చందమామ కథలు-సరికొత్త శ్లోకం
రాజులసేవ కత్తిమీది సామువంటిది. కాళిదాసును ప్రాణంతో సమానంగా చూసుకునే భోజరాజుకు కూడా కాళిదాసుపై ఏదో ఆగ్రహం కలిగింది. ఆ కారణంగా కాళిదాసు ధారానగరం విడిచి పోయాడు.
కాళిదాసు వెళ్లిపోయిన అనంతరం భోజరాజు పండిత పరిషత్తులో ఒక రకమైన అరాజకం ఏర్చడింది. ఆ పండితులలో ముగ్గురు చురుకైన వాళ్లు చేరారు. వారిలో ఒకడు ఏకసంతాగ్రాహి అంటే ఏదైనా ఒకసారి వింటే పట్టెయ్యగలవాడు, రెండోవాడు ద్విసంతాగ్రాహి రెండు సార్లు విని పట్టేస్తాడు; మూడోవాడు మాత్రం (తిసంతాగ్రాహి.
ఎవరైనా ఊరూపేరూ లేని కవులు ఒక కొత్త శ్లోకం చదివితే భోజరాజు వారికి ఒక లక్ష పారితోషకం ఇచ్చి పంపుతూ ఉండేవాడు. కాని ఈ ముగ్గురూ చేరినాక ఈ ఆచారానికి విఘాతం కలిగింది. ఎందుకంటే ఎవరైనా వచ్చి సభలో శ్లోకం చదివితే ఏక సంథాగ్రాహి లేచి “ఇది నేను విన్న శ్లోకమే' అని తాను కూడా దానిని చదివేసేవాడు. అప్పటికి రెండుసార్లు విని ఉన్న ద్విసంథాగ్రాహి, “ఇది పాత శ్లోకమే' అని తాను కూడా చదివేవాడు. అతడి వెనుకగా త్రిసంథాగ్రాహి చదివేవాడు. అది పాత శ్లోకమేనని భోజరాజుకు నమ్మకం కుదిరేది. కొత్తగా వచ్చిన వాడు అవమానం పొంది వెళ్ళిపోయేవాడు.
ఈ విధంగా అనేకమంది పండితులు భోజరాజు దగ్గర శ్లోకాలు చదివి, బహుమానానికి బదులు పరాభవం పొంది, తిరిగి వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోయిన వారిలో ఒకడు దూరదేశంలో ఉన్న కాళిదాసుకు తటస్థపడ్డాడు.
పండితుడి అనుభవమంతా విని కాళిదాసు చాలా చింతించాడు. తాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత భోజరాజు ఆస్థానం ఎలా మారిపోయిందీ కాళిదాసుకు చాలా స్పష్టంగా అర్థమయింది.
భోజరాజుకూ, అతని పండితులకూ తగిన శాస్తి చేద్దామని కాళిదాసు నిశ్చయించుకుని, ఒక శ్లోకం రచించి, పండితుడికిచ్చాడు. 'ఈ శ్లోకం తీసుకుపోయి భోజరాజు ఆస్థానంలో చదవండి. మీకు పారితోషకం తప్పక లభిస్తుంది, అన్నాడు. పండితుడు ఆ శ్లోకం తీసుకుని ధారా నగరం చేరి భోజరాజు ఆస్థానానికి వెళ్లాడు.
“మహారాజా, కొత్త శ్లోకం రచించాను. విని, తగిన పారితోషికం ఇప్పించండి,” అన్నాడు పండితుడు. భోజరాజు శ్లోకం చదవమన్నాడు. పండితుడీ శ్లోకం చదివాడు.
“స్వస్తి శ్రీ భోజరాజ: త్రిభువనవిదితో థార్మికస్తే పితా భూత్పిత్రాతే వైగృహీతా నవనవ తిమితా రత్నకోట్యోమదీయా: తామేదేహీతి, రాజన్: సకల బుధజనైర్జాయతే సత్యమేతన్నోవా జానంతితే తన్మమకృతి మధవా దేహిలక్షంతతొోమే, '”
(శ్రీ భోజరాజుకు స్వస్తి! థార్మికుడని మూడులోకాల ప్రసిద్ధిగాంచిన మీ తండ్రి' గారు 99 కోట్ల రత్నాలు నావి తీసుకున్నాడు. వాటిని నాకు ఇప్పించు. ఈ మాట నిజమని పండితులందరూ ఎరుగుదురు. ఒకవేళ వారు ఎరగని పక్షంలో నా ఈ శ్లోకానికి అధమం లక్ష అయినా ఇప్పించు.)
ఈ శ్లోకం వినగానే ఏకసంధాగ్రాహి మొదలైన వాళ్లు పెద్ద చిక్కులో పడ్డారు. ఈ శ్లోకం అదివరకే తమకు తెలుసునన్నట్లయితే, భోజరాజు తండ్రి ఈ పండితుడివద్ద 99 కోట్ల రత్నాలు తీసుకుని ఉన్నమాట తమకు అదివరకే తెలిసినట్లు: సాక్ష్యం చెప్పినవారవుతారు.
ఆమాట సమస్త పండితులకూ తెలుసునని శ్లోకంలో ఉన్నది. ఆ శ్లోకం తెలియని వారికి మాత్రమే ఆ మణులమాట తెలియకపోవాలి,
తమకా శ్లోకం తెలియదన్న పక్షంలో అది సరికొత్త శ్లోకమవుతుంది. అప్పుడు భోజరాజు పండితుడికి ఒక లక్ష్రమాత్రమే ఇవ్వవలిసి వస్తుంది.
అందుచేత సభలో అందరూ అది కొత్త శ్లోకమేనని ఒప్పుకున్నారు. భోజరాజు పండితుడికి లక్షపారితోషికం ఇప్పించి, 'అయ్యా, మీరు ఈ శ్లోకం ఈ విధంగా ఎందుకు రాయవలసి వచ్చింది? దీని ఆంతర్యమేమిటి? అని అడిగాడు.
పండితుడు భోజరాజుతో, తాను పూర్వం వచ్చి ఒక కొత్త శ్లోకం చదివిన సంగతి, తన కథ అంతా విని ఎవరో బాహ్మడు ఈ శ్లోకం రాసి పంపిన సంగతీ చెప్పేశాడు.
ఏక సంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి తిసంథాగ్రాహి కలిసి ఆడే నాటకం భోజరాజుకు అర్ధవముయింది. వీరి మూలంగా ఎందరికి అన్యాయం జరిగిందో?