ విషయాన్ని అతడు ప్రధానామాత్యుడు చంద్రశేఖరశాస్త్రితో చర్చించాడు.
ప్రభూ! పాలనావ్యవహారాలతో మీరు విసిగిపోయారు. మీకు విశ్రాంతి కావాలి. రాజుగా మీరు ఈ రాజ్యానికిఅత్యున్నత అధిపతిగా ఉన్నారు. కాని వీటితో పాటురాజ కోశాధికారిగా కూడా మీకు కొన్నివిధులున్నాయి. రాజకోశాన్ని తగిన విధంగా నిర్వహించడానికిప్రత్యేక కోశాధికారి అవసరం ఉన్నప్పటికీ, ఈఅదనపు బాధ్యతను మీకు మీరే చేపట్టవలసిఉంటుంది. కానీ ఇతర బాధ్యతలనుమోస్తూ ఈ పనిచేయడం చాలాకష్టం. అందుకే మీరు అలసిపోతున్నారు. అన్నాడుమహామంత్రి.
'రాజనేవాడు తప్పకుండా రాజ్య పాలనా వ్యవహారాలలోపాలుపంచుకోవాలి, కాని కోశాగారాన్ని నిర్వహించినబాధ్యతను అతడుఎందుకు మోయాలి? కాని మీరు చెప్పిందిమాత్రం నిజం. నేను అధికభారంతోకుంగిపోయాను. నాపై ఈ ప్రత్యేకబాధ్యతకు ఏది మూలకారణం?' అని ప్రశ్నించాడు రాజు.
దానికి మంత్రిసమాధానమిస్తూ, వాస్తవానికి కాశీరాజు రాజ్య కోశాధికారి పదవినిసాంప్రదాయికంగానే నిర్వహిస్తూ వచ్చారు. మీ తండ్రి రాజాయుద్ధవీరసింహుడు ఈ సంప్రదాయాన్ని అమలులోకితెచ్చాడు. 'మంత్రివర్యా, మీరు నాకంటే అనుభవశాలురు, పెద్దవారు కూడా. మీరు మాతండ్రిగారిని కూడా సేవించారు. మీతోఆయన చాలా విషయాలు చర్చించుంటారు. కాశీలో ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి తగిన కారణం ఎమిటోదయచేసి నాకు బోధపర్చండి'. మహామంత్రిమందహాసం చేస్తూ... 'రాజా, ఈ తప్పనిసరిసంప్రదాయం వెనుక ఒక అవమానకరమైనఘటన దాగి ఉంది.
మీతండ్రి తన రాజ్యంలో ప్రజలుఎలా ఉంటున్నారో చూడటానికని తరచుగా మారువేషంలో పట్టణం దాటి వెళ్లేవారు. అదేసమయంలోరాజ సేవకులు ఎలా పని చేస్తున్నారోకూడా పరిశీలించేవారు. రాజు మారువేషంలో ఉండగాఅతడిని ఎ ఒక్కరు కూడా గుర్తించగలిగేవారుకాదు. అవిధంగా మీ తండ్రి తనరాజ్యంలో జరుగుతున్న ఘటనలన్నింటిపట్లా అప్రమత్తంగామెలిగేవాడు.

ఆ మరుసటి దినం, మీ తండ్రి యుద్ధ వీరసింహుడు తన ఆస్థానంలోని సహాయకులందరినీపిలిపించాడు. జరిగిన నేరం చర్చించారు. కోశాధికారితీవ్రతప్పిదం చేశాడని అందరూ అంగీకరించారు. కోశాధికారికి రాజు మరణ శిక్ష విధించాడు. అయితే, రాజుదయార్ద హృదయుడు. నన్ను కూడా సలహాఅడిగాడు. దాంతో తప్పు చేసినకోశాధికారిని నగర ప్రజలందరి ముందుఅవమానించి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిర్ణయంచాము. అయితే కోశాధికారి తన శిక్షను అనుభవిస్తుండగాజబ్బుపడ్డాడు. దాంతో అతడి కథముగిసింది.
రాజుమాత్రం అప్పటినుంచి చాలాజాగ్రత్తగా ఉండేవాడు. ఆనాటినుంచి కాశీ రాజే స్వయంగాకోశాధికారిగా ఉండాలని నిర్ణయించాడు. అలా ఈ సంప్రదాయంకొనసాగుతూ వచ్చింది. గత చరిత్ర విన్నప్రతాపసింహుడు నేను కూడా ఆ నిర్ణయాన్నిఆమోదిస్తాను. కాని ఈ అదనపుపని భారం రాజ్యపాలనపై (ప్రభావంచూపుతుంది, ఈ సమస్యకు శాశ్వతమైనపరిష్కారం కావాలి. రాజు ఆదేశానికి విధేయతచూపగల పరిష్కారం. ఇది రాజ్యపాలనను సులభతరంచేయడమే కాకుండా, కోశాగారాన్ని సురక్షితంగా ఉంచగలదు కూడా' అన్నాడు.
"శాశ్వతపరిష్కారమా? అయితే, అత్యంత నిజాయితీ కలిగిన వ్యకికి కోశాగార బాధ్యతనుఅప్పగించండి. బయటి వ్యక్తికి బాధ్యతనుఅప్పగించడం కంటే మన ఆస్థానంలోనివారినుంచే ఎవరో ఒకరిని ఈపనికి మనం ఎంచుకుంటే బాగుంటుందనితన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు మహామంత్రి".
మనం రేపు ఉదయాన్నేఆస్థానంలో ఈకొలువుకు తమ పేరు నమోదుచేసుకోమంటూ పిలుపిద్దాము. వచ్చిన పత్రాలను అన్నింటినీ పరిశీలించి ముఖాముఖీ మాట్లాడిన తర్వాతే అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుందాము. దీనికోసం ఒక ఎంపిక మండలినిఏర్పరుద్దాము. రాజుగా మీరు ఆ మండలికినేతృత్వం వహించండి. నేనూ, సేనాధిపతి, రాజవైద్యుడు, రాజగురువు ఈ మండలిలో ఉంటాముఅన్నాడు మంత్రి.
రాజు దీనికి అంగీకరించాడు. కోశాధికారి పదవికోసం నమోదు చేసుకోవలసిందని రాజప్రకటనవెలువడింది. ఆస్థానంలోఉన్న నూటొక్కమందిలో వందమంది తమ పేరు నమోదుచేసుకున్నారు. రాజు తీవ్రంగా ఆలోచించాడు. ఈ పదవి అంతముఖ్యమైంది కాబట్టిదాదాపు అందరూ నమోదు చేసుకున్నారా? తర్వాత అతడు ఎంపిక మండలినిసమావేశపర్పాడు. ఈ పదవికిపేరు నమోదు చేసుకోని ఎకైకఅభ్యర్థి పేరు విశాలగుప్తుడు. ఇతడుఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడు. రాజ్య ఆర్థిక విధానాలపైసలహా ఇస్తుంటాడు. అలాగే రాజ్యానికి సంబంధించినద్రవ్య వ్యవహారాలకు కూడా బాధ్యత వహిస్తుంటాడు.
సరైనఅర్హత, అనుభవం ఉన్న వ్యక్తి ఈపదవికి ఎందుకు పేరు నమోదు చేసుకోలేదనిఎంపిక మండలి సభ్యులు ఆశ్చర్యపడ్డారు. ఆస్థానంలో బహిరంగ సభలో మరుసటి దినం అభ్యర్థులనుపిలిపించి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు.
ఆమరుసటి దినం, అభ్యర్థుల గుణగుణాలపరిశీలన ప్రారంభమైంది. రాజాస్టానంలో రాజ సభికులు, సామాన్యప్రజలు కూడా ఉన్నారు. రాజుతరపున ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రశ్నించసాగాడు. కోశాధికారి పదవికి పేరునమోదు చేసుకున్న అందరికీ ఒక ప్రశ్న. ఈపదవికి మీరే తగిన అభ్యర్థినని ఎందుకు భావిస్తున్నారు? ఈ పదవికి మీరుఎందుకు నమోదు చేసుకున్నారు?

విశాలగుప్తుడుతన ఆసనం నుంచి లేచివినయంగా ఇలా సమాధానమిచ్చాడు.“అయ్యా! నేను ఇప్పుడు చేస్తున్న పనులు బాధ్యతలతో పూర్తిగాసంతృప్తితో ఉన్నాను. ఆస్థాన ఉద్యోగిగా నేను రాజ్య (శ్రేయస్సుకోరి ఆర్ధిక వ్యవహారాలపై నా అభిప్రాయాన్ని తరచుగావ్యక్తపరుస్తూ ఉన్నాను. అందుకే రాజ కోశాధికారి పదవికినేను పేరు నమోదు చేయలేదు. ఈ పదవికి నేను తగిన వాడినికానని నాకు నేనుగా భావించడంతోనా అభ్యర్థిత్వం అంతటితోనే ముగిసిపోయిందని నేను భావించాను.
తర్వాతదేవేశ్వర ప్రతాప మహారాజు ఇలా ప్రకటించాడు. “గౌరవనీయులైనకాశీపురవాసులారా! కాశీ నగర రాజునైననేను రాజుగా నా విచక్షణాధికారాన్ని ఉపయోగించి, విశాలగుప్ప్తుడినికాశీ రాజ్య కోశాధికారిగా నియమిస్తున్నాను. ఈ కొత్త పదవికి అనుగుణంగాఅతడి జీతభత్యాలు నిర్లయించాలని ఆదేశిస్తున్నాను. ఆస్థానంలో ఒక్క క్షణం చీముకుడితే చిటుక్కుమనేంత నిశ్శబ్దం ఆవరించింది.
బేతాళుడు ఈ కథ చెప్పి, విక్రమార్కుడితో, “ఓ రాజా, విశాలగుప్తుడినిరాజ్య కోశాధికారి పదవికి ఎందుకు ఎన్నుకున్నట్లు? అతడు వాస్తవానికి ఆపదవికి పేరునమోదు చేసుకోలేదు. పైగా రాజాస్థానంలో యావన్మందిముందూ తన ప్రస్తుత బాధ్యతలపట్ల తాను సంతోషంగా ఉంటున్నాననిప్రకటించాడు కూడా. ఇప్పుడు ప్రశ్నఎదంటే ఆ పదవికి అర్హుడినికానని తనకు తానుగా ప్రకటించుకున్నవిశాలగుప్పుడినే ఆ పదవికి ఎందుకుఎంపిక చేశారు? ఈ ప్రశ్నకు సమాధానంతెలిసీ చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది, అన్నాడు.దానికి విక్రమార్కుడు, 'అభ్యర్థులందరూ కోశాగారంలోని ధనాన్ని దుర్వినియోగపర్పాలనే పథకాన్ని తమ మనస్సులలో ఉంచుకునేవచ్చారని రాజు అర్ధం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఆ పదవికి ఎంపికయ్యేఅవకాశాన్ని ఏ మాత్రం కల్పించకూడదని రాజు భావించాడు'.
అందుకనే, ఈ పదవికి పేరునమోదు చేసుకోని వారి పైనే రాజుదృష్టి పెట్టాడు. ఆ తర్వాతే అతడుతక్కువ వేతనం లభిస్తున్న ఆపదవిని ఎందుకు ఆశిస్తున్నారంటూ అభ్యర్థులందరినీ ప్రశ్నించాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతోతాను ఊహించినదే సరైనదని రాజు అభిప్రాయానికొచ్చాడు. ఆ తర్వాతసభలో విశాలగుప్తుడి సమాధానం విన్న రాజు, అతడుతన బాధ్యతలతో సంతుష్టి చెందాడని, నిజాయితీపరుడని, దురాశ లేనివాడని గ్రహించాడు. ఆ పదవికి అతడే ఉత్తమమైన అభ్యర్థిఅని అప్పటికే తేలిపోయింది. ఈ పరిస్థితిలోనే రాజుసరైన నిర్ణయం తీసుకోగలిగాడు. రాజుకీవిధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమైతిరిగీ చెట్టెక్కాడు.