విజయనగర సామ్రాజ్యం (1336-1646):
విజయనగర సామ్రాజ్యన్నీ స్థాపించినవారు వారు -హరిహరరాయలు, బుక్కరాయలు.
మహ్మద్ బీన్ తుగ్లక్ దక్షిణ భారతదేశంపై దాడి చేసినపుడు కంపిలి ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడి పాలకులైన హరిహర రాయలు, బుక్కరాయలను బంధించి ఢిల్లీకి పంపాడు.
హరిహరరాయ, బుక్కరాయలు స్వతంత్ర పాలన చేయుటకు నిర్ణయించి శృంగేరి మఠాధిపతి అయిన విద్యారణ్యస్వామి సహాయాన్ని ఆర్జించారు.
1886 ఏప్రిల్ 18న విద్యారణ్యస్వామి హంపిలోని విరూపాక్ష దేవుని సన్నిధిలో వీరిద్దరినీ ఇస్లాం మతం నుండి మరలా హిందూ మతంలోకి మార్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడంలో సహకరించాడు.
వీరిద్దరూ కంపిలిలో 'అనెగొంది' అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు.
అనెగొంది సురక్షితంగా లేకపోవడంతో తుంగభద్ర నది దక్షిణాన విజయనగరం అనే పట్టణాన్ని నిర్మించి దాన్ని తమ రాజధానిగా మార్చారు.
విజయనగరాన్ని 4 వంశాలు పాలించాయి.
1) సంగమ వంశం : 1336-1485
2) సాళువ వంశం: 1485-1505
3) తుళువ వంశం : 1505-1570
4) ఆరవీటి వంశం వ 1570-1646
సంగమ వంశం:
మంగల నిలయ అనే ప్రాంతానికి చెందిన(కర్ణాటక) సంగముడికి ఐదుగురు కుమారులు
1) హరిహరరాయలు
2) బుక్కరాయలు
3) కంపన
4) మారప్ప
5) ముద్దప్ప
హరిహరరాయలు, బుక్కరాయలు మొదట్లో కాకతీయుల యొక్క సామంతులు.
తర్వాత కాలంలో హోయసాలుల రాజ్యంలో అధికారులుగా ఉండేవారు.
తమ తండ్రి సంగముడు పేరు మీదుగా వీరి వంశానికి “సంగమ వంశం” అని పేరు వచ్చింది.
హరిహరరాయలు-1:
ఇతని కాలంలో 1847లో హసన్‌గంగూ బహమనీ రాజ్యాన్ని గుల్బర్గా వద్ద స్థాపించాడు.
ఇతని కాలం నుండే విజయనగర, బహమనీ రాజ్యాల మధ్య రాయచూర్ అంతర్వేది/దోబ్(కృష్ణా-తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం) కొరకు పోరాటాలు ప్రారంభమయ్యాయి.
మొదటి హరిహరరాయల బాగపెల్సి తామ్ర ఫలక శాసనం అతను సాధించిన ఘనకార్యాలు వివరిస్తుంది.
విజయనగర పట్టణ నిర్మాణం ప్రారంభించాడు.
బుక్కరాయలు-1:
ఇతని కుమారుడు కుమార కంపన మధురైని ఆక్రమించాడు.
కుమార కంపన భార్య గంగాదేవి తన భర్త విజయాలను “మధుర విజయం” అనే పుస్తకంలో పేర్కొంది.
గంగాదేవి గురువు - అగస్త్యుడు
బుక్మరాయ-1 కాలంలో రాయచూర్ దోబ్ కొరకు 2సార్లు బహమనీ రాజ్యంతో యుద్దాలు జరిగాయి.
ఈ 2 యుద్ధాలలో కూడా లక్షల మంది పౌరులు హతమార్చబడ్డారు.
దీంతో బుక్కరాయ-1 ఒక సంధి కుదుర్చుకొని రాయచూర్ దోబ్‌ను 2 రాజ్యాలు నమానంగా పంచుకునేటట్లు చేశాడు.
భవిష్యత్తులో జరిగే ఏ యుద్దాల్లోనూ పౌరులపై దాడి చేయకూడదని నిర్ణయించారు.
బుక్కరాయ-1 మింగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తికి తన రాయబార బృందాన్ని పంపాడు.
ఇతను అల్ప సంఖ్యాకులైన జైనులకు రక్షణ కల్పించాడు. శ్రీరంగ పట్టణంలో జైనులకు, వైష్ణవులకు మధ్య జరిగిన వివాదాలను పరిష్కరించాడు.
ఇతని ఆస్థానంలో తెలుగు కవి నాచనసోముడు ఉండేవాడు. ఇతనికి పెంచికలదిన్నె అనే అగ్రహారం ఇవ్వబడింది.
నాచనసోముడు ఉత్తరహరివంశంను రచించాడు.
బుక్కరాయలు విజయనగర పట్టణ నిర్మాణాన్ని పూర్తిచేశాడు.