పరివర్తన కాలం-4

TSStudies
దక్షిణ భారతదేశం:
క్రీ.శ. 550-1200 మధ్య కాలంలో దక్షిణ భారతదేశాన్ని ప్రధానంగా ఈ క్రింది రాజ్యాలు పాలించాయి.
1) పల్లవులు
2) చోళులు
3) బాదామీ చాళుక్యులు
4) రాష్ట్రకూటులు
5) కల్యాణీ చాళుక్యులు

పల్లవులు:
రాజధాని - కంచి
స్థాపకుడు. - సింహ విష్ణువు
pallava dynasty in telugu,history of Pallava dynasty in telugu,Pallava dynasty history in telugu,pallava empire in telugu,history of pallava empire in telugu,pallava empire history in teluug, ts studies,tsstudies,ts study circle,indian history in telugu,ancient indian history in telugu,tspsc indian history in telugu,tspsc study material in telugu,tspsc notes in telugu

మహేంద్రవర్శన్‌ (క్రీ.శ. 600-680):
మహేంద్రవర్మన్‌ యొక్క బిరుదు -విచిత్రచిత్ర.
ఇతను 'మత్తవిలాస ప్రహసని, "భగవదజ్ఞుగ" అనే పుస్తకాలను రచించాడు.
ఇతని యొక్కకుడిమియమలై శాసనం సంగీతం గురించి తెలియజేస్తుంది.
మహేంద్రవర్మ యొక్క 'చిత్రకారపులి' అనే ఇంటి పేరు ఇతని చిత్రలేఖనానికి చేసిన సేవను గురించి తెలియజేస్తుంది.
ఇతని 'సత్తనవాసల్'  పెయింటింగ్‌ నాట్యం గూర్చి తెలుపుతుంది.
ఇతను మహాబలిపురంలో మహేంద్రవర్మ మండపమును నిర్మించాడు.
ఇతను రెండవ పులకేశి చేతిలో ఓడిపోయి వేంగి ప్రాంతము (కృష్ణా-గోదావరి మధ్య)ను కోల్పోయాడు.

1 వ నరసింహవర్మన్  (6380-55):
ఇతని బిరుదులు -::మామల్ల / మహామల్ల, వాతాపికొండ
ఇతను పల్లవ రాజులలో అతి గొప్పవాడు. ఇతను మణిమంగళ యుధ్ధంలో బాదామీ చాళుక్యులలో గొప్పవాడైన రెండవ పులకేశిని హతమార్చి 'వాతాపికొండ' అనే బిరుదును పొందాడు.
నరసింహవర్మ మహాబలిపురంలో పాండవ రథాలను, రాతి కట్టడాలు నిర్మించాడు.

1వ పరమేశ్వరవర్మ:

మామల్లాపురంలో గణేష్‌ దేవాలయమును నిర్మించాడు.

2వ నరసింహవర్మ (655-80):

ఇతనిని రాజసింహుడు అని పిలిచేవారు.
ఇతను కంచిలో కైలాసనాథ దేవాలయమును నిర్మించాడు.
మహాబలిపురంలో తీర దేవాలయమును నిర్మించాడు.
ఇతని ఆస్థానంలో దండిన్‌ అనే కవి దశకుమార చరిత, అవంతీసుందరి కథ అనే పుస్తకాలను రచించాడు.

నందివర్మ:

ఈయన పాలనాకాలంలో చాళుక్య విక్రమాదిత్యుడు కంచిపైకి దండెత్తాడు. విక్రమాదిత్యుడు ఎంతో ఉదార స్వభావం కలవాడు. అతడు కైలాసనాథ దేవాలయానికి అపారమైన దానధర్మాలనిచ్చి నందివర్మ రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు.
నందివర్మ పాలనలో రాష్ట్రకూట వంశ స్థాపకుడైన దంతిదుర్లుడు కంచిపైకి దండెత్తి, తన కుమార్తె రేవ రాకుమారిని నందివర్మకిచ్చి పెండ్లి చేశాడు.
అశ్వవేధ యాగాన్ని జరిపించుటలో నందివర్మ పేరుగాంచాడు. కంచిలోని వైకుంఠ పెరుమాళ్‌ దేవాలయంలోని ప్రాకారాలపై ప్రారంభ దశ నుండి తన పాలనానంతర కాలం వరకు జరిగిన పల్లవుల చరిత్రను, శిల్చ రూపంలో చూడొచ్చు. ఒక రాజు చరిత్ర దేవాలయ ప్రాకారాలపై చిత్రీకరించడం అరుదైన విషయం.
పల్లవుల చివరి పాలకుడు -అపరాజితుడు
పల్లవులు భరత నాట్యమును, కర్ణాటక సంగీతమును, దేవదాసి విధానమును ప్రవేశపెట్టారు.