రాజకీయ అభివృద్ధి:
క్రీపూ. 6వ శతాబ్ధంలో 16 మహా జనపదాలు ఆవిర్భవించాయి.
16 మహాజనవదాల గూర్చి సుత్త పీఠిక లోని అంగుత్తరనియలో పేర్కొనబడింది.
నెంబరు.
|
రాజ్యం
|
రాజధాని
|
1
|
మగధ
|
రాజగ్భహం (గిరివిరాజ) పాటలీపుత్ర
|
2
|
అంగ
|
చంపా
|
3
|
లిచ్చావి
|
వైశాలి
|
4
|
కాశీ
|
వారణాసి
|
5
|
వత్స
|
కౌశాంబి (గంగా, యమున నదుల మధ్యఉంది)
|
6
|
చేది
|
సుక్తిమతి
|
7
|
అశ్మక
|
బోధాన్
|
8
|
అవంతి
|
ఉజ్జయిని (ఉత్తరానికి),
మహిష్మతి (దక్షిణాది)
|
9
|
మత్స్య
|
విరాట్నగర్ (బీరుట్)
|
10
|
కోసల
|
శ్రావస్తి
|
11
|
మల్ల
|
కుశీనగర్, పావపురి
|
12
|
పాంచాల
|
అహిచేత్ర
|
13
|
కురు
|
హస్తినాపుర
|
14
|
శూరసేన
|
మధుర
|
15
|
గాంధార
|
తక్షశిల (సింధు,జీలం నదులమధ్య)
|
16
|
కాంభోజ
|
రాజపురం
|
మగధ:
మగధ విజృంభణకు కారణాలు
1) వనరులు-జలవనరులు, భూవనరులు, అడవులు,
2) రాజుల బెత్సాహికత
3) మగధ రాజధాని వ్యూహాత్మకంగా ఉండుట
మగధపై మొట్టమొదటిసారిగా వ్యవస్థీకృతంగా ఏర్పడ్డ వంశం - హార్యంక వంశం
హార్యంక వంశం:
హార్యంక వంశమును స్టాపించింది “బింబిసారుడు
ఇతను వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యమును విస్తరింపజేశాడు.
“కోశలాదేవిని వివాహమాడి “కాశీని కట్నంగా పొందాడు.
ఇతను లిచ్చవి రాజు చేతకుని కుమార్తె అయిన చెల్లనను వివాహమాడాడు. చేతకుని సోదరియే త్రిశల(మహావీరుని తల్లి)
ఇతను బుద్ధుడు, వర్ధమాన మహావీరుని సమకాలికుడు.
ఇతను అవంతీ పాలకుడు చండ ప్రద్యోతతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాడు.
చండప్రద్యోతునికి కామెర్ల వ్యాధి వచ్చినపుడు బింబిసారుడు తన వ్యక్తిగత వైద్యుడు జీవకుని పంపాడు.
ఇతని కాలంలో గాంధార పాలకుడు పుక్కుసతి తక్షశిల నుండి కాలినడకన బుద్ధున్ని చూచుటకు మగదకు వచ్చాడు.
బింబిసారుని తర్వాత మగధ పాలకుడు -అజాతశత్రువు
బింబిసారుడు మరియు చెల్లనకు అజాతశత్రువు జన్మించాడు. అజాతశత్రువు తన తండ్రి బింబిసారున్ని చంపి సింహాసనాన్ని అధిష్టించాడు.
అజాత శత్రువు కాశీ, లిచ్చవీ రాజ్యాలను ఆక్రమించాడు.
అజాత శత్రువు '“అమ్రపాలీ యుద్ధంలో కోశలరాజు ప్రసన్నజిత్తును ఓడించి కాశీని ఆక్రమించాడు.
లిచ్ఛవీ రాజ్యమును ఆక్రమించుటకు 16 సం॥లు పోరాటం చేశాడు. దీనిలో అజాత శత్రువు ప్రధాని వస్సాకర కీలకపాత్ర పోషించాడు.
అజాత శత్రువు బింబిసారుని వలె గౌతమబుద్దునికి, మహావీరునికి సమకాలీనుడు.
ఇతను -మొదటి బౌద్ద సంగీతిని “రాజగృహంలో నిర్వహించాడు.
అజాత శత్రువు తర్వాత ముఖ్యమైన రాజు ఉదయనుడు
ఉదయనుడు రాజధానిని పాటలీపుత్రమునకు మార్చాడు. (పాటలీపుత్ర దుర్గమును అజాత శత్రువు నిర్మించాడు)
ఉదయనుడు, దేవయాని మధ్య ప్రేమవ్యవహారం ఉండేది.
చివరివాడు -నాగదాసుడు
శైశునాగ వంశం(శిశునాగ వంశం):
ఈ వంశాన్ని శిశునాగుడు స్థాపించాడు.
ఇతను అవంతిని ఆక్రమించాడు.
శిశునాగుడు రాజధానిని పాటలీపుత్రం నుంచి వైశాలికి మార్చాడు.
ఇతని తర్వాత రాజు - కాల అశోకుడు
కాల అశోకుడు -2వ బౌద్ధ సంగీతిని వైశాలిలో నిర్వహించాడు.
నంద వంశం:
మహాపద్మనందుడు నంద వంశాన్ని స్థాపించాడు.
మగధ రాజ్యాన్ని పరిపాలించిన వారిలో అత్యంత శక్తివంతమైన వారు నంద రాజులు.
మహాపద్మనందుని బిరుదులు
1) 2వ పరశురాముడు
2) సర్వక్ష తాంత్రిక
ఇతని ప్రధాని - రాక్షస/ రాక్షసుడు
ఇతను మొట్టమొదటిసారిగా వ్యవస్టీకృతంగా శిస్తు వసూలు చేసే విధానమును ప్రవేశపెట్టాడు.
ఇతను సైన్యాన్ని 4 భాగాలుగా విభజించాడు
1) కాల్బలం
2) అశ్వక బలం
3) గజ బలం
4 రథ బలం
ఇతను రాజధానిని మరలా వైశాలి నుండి పాటలీపుత్రమునకు మార్చాడు.
పద్మనందుడి కాలంలో తక్షశిల విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది.
పద్మనందుడు మంగళి అని హేమచంద్రుడు రచించిన జైన గ్రంథం “'పరిశిష్ట పర్వన్” పేర్కొంటుంది.
నందుల చివరి రాజు అయిన ధననందుడిని అంతం చేసి చంద్రగుప్త మౌర్యుడు మగద పై మౌర్య సామ్రాజ్యమును స్టాపించాడు.