జైన మతం
జైన మతాన్ని స్థాపించినది -రిషభనాథుడు (మొదటి తీర్థంకరుడు)
జైన మత చారిత్రాత్మక స్థాపకుడు -పార్శ్య నాథుడు (23వ తీర్థంకరుడు)
జైన మత నిజమైన స్థాపకుడు -వర్థమాన మహావీరుడు (24వ తీర్థంకరుడు)
వర్థమాన మహావీరుడు:
తండ్రి - సిద్దార్థుడు
తల్లి - త్రిశల (లిచ్చావి రాకుమార్తె)
భార్య - యశోద
కూతురు - ప్రియదర్శిని (అన్నోజా) (అన్నోజా భర్త జమాలి)
జన్మస్థలం - కుందగ్రామ (క్రీ.పూ. 540, బీహార్)
జ్ఞానోదయం - జృంబికవనం (బీహార్‌లో) రిజుపాలిక నది ఒడ్డున
మరణం -పావాపురి (పొట్నాదరగ్గర) క్రీపూ. 468 (హస్తీపాలుని గృహంలో మరణం)
తెగ - జ్ఞాత్రిక
వర్ధమాన మహావీరుడు తన 30వ యేట సత్యాన్వేషణకై బయలుదేరాడు. మొదటి 6 సం॥లు గోసలి మక్కలిపుత్రతో కలిసి సత్యాన్వేషణకు ప్రయత్నించాడు.
తర్వాత వివాదాలు ఏర్పడుటచే వీరు విడిపోయారు. తర్వాత కాలంలో మక్కలిపుత్ర 'అజ్వికా' మతాన్ని స్థాపించాడు.
వర్ధమాన మహావీరునికి 12 సం॥ల సత్యాన్వేషణ తర్వాత తన 42వ యేట జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి మహావీరుడిని అర్హంత్ లేదా జీనుడు(జయించినవాడు) అంటారు.
పురోహితుల ఆధిక్యతను, వేదాలను ఖండించాడు. కర్మ సిద్ధాంతంపై విశ్వాసము ఉంచాడు.
కైవల/మోక్షము సాధించుటకు త్రిరత్నాలు పాటించాలి.
1) సరియైన విశ్వాసము
2) సరియైన జ్ఞానము
3) సరియైన నడవడిక
సరియైన నడవడికలో 5 సిద్ధాంతాలు
1) సత్యం
2) అహింస
3) అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కలిగి ఉండుట)
4) అస్తేయం (దొంగతనం చేయకుండుట)
5) బ్రహ్మచర్యం (దీనిని మహావీరుడు చేర్చాడు)
బౌద్దులు జైనులతోపాటు “అజీవకులు" అన్న పేరుగల మరో మేధావి వర్గం కూడా క్రీ.పూ.6వ శతాబ్ధంలో భారతదేశ ఈశాన్య ప్రాంతంలో మత బోధనలను చేసింది. దీని ప్రధాన ప్రచారకుడు మఖల్లిగోసల/గోసమిక్కలిపుత్ర. ఇతడు నిబంధనలు లేని జీవితాన్ని గడిపాడు. అంటే, ఇతను తాగుబోతుగా, దిగంబరిగా సంచరించేవాడు. ఇతను ఒక రకమైన తీవ్రవాదాన్ని ప్రవచించినందున, అతనికి జనాదరణ లభించలేదు. ఇతని సిద్ధాంతాన్ని ఉచ్చేదవాదం అంటారు. బిందుసారుడు ఈ మతాన్ని ఆదరించాడు.
జైన మతం దేవుళ్ల ఉనికిని గుర్తించింది. కానీ ఆ దేవుళ్లకు 'జిన' జయించినవాడు అయిన మహావీరుని తర్వాత స్థానమిచ్చింది. కాబట్టి దేవుడున్నాడనే విషయం జైన సిద్ధాంతం దృష్ట్యా నిష్పయోజనమైనటువంటిది.
జైనమతం వర్ణ పద్ధతిని మాత్రం ఖండించలేదు. ఈ విషయంలో మహవీరునికి కొన్ని నిర్భిన్చమైన భావాలున్నాయి. ఏ మనిషైనా అగ్ర లేదా అధమ వర్ణంలో జన్మించటానికి, అతని పూర్వ జన్మ పాపపుణ్యాలే ప్రధాన కారణాలని, అధమ తరగతుల సభ్యులకు కూడా విమోచన కావాలంటే పునీతం, పుణ్య సహితమైన జీవిత గమనమే మార్గద్శకం కాగలదని మహావీరుని భావన.
జైన మతం బోధించిన తక్కువ వ్యయం, అహింస, వ్యాపారస్తులను ఆకిర్షంచుట వల్ల, వీరు ఎక్కువగా ఆ మతాన్ని పోషించారు. అహింసా సిద్ధాంతానికి అత్యంత ప్రాముఖ్యతనివ్వడం వల్ల వ్యవసాయదారులు ఎక్కువగా జైన మతాన్ని స్వీకరించలేదు.
బౌద్ధ, జైన మతాలు కుల పద్ధతిని మాత్రం నిషేధించలేదు. ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా సన్యాసాశ్రమానికి అర్హత కల్పించారు. చండాలురు, ఇతర బడుగు తరగతుల వారు జ్ఞాన సముపార్ణన ద్వారా నిర్యాణం లేదా కైవల్యాన్ని పొందవచ్చని బుద్ధుడు, మహావీరుడు ఇద్దరూ చెప్పారు.
జైన పరిషత్తులు:
మొదటి జైన పరిషత్తు:
మహావీరుడు మరణించిన తర్వాత క్రీపూ. 4వ శతాబ్ధంలో మగధలో ఒక పెద్ద కరువు సంభవించింది.
కొంతమంది జైనులు భద్రాబహూని నేతృత్వంలో దక్షిణ భారతదేశంలోని కర్ణాటక (శ్రావణ బెళగొళ) చేరుకున్నారు
స్టూలభద్రుని నేతృత్వంలో మిగతా జైనులు మగధలో ఉండిపోయారు.
భద్రబాహు జైనులు మవాోవీరుని బోధనలను కఠినముగా పాటించేవారు.
స్థూల భద్రుని జైనులు మహావీరుని బోధనలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. వీరు తెల్లని దుస్తులను ధరించుట ప్రారంభించారు
కొన్ని సంవత్సరాల తర్వాత కరువు అంతమైనది. భద్రబాహు జైనులు కర్ణాటక నుంచి తిరిగి మగధకు చేరుకున్నారు.
భద్రబాహు మరియు స్థూలభద్ర మధ్య మహావీరుని బోధనలకు సంబంధించి వివాదాలు ఏర్పడ్డాయి
ఈ వివాదాలను పరిష్మరించుటకు పాటలీపుత్ర వద్ద క్రీ.పూ. 300లో మొట్టమొదటి జైన పరిషత్తు నిర్వహించబడింది.
చంద్రుగుప్త మౌర్యుడు దీనికి సహకరించాడు.
భద్రబాహు, స్థూలభద్ర దీనికి నేతృత్వం వహించారు
స్థూలభద్ర 12 అంగములను రచించాడు. కానీ భద్రబాహు ఈ 12 అంగములను తిరస్కరించాడు.
దీంతో జైనమతం రెండుగా చీలిపోయింది.
1) భద్రబాహుని నేతృత్వంలో దిగంబరులు
2) స్థూలభద్ర నేతృత్వంలో శ్వేతాంబరులు
2వ జైన సంగీతి:
కీ.శ. 6వ శతాబ్ధంలో మైత్రికలు(రాజవంశం) గుజరాత్‌లోని వల్లభిలో నిర్వహించారు. దీనికి అధ్యక్షుడు దేవార్థఘని
జైన సాహిత్యమును రచించుట ఈ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం
జైన సాహిత్యాలైన అంగాలు, పూర్వములు, ఉపాంగములు మొదలగునవి ఇక్కడ సేకరించబడ్డాయి.
క్రీ. శ. 12వ శతాబ్ధంలో చాళుక్యరాజు కుమారపాలుడు సమాంతరంగా వల్లభి, మధుర(యు. పి)లలో జైన పరిషత్తులను నిర్వహించాడు (జైన మతం గొప్పదనం తెలియజేయడం కోసం).
ఈ పరిషత్తులకు హేమచంద్రుడు అధ్యక్షత వహించాడు.
హేమచంద్రుడు 'పరిశిష్ట పర్వమ్” రచించాడు.
హేమచంద్రుని కావ్యాలలో త్రిసష్టసకల పురుష చరిత్ర అనేది బృహత్తరమైన కావ్యం.
జైన మతం యొక్క సలక పురుష సిద్ధాంతం:
ప్రపంచంలో ఉత్సరపాణి (అభివృద్ధి దశ, అవసరపాణి (పతనదశ,) అనే దశలు లెక్కించలేనన్ని ఉంటాయి.
ప్రతీ ఒక యుగంలో 68 మంది సలక పురుషులు
ఉంటారు. వీరిలో 24 మంది తీర్ధంకరులు, 12 మంది విశ్వ చక్రవర్తులు ఉంటారు.
చార్వాక మతమును “లోకాయత' స్థాపించాడు.