Chandamama Kathalu-సేవా భావం

TSStudies

చందమామ కథలు-సేవా భావం 

తమ కుమార్తె పెళ్ళి గురించి ముకుందుడిని అతడి భార్య పార్వతి శత పోరుతున్నది. ఆమెకు ఒక మేనల్లుడున్నాడు. అతడిది వ్యవసాయ కుటుంబం. అయినప్పటికీ అతడి తండ్రి, పార్వతి పెద్దన్నయ్య వాడికి మల్లయుద్ధ విద్య నేర్పించాడు. వాడు రాజుగారి కొలువులో ప్రతి ఏటా కొన్ని ప్రదర్శనలిచ్చి, రాజుగారిచేత పతకాలు బహుమతిగా కూడా పొందాడు.
Chandamama kathalu in telugu,Chandamama stories in telugu,telugu Chandamama kathalu,telugu Chandamama stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,betala vikramarka kathalu in telugu,batti vikramarka kathalu in telugu,history of bethala kathalu,balamitra kathalu,panchatantra kathalu,
“నామాట విని మీరు మా అన్నయ్యను కలిసి మాట్లాడండి. ఆడపిల్లకు తగిన వయస్సులోనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే దక్కే ఆ గౌరవమే వేరు, అంది పార్వతి.
ముకుందుడు అవుననలేదు కాదన లేదు. అట్టే అతడికి తన మెనల్లుడైన రాముడి మీద ఎలాంటి సదభిప్రాయం లేదు. రాముడు పేరున్న మల్లయోధుడైతే అయ్యాడు గాక, వాడికి మరో బతుకు తెరువు తెలియలేదు. తండ్రితో పాటు పోయి వ్యవసాయం చెయ్యడు.
“రాముడు మన అమ్మాయిని ఎలా పోషించగలడు?' అని అడిగాడు ముకుందుడు.
పార్వతి తన మేనల్లుడి ప్రస్తావన వస్తే చాలు పరవశించిపోతుంది. అదే పరవశంతో, “వాడికేం లోటండి? వాడికి రాజుగారి ప్రాపకం ఉంది. ఎటేటా ఉత్సవాల్లో వాడికి బంగారు పతకాలు లభిస్తున్నాయి. అతడి కంటే ప్రతిభావంతుడు మన కుటుంబాల్లో మరొకడు దొరుకుతాడా?' అంది.
ముకుందుడికి తన భార్యకెలా తెలియ చెప్పాలో అర్ధం కాలేదు.
“పతి ఏటా పతకాలు సాధించడమే బతుకు తెరువా? ఏడాదంతా ఏం చేసాడు? అభ్యాసమా? తన కుటుంబానికి అన్న వస్త్రాలు ఎలా సంపాదించుకుంటాడు?'
“రాముడితో సంబంధం చెయ్యకపోతే మరి పుట్టింటి వారి గడప ఎలా తొక్కగలను? మావాళ్లు మన అమ్మాయిమీదే ఆశలు పెట్టుకున్నారు, అంది పార్వతి.
“తన బావను పెళ్లాడటం మన అమ్మాయికి నచ్చిందో లేదో తెలుసుకున్నావా?' అడిగాడు ముకుందుడు. అతడికి లోపల్లోపల దహించుకుపోతోంది.
పార్వతి అతడి సందెహాన్ని గడ్డిపరక తీరులో విదిల్చిపారేసింది. మీకు అటువంటి సందేహం అక్కర్లేదని, రాముడిని వేరే ఒకరవరో తన్నుకు పోయే ప్రమాదం ఉందని వెంటనే బయలుదేరి వెళ్ళమని హెచ్చరించింది.
ముకుందుడు ఇక చేసేది ఏమీ లేక ఆరోజే తన బావగారి ఊరు బయలుదేరిపోయాడు.
గ్రామం పొలిమేరలు చేరేసరికి అతడు ఎండదెబ్బకు తాళలేక ఒక చెట్టు నీడలో ఆగిపోయాడు. చెట్టు కింద రెండు పెద్ద పెద్ద బానలతో మంచి నీళ్లు, తాగడానికి తాటాకు పాయలు కనిపించాయి. ముకుందుడు నీరుతాగి సేదతీరాడు. కొంతసేపు నీడ పట్టున విశ్రమించాడు. అంతటి ఎండలోనూ కావిడిలో రెండుబిందెల నీళ్లు ఒకడు మోసుకొచ్చి ఎప్పటికప్పుడు బానలు నింపుతూ ఉన్నాడు.
అతడు రూడా రాముడి వయస్సు ఉన్న యువకుడే! ఎండలో తిరిగి తిరిగి అతడు నల్లబడ్డాడు.
“ఎవరు నాయనా నువ్వు? అడిగాడు ముకుందుడు.
ఆ యువకుడు వినయంగా నమస్కరించి, "ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. మా గ్రామానికి వచ్చె బాటసారులు దాహంతో బాధపడకూడదని వారికి మంచి నీరును ఈ విధంగా అందిస్తున్నాను, అన్నాడు.
Chandamama kathalu in telugu,Chandamama stories in telugu,telugu Chandamama kathalu,telugu Chandamama stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,betala vikramarka kathalu in telugu,batti vikramarka kathalu in telugu,history of bethala kathalu,balamitra kathalu,panchatantra kathalu,
ముకుందుడు అతడిని కావలించుకుని, "చాలా గొప్ప పని చేస్తున్నావు. ఈ సమయానికి మంచి నీరే లేకపోతే నేను అనారోగ్యంతో పడిపోయెవాడిని. నా ప్రాణాలను కాపాడావు, అన్నాడు.
ఈ పని చేస్తున్నందుకు ఆ యువకుడికి ఏ ప్రతిఫలమూ రాదని గ్రహించాడు ముకుందుడు. అతడు తన వద్ద నుంచి ఎలాంటి మెప్పునూ ఆశించలేదు కూడా.
ఆ సమయంలో ముకుందుడు అతడి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం మీద వచ్చే రాబడితోనే తృప్తిగా, తన తల్లిదండ్రులతో సంతోషంగా బతుకుతున్నానని చెప్పాడు ఆ యువకుడు.
సేదతీరిన తర్వాత ప్రయాణమై తన బావగారింటికి చేరుకున్నాడు. తన బావ గారింట అందరూ బక్కచిక్కి ఉన్నారు. ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు. ఇంటి పెరట్లో మాత్రం రాముడు తన కండలతో నిగనిగలాడుతూ తీరిక లేకుండా వ్యాయామం చేస్తున్నాడు.
తన బావగారింట అందరూ ఎందువల్ల నీరసంగా ఉన్నారో తెలుసుకోదలిచాడు ముకుందుడు. అతడి బావ ముకుందుడి వైపు నీరసంగా చూసి, “మా అందరి సంపాదన వాడి తిండికే సరిపోతోంది. ఈ ఏడాది ప్రదర్శనల్లో పాల్గొనవలసిందిగా రాజుగారు కబురు పంపారు. మేమంతా అర్దాకలితో ఉంటే కాని వాడి పోషణ సాగడం లేదు,” అన్నాడు.
Chandamama kathalu in telugu,Chandamama stories in telugu,telugu Chandamama kathalu,telugu Chandamama stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,betala vikramarka kathalu in telugu,batti vikramarka kathalu in telugu,history of bethala kathalu,balamitra kathalu,panchatantra kathalu,
ముకుందుడు ఇక ఆ ఇంట రాత్రికి బస చెయ్యలేదు. తన బావ కూడా రాత్రికి ఉండిపొమ్మని పట్టుబట్టనూ లేదు.
బాటసారులకు మంచినీరు అందించే యువకుడి ఇంట ఆ రాత్రి బస చేశాడు ముకుందుడు. అతడి కుటుంబం ముకుందుడిని ఎంతో ఆత్మీయతతో ఆదరించింది. తమకున్న దానితో తృప్తిగా బ్రతికే కుటుంబం అని ముకుందుడు గ్రహించాడు.
అతడు వారివద్ద సెలవు తీసుకుని తమ గ్రామం చేరుకున్నాడు.
ఆ యువకుడికే తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని ముకుందుడు నిర్ణయించాడు. పార్వతి తన భర్త నిర్ణయాన్ని ఈసారి గౌరవించింది.