చందమామ కథలు-లెక్కలు రాని రాజు
పూర్వం మగధ దేశాన్ని చతురంగవీరుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు.
నిత్యమూ తనతో ఆడటానికి వచ్చేవాళ్లతో వేగలేక రాజు, నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరచ్చేదం శిక్ష విధించబడుతుంది, అని ప్రకటన చేశాడు.
ఈ ప్రకటన విన్న తరవాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవటం మానేశారు.
ఎప్పుడన్నా ఒకరూ, ఇద్దరూ వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవాడు. కాదు కూడదని ఎవరైనా పట్టుపట్టి ఆటకు కూచుంటే రాజు వారిని ఆటలో ఓడించి, తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు వారికి శిరచ్చేదం చేయించాడు.
ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్నవారే లేకుండా పోయారు.
మంచి ఆటగాళ్లేవరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టయింది.
ఆ కాలంలోనే కావేరీ నది తీరాన ఒక గొప్ప శాస్త్రజ్జుడు ఉండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో, తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు, అని చెప్పేవాడు. అవకాశమిస్తే ఆటకట్టించి చూపేవాడు కూడా.
ఈ బ్రాహ్మడికి మగధ దేశపు రాజు యొక్క వృత్తాంతం తెలిసంది. ఆయనకు రాజుమీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చందరంగం ఆటయొక్క రక్తి ఆడటంలో ఉంది కాని గెలవడంలోనూ ఓడటంలతోనూ లేదు. చదరంగం ఆట అన్న తరవాత దానిలో ఒకడు గెలిచేవాడుంటాడు. ఒకడు ఓడేవాడూ ఉంటాడు. ఓడిపోయినంత మాత్రాన ఈ రాజు శిరచ్చెదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు?
మగధరాజుకు ఎట్లాగైనా బుద్ది చెప్పాలని ఈ బ్రాహ్మడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు
“మహారాజా, నేను కావేరీతీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపులమని విన్నాను. తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను. అన్నాడు (బాహ్మడు.
“నిజమేనయ్యా? నాకూ చదరంగం ఆడాలనే ఉంది. కాని నాతో ఆడేవాడేడీ? నాతో ఆడి ఓడిపోయినవాడికి శిరచ్భదం విక్ర విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడడానికి దైర్యం చేయలేకున్నారు! అన్నాడు రాజు.
(బాహ్మడు కొంచెం ఆలోచించి, 'అలా అయితే, నేనే తమతో ఆడతాను, అన్నాడు.
“పిచ్చి బాహ్మడా! నిష్కారణంగా తలపోతుంది! ఓడితే శిరచ్చేదానికి సిద్ధమేనా? అని అడిగాడు రాజు.
“ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి, అన్నాడు బ్రాహ్మడు.
“ఎమిటి నీ సందేహం?' అని అడిగాడు రాజు.
"నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు. కాని దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు? అన్నాడు బ్రాహ్మడు.
“నన్ను చదరంగంలో గెలిచినవాడు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి? అన్నాడు రాజు.
“నేను గెలిస్తె ధాన్యం ఇప్పించండి. చదరంగం బల్లలో ఉండే గళ్లలో, ఒక గడి కన్న మరొక గడికి రెట్టింపు గింజలచొప్పున పెంచుతూ, 64 గళ్ళకూ ధాన్యం ఇప్పించ్చన్నాడు (బ్రాహ్మడు.
మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మడికి ఇవాళ ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు ఆట చాలా పట్టుదలగా ఆడాడు. కాని చివరకు బ్రాహ్మడే రాజు ఆటకట్టించాడు. "నేను ఓడిపోయాను! నువు నిజంగా గొప్ప ఆటగాడివే. కాని నన్ను రెండుసార్లు ఓడిస్తానన్నావు. ఒకసారే ఓడించావు. నా రెండో ఓటమి ఎమిటి? అని రాజు బ్రాహ్మడుని అడిగాడు.
“నా బహుమానం నాకు దయచేయించండి. తరవాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం, అన్నాడు బ్రాహ్మడు.
రాజు ధాన్యం బస్తాలు తెమ్మని భటులకు ఆజ్ఞాపించాడు.
“నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వెయ్యండి. ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పంచవచ్చు, అన్నాడు బాహ్మడు.
రాజ్యంలోని గణిత ప్రవీణులను పిలిపించాడు రాజు.
'మొదటిగడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు? అని అడిగారు వారు.
'ఒక్కగింజ పెట్టండి చాలు! అన్నాడు (బాహ్మడు.
రాజు (బాహ్మడీ అల్పసంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో ఒక గింజా, రెండో గడిలో ర౦డు గింజలూ, మూడోగడిలో
నాలుగు గింజలూ ఈ విధంగా 64 గడులకూ అయే గింజల సంఖ్యను రాజుగారికి చూపారు.
1884467440 7370955161 05
రాజు నిర్దాంతవోయాడు.
“అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్కవెయ్యండి, అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్జులు మానికకు ఎన్ని గింజలో కొలిచి, పుట్టికి ఎన్ని గింజలో గుణించి, మగధ రాజ్యంలో ఎటా ఎన్ని పుట్లు పండుతున్నాయో ఆరా తీసి చివరకు రాజుతో, “మహారాజా, మనరాజ్యంలో రెండు లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది, ' అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మెరలేదు.
'ఔరపిడుగా! ఇదేనా నువ్వు చెప్పిన నా రెండో ఓటమి? అన్నాడు రాజు.
“చిత్తం మహారాజా! నేను కోరినది చాలా తక్కువనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నాతల ఇచ్చి ఉందును. నేను గెలిచాను కాని నేనడిగినది తమరు ఎలానూ ఇవ్వలేకు, అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ.
“ఆటలో గెలిచావు గనక సరిపోయింది. ఓడిపోతే ఏమై ఉండును. ఇంత సాహసం ఎందుకు చేశావు, అన్నాడు రాజు.
"నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో, అప్పుడే మీకు గణితజ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢిచేసుకుని మరీ పందానికి సమ్మతించాను. నాపాటి గణితజ్ఞానం మీకుంటే మీతో చదరంగం ఆడుండను, అన్నాడు బ్రాహ్మడు.
రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వంమాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు.