హరిహరరాయ-2:
ఇతన్ని రాజవాల్నీకి లేదా రాజవ్యాస్ అని కూడా అంటారు.
ఇతని గురువు -శవనాచారి
ఇతని మహామంత్రి - సాయన/సాయనాచార్యుడు (విద్యారణ్యస్వామి సోదరుడు)
ఇతని మంత్రి - మాదవుడు గోవాను ఆక్రమించి భువైనక వీరుడు అనే బిరుదును ఫొందాడు.
“సాయన మరియు మాధవుడు నాయకత్వంలో వేదాలకు వ్యాఖ్యలు రచించబడ్డాయి.
ఇతని ఇంకొక మంత్రి ఇరుగప్ప దండనాథుడు గనిగిట్ట అనే జైన దేవాలయాన్ని నిర్మించాడు.
ఇరుగప్ప దండనాథుడు నవరత్నమాల అనే పుస్తకాన్ని రచించాడు.
హరిహర-2 శ్రీలంకపై దాడి చేసిన మొట్టమొదటి విజయనగర రాజు.
దేవరాయలు-1:
ఇతను ముద్గళ్ అనే యుద్ధంలో ఫిరోజ్‌షా బహమనీచే ఓడించబడి తన కుమార్తెను ఫిరోజ్‌షాకు ఇచ్చి వివాహం చేశాడు. ఈ యుద్ధం కంసాలి కుమార్తె అయిన నెహాల్ యొక్క మాన మర్యాదల కొరకు జరిగింది. ఈ సందర్భంగా బంకపూర్ అనే ప్రాంతాన్ని ఫిరోజ్‌షా కు కట్నంగా ఇచ్చాడు.
ఇతను తుంగభద్ర నదిపై ఆనకట్టను నిర్మించాడు.
ఇతని ఆస్థానానికి ఇటలీ/ వెనిస్ యాత్రికుడైన నికోలోకాంటి వచ్చాడు.
దేవరాయలు-2:
ఇతని బిరుదు -గజబేతకార
ఇతను సంగమ వంశంలో అతి గొప్పవాడు.
ఇతని కాలంలో 1448లో పర్షియా రాజు 2వ ఖుస్రో యొక్క రాయబారిగా అబ్బుల్ రజాక్ విజయనగర ఆస్థానాన్ని సందర్శించాడు.
అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యంలోని వేశ్య వ్యవస్థ గురించి వివరించాడు.
వేశ్యల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారని, ఆ పన్నులను పోలీసులకు జీతాలుగా ఇచ్చేవారని ఇతను పేర్కొన్నాడు.
దేవరాయ-2 వీరశైవ మతాన్ని పాటించాడు.
ఇతను ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్నాడు.
ఇతని సేనాని లక్కన్న శ్రీలంకపై దాడిచేసి, ఆ దేశం నుండి కప్పం వసూలు చేశాడు.
అందువల్లే లక్కన్నను దక్షిణ సముద్రాదీశ్వర అనే బిరుదుతో పిలుస్తారు.
దేవరాయ-2 ఒక గొప్ప సాహితీవేత్త.
ఇతను ముత్యాలశాల అనే సాహిత్య సమావేశాన్ని నిర్వహించేవాడు.
ఇతని ఆస్థానంలోని ధిండిమభట్టును ఓడించిన శ్రీనాథుడికి కనకాభిషేకం చేసి, అతనికి కవిసార్వభౌమ అనే బిరుదును ఇచ్చాడు.
దేవరాయ-2 మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించాడు.
ఇతని ఆస్థానంలో కన్నడ కవులైన చామిడను, జక్కనాచార్యులు ఉండేవారు.
సంగమ వంశంలో చివరివాడు ప్రౌఢ దేవరాయలు.
ఇతని కాలంలో సాళువ నరసింహరాయ ఒక స్వతంత్ర సామంతుడిగా ఉండేవాడు.
విరూపాక్షుడు-2 కుమారుడైన ప్రౌడ దేవరాయలు అనేక వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో సాళువ నరసింహరాయ తన సేనాని అయిన నరస నాయకున్ని విజయనగరం పైకి పంపాడు.
దీంతో ప్రౌడ దేవరాయలు రాజ్యాన్ని వదిలి పారిపోయాడు. దీంతో సంగమ వంశం అంతమైంది. దీనినే మొదటి ఆక్రమణ అంటారు.
ప్రౌడ దదేవరాయుని ఆస్థాన కవయిత్రి -హన్నమ్మ