Chandamama Kathalu-దొంగసొత్తు

TSStudies

దొంగసొత్తు 

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
సోమేశ్వరాన్నిమాణిక్యవర్మ పరిపాలిస్తున్న రోజులవి. మంత్రి అఖండనాథుడి సలహా సంప్రదింపులతో పాలననల్లేరుపై బండి నడకలా సాగుతోంది. ఒకనాడు రాత్రి, కాపలా కాస్తున్న సైనికులచేతికి గజదొంగ కామరాజు అనుకోకుండా చిక్కాడు. కామరాజు చాలాకాలం నుంచి సోమేశ్వరరాజ్యంలోని ప్రజల కంటిపైకునుకు లేకుండా చేస్తున్నాడు. ధనవంతులైతే రాత్రిళ్లు మేల్కొని పగలు నిద్రపోవడం ప్రారంభించారు.
కామరాజునిదండించి స్థావరం వివరాలు తెలుసుకుని, అక్కడి సంపదనంతా స్వాధీనం చేసుకున్నాడు సైనికాధికారి. మరుసటి రోజు సభలో కామరాజుప్రవేశ పెట్టబడ్డాడు. స్వాధీనం చేసుకున్న సొత్తులో అధిక భాగం నగరంలోనిప్రముఖ ధనవంతుడు నీలకంఠుడిదే! అయితే నీలకంఠుడు రోజు కూడా సొత్తుపోయిందని ఫిర్యాదు చేసినవాడు కాదు.
మంత్రివర్యా.. నీలకంఠుడు అభిమానవంతుడు కావడం చేత పోయినతన సంపద గురించి మనకుతెలియపరిచి ఉండడు. తక్షణమే అతడిని పిలిపించి అప్పగించండి. మాణిక్యవర్మ అజ్ఞచేశాడు. “ప్రభూ... నీలకంఠుడి సొమ్ముపోగా మిగిలినది ఎవరెవరిదో నిర్ణయించుకునేందుకుకొంత వ్యవధి అవసరం. రెండు రోజుల తర్వాతసొమ్మంతటినీ హక్కుదారులకు అందిద్దాం. నీలకంఠుడిని కూడా అప్పుడే రప్పిద్దాం, అని చెప్పిన అఖండనాధుని మాటలకు రాజు సమ్మతించాడు. రెండురోజుల తర్వాత సొమ్ముహక్కుదారులంతా సభకు రప్పించబడ్డారు. ఒక్కొక్కరేవచ్చి పోయిన తమ సొమ్మువివరాలు, ఆధారాలు చెప్పి తీసుకు వెళ్ళసాగారు. నీలకంకఠుడి వంతు వచ్చింది. అయితేచాచేందుకు వీలు లేకుండా అతనిచేతులకు సంకెళ్ళు వేయబడి ఉన్నాయి.
దృశ్యం చూసి ఆశ్చర్యపోతున్న మాణిక్యవర్మకుసందేహనివృత్తి చేస్తూ, “మహారాజా... నీలకంఠుడు కామరాజు కంటే పెద్ద గజదొంగ. పలు అక్రమవ్యాపారాలతో, పన్నులు ఎగవేసి కోట్లాది వరహాలు పోగేశాడు. “దొంగసాత్తుకు లెక్క ఉండదు' అనేసామెతను నిజం చేస్తూ, పోయినధనంపై మనకు ఎలాంటి ఫిర్యాదుచేయలేదు.
నీలకంఠుడిబలహీనతను గమనించిన కామరాజు పలుమార్లు అతని ధనాన్నే దొంగిలించాడు. నీలకంఠుడి నిష్క్రియ నాకు అనుమానం తెప్పించింది. దీని కారణంగానే మిమ్మల్నిరెండ్రోజుల గడువు కోరి, సమయంలో వివరాలన్నీ 'తెలుసుకున్నాను." వినమ్రంగా చెప్పాడుఅఖండనాథుడు. విషయం తెలుసుకున్న మాణిక్యవర్మఅఖండ నాధుడిని అభినందించి నీలకంఠుడీకి కఠిన కారాగారశిక్ష, కామరాజుకుసాధారణ కారాగారశిక్ష విధించాడు.