Chandamama Kathalu-నిజమైన మాట

TSStudies

చందమామ కథలు-నిజమైన మాట

అక్బర్‌ చక్రవర్తి ఆస్థానంలో వీరబల్‌ విదూషకుడుగాను, ఆంతరంగికుడు గాను ఉండేవాడు. తాన్సేన్‌ సంగీత విద్వాంసుడు. తాన్సేన్‌ పాట వినడానికి దేశదేశాలనుండి ప్రముఖులు వచ్చేవారు.
ఈ ప్రజ్ఞకు తాన్సేన్‌ అతిశయపడలేదు. కాని, మిగిలిన ముసల్మానులకు, తాన్సేనుకు సమానుడు లేడని గర్వం పట్టుకున్నది. అంతే కాదు. చక్రవర్తికి అభిమానుడైన వీరబల్‌ను తప్పించి, ఆ స్టానంలో తాన్సేన్‌ను నియమించడం తగునని సూచనలు చేస్తూ వచ్చారు.
Chandamama kathalu in telugu,Chandamama stories in telugu,telugu Chandamama kathalu,telugu Chandamama stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,betala vikramarka kathalu in telugu,batti vikramarka kathalu in telugu,history of bethala kathalu,balamitra kathalu,panchatantra kathalu,
ఈ మాటలను గ్రహించిన చక్రవర్తి ఈ ప్రస్తావనను సహించలేక 'మీరెంత చెప్పినా, వీరబలుడంతటి వాడు జన్మజన్మలకూ మరొకడు కానేరడు, అని జవాబు చెప్పాడు.
అప్పటికేమీ అనలేక ముసల్మానులు కొన్నాళ్ల తర్వాత ఒకనాడు సభ ఏర్పాటు చేశారు. చక్రవర్తిని కూడా ఆహ్వానించారు.
ఆనాడు చాలా వేడిగా, ఉక్కగా ఉన్నది. ప్రమిదలలో చమురు, వత్తి వేసి ఊరకున్నారు గాని, ఛీకటిపడినా ముసల్మానులు వెలిగించ లేదు.
తాన్సేను దీపకరాగం పాడేసరికి, దీపాలన్ని వాటంతటవే వెలిగినై. మేఘమల్హార్‌ రాగం పాడాడు. వెంటనే ఉక్కపోయి వర్షం కురిసింది.
ఇందుకు చక్రవర్తి వింతపడటం గమనించిన ఒక ముసల్మాను వృద్ధ వ్యక్తి, “ప్రభూ! ఇప్పుడు బోధపడిందా? వీరబలుడికి ఇటువంటి ప్రజ్ఞలెక్కడివి? అందుకనే మంత్రిపదవికి తాన్సేన్‌ తగినవాడని లోకం ఘోషిస్తున్నది, అని చాకచక్యంతో మనవిచేశాడు.
Chandamama kathalu in telugu,Chandamama stories in telugu,telugu Chandamama kathalu,telugu Chandamama stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,betala vikramarka kathalu in telugu,batti vikramarka kathalu in telugu,history of bethala kathalu,balamitra kathalu,panchatantra kathalu,
అందుకు అక్బరు 'తాన్సేన్‌ గొప్ప విద్వాంసుడే. కావచ్చు. కాని వీరబలుని సరిపోలడు. కావాలంటే ప్రత్యక్షంగా రుజువు చేస్తాను, అని ఖచ్చితంగా చెప్పాడు.
రోజుల్లోనే అక్పరు చక్రవర్తి అవా దేశపు రాజుకు జాబొకటి రాశాడు. ఆ ఉత్తరానికి ముద్రలు వేసి, వీరబలుణ్డీ తాన్సేననీ పిలిచి, “మీరీ జాబు పట్టుకుని అవా దేశపు రాజు వద్దకు పోవాలి. చాలా అవసరమైన పని. ఈ పని మీరిద్దరు తప్ప మరెవ్వరూ నిర్వహించలేరు, అని చెప్పి జాబిచ్చాడు.
వారు బయల్దేరారు. తాన్సేను తన మనసులో 'ఇదేదో చాలా ముఖ్యమైన కార్యమై ఉంటుంది. ఆ రాజుకు నా సంగీతం వినిపించి బహుమతి పొందుతాను,” అనుకుని సంతోషించాడు.
కాని వీరబల్‌ మట్టుకు, ఇందులో ఏదో రహస్యం ఉండకపోదు, అనుకుని వెయ్యి విధాల ఆలోచింపసాగాడు. చివరకెలా అయితేనేం, మహారణ్యాలు దాటుకుపోయి కొన్నాళ్లకు వారు బర్మాచేరుకుని, ఆవా రాజు దర్శనం చేసుకున్నారు.
వారు తెచ్చిన జాబు చదువుకున్నాడు రాజు. అందులో ఇలా ఉంది:
'నా సేవకులిద్దరు మీ దర్శనానికి ఈ లేఖ పట్టుకు వస్తారు. ఒక రహస్యాపరాధం చేయడం చేత వీరిని దండింపవలసి వచ్చింది. గోప్యంగా జరపవలసిన కార్యం కనుక ఇక్కడ ఆ పనిచేయ వీల్లేక, మీ వద్దకు పంపినాను, మీరు వారికి మరణదండన విధించవలసింది..
రాజు జాబు చదువుకుని మంత్రికి ఇచ్చాడు. అతడు ఇందులో ఏదో రహస్యముందని గ్రహించి, “రాజా, వీరిని ఒక వారం రోజులు చెరలో పెట్టి, తరువాత యుక్తమైన దండన విధించుదాము,' అని సలహా చెప్పాడు. ఆ ప్రకారం వారి చేతులకు సంకెళ్ళు తగిలించి కారా గృహానికి తీసుకుపోయారు.
తాన్సేనుకు మతిపోయినట్తయింది. వీరబలుడికేసి చాలా దీనంగా ఏమిటి ఉపాయం? అన్నట్లుగా చూశాడు. 
అప్పుడు వీరబలుడు అతని చెవిలో ఎదో ఊదాడు. లోన కుమిలిపోతున్నా, తాన్సేన్‌ పైకి ధైర్యంగానే కనబడసాగాడు.
గడువు వారం రోజులూ ముగిసింది. తలారులు వచ్చి విరిని వధ్యస్థానానికి తీసుకుపోయారు.
అక్కడ వీరబలూ, తాన్సేనూ “నన్ను ముందు చంపు అంటే నన్ను ముందు చంపు అని పోరాడసాగారు.
తలారులు రాజువద్దకెళ్ళి, “వీళ్లిద్దరూ పిచ్చివాళ్లు ప్రభూ!' అని మనవి చేశారు.
Chandamama kathalu in telugu,Chandamama stories in telugu,telugu Chandamama kathalu,telugu Chandamama stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,betala vikramarka kathalu in telugu,batti vikramarka kathalu in telugu,history of bethala kathalu,balamitra kathalu,panchatantra kathalu,
అప్పుడు రాజు వారిరువురిని పిలిపించి, “ఎందుకిలా వాదులాడుతున్నారు?'” అని అదిగాడు.
“రాజా ఆ విషయం చెబితే మాకు చాలా నష్టం కలుగుతుంది. అందుచేత చెప్పదలచలేదు, అన్నాడు వీరబల్‌.
“నిజం చెప్పకుంటే యావజ్జీవ ఖైదు వేయిస్తా అన్నాడు రాజు.
ఇక తప్పదన్నట్లుగా, వీరబల్‌ ఇలా ప్రారంభించాడు. 'రాజా! చాలా కాలం నుంచి అవారాజ్యం కలుపుకోవాలని మా రాజు ఉద్దేశం. కాని, తమరు బలశాలులని బెదిరిపోతున్నాడు.
ఒకనాడు ఒక జ్యోతిశ్ళాస్త్రవేత్త వచ్చి, రాజా! ఎందుకు విచారిస్తావు? నీ రాజ్యంలోని ఇద్దరిని అవా రాజు వద్దకు ఎదో మిషపైన పంపించు. వారిని రాజు కనుక చంపాడంటే, మొదట చచ్చినవాడు ఆ దేశానికి రాజవుతాడు. తర్వాత మరణీంచిన వాడు మంత్రి అవుతాడు. అప్పుడు వారు నీకు సామంతులుగా ఉంటారు. ఈ విధంగానే నీకు ఆ రాజ్యం దక్కుతుందే గాని, యుద్ధం చేసి గెలవడం నీతరం కాదు, అని చెప్పాడు. ఈ కారణం చేత మమ్మల్నిద్దరినీ పంపించాడు.
ఈ సంగతి వెల్లడించినందుకు మా రాజు మమ్మల్ని చంపే తీరుతాడు. కనుక అక్కడికి పోకుండా, మమ్మల్ని తమరే చంపించి పుణ్యం కట్టుకోండి ప్రభూ!"
అప్పుడు రాజు మంత్రికేసి చూశాడు. 
మంత్రి రహస్యంగా ఇలా చెప్పాడు, “రాజా, వీరి పరస్పర కలహం వల్ల మనకు అసలు రహస్యం అంతా తెలిసిపోయింది.
వీరినీ చంపితీమా మన రాజ్యం మనకు దక్కదు కనుక, వచ్చినదారినే వీరిని పంపి వేయడం మంచిది.
మంత్రి మాటలను నమ్మిన రాజు వీరబలుడితో “మిమ్మల్ని చంపమని మీ రాజు జాబు వ్రాసి పంపాడు. ఆజ్ఞ నెరవేర్చడానికి మేమేం వారి సేవకులం కాము. నిర్జోషులను చంపిన పాపం మాకు వద్దు. వీరిని మీరే చంపుకోండి, అని మేము చెప్పినట్టు మీ రాజుతో చెప్పండి. పొండి! అన్నాడు.
ఇందుకు వీరబల్‌ “మహారాజా! ఇది తమకు న్యాయం కాదు. నేను మొదటే చెప్పానుగా, మా రహస్యం వెల్లడిస్తే మాకు హాని వస్తుందని? అనుకున్నట్లే అయింది. అన్నాడు దీనంగా.
“అదంతా మాకు తెలియదు. తెలిసి విషమెవరు తాగుతారు? పొండి పొండి. లేకుంటే బైటికి తరిమించివేస్తా అని బెదిరించాడు రాజు,
వీరబల్‌ భయం నటిస్తూ, "సెలవు! సెలవు! అని తాన్సేన్‌ను వెంటబెట్టుకుని బయటపడి మళ్లీ ఢిల్లీ నగరం చేరుకున్నాడు.
తాన్సేను అక్చరుని చూసి “ప్రభూ! వీరబలుడే లేకుంటే నేను తమ దర్శనం చేసుకోగలిగేవాణ్ణే కాదు. అతని బుద్దికుశలతే మా ఇద్దరినీ రక్షించింది... అంటూ జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు.
Chandamama kathalu in telugu,Chandamama stories in telugu,telugu Chandamama kathalu,telugu Chandamama stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,betala vikramarka kathalu in telugu,batti vikramarka kathalu in telugu,history of bethala kathalu,balamitra kathalu,panchatantra kathalu,
అప్పుడు చక్రవర్తి, ఇదివరకు ఎదురు తిరిగిన ముసల్మానులందర్న పిలిపించి, వీరబలుని బుద్దివిశేషం పరీక్షించడానికి తను పన్నిన పన్నుగడ, వీరబల్‌ బుద్ధి చాతుర్యం వారికి వివరించి చెప్పాడు. అప్పుడు ముసల్మానులందరికీ అక్బరు చక్రవర్తి చెప్పినది నిజమైన మాట అని నమ్మకం కలిగింది.
ఆవిధంగా ముసల్మానులందరికీ వీరబల్ పైన గల అసూయ పోయి, ఎంతో గౌరవభావం ఎర్పడింది.