పాల వంశము:
రాజధాని - మొంఘీర్
స్థాపకుడు - గోపాలుడు
ఇతడు ఉద్ధండపుర విశ్వవిద్యాలయంను స్థాపించాడు.
అతి గొవ్వరాజు -ధర్మపాలుడు
ఇతను విక్రమశిల విశ్వవిద్యాలయమును స్థాపించాడు.
బౌధ్ధ మతంలో తాంత్రిక మతం/ వజ్రయానం (మంత్ర, తంత్రాలను విశ్వసించుట) ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం ద్వారా వ్యాప్తి చెందింది.
దీపాంకరుడు ఈ విశ్వవిద్యాలయంకు చెందినవాడు.
దేవపాలుడు ఒక గొప్ప యుద్ధవీరుడు
రామపాలుని ఆస్థానంలోని సంద్యాకరనందిని రామపాల చరిత అనే పుస్తకాన్ని రచించాడు.
రామపాలుడు కైవర్త అనే మత్స్యకారులతో పోరాటం చేసాడు.
రామపాలుడు రమావతి అనే పట్టణాన్ని నిర్మించాడు.
సేన వంశము:
మొదటి రాజధాని - నాడియా
రెండవ రాజధాని - గౌడ్
స్థాపకుడు - సామంతసేన
బల్లలసేనుడు కులినిజం అనే ఒక కొత్త నియమావళిని బ్రాహ్మణుల కొరకు ప్రవేశపెట్టాడు.
ఇతను గౌడ్/లక్నోటి పట్టణాన్ని నిర్మించాడు.
గొప్పవాడు - లక్ష్మణసేనుడు
లక్ష్మణసేనుడి ఆస్థానంలో పంచరత్నాలు(5గురు కవులు) ఉండేవారు.
వీరు
1) జయదేవుడు -గీత గోవిందము
2) ధోయీ - పవనదూతము
3) హాలయుద్ధ - బ్రాహ్మణ సర్వస్వం
4) శ్రీధరదాస -సదుక్తి కర్ణామృత
5) ఉమాపతి ------
కాశ్మీర్‌ను పాలించిన వంశాలు:
1) కర్కోటకులు: ముఖపిద లలితాదిత్య కాశ్మీర్‌లో మార్తాండ దేవాలయము(సూర్య దేవాలయము)ను నిర్మించాడు.
ఇతని గురించి కల్హణుడి రాజతరంగిణిలో పేర్కొనబడింది.
2) ఉత్పల వంశం: అవంతి వర్మ స్థాపించాడు. ఇతని ఆస్థానంలో అనందవర్ధనుడు ఉన్నాడు. ఆనందవర్ధనుడు “ధ్వన్యాలోకం” అనే సంస్కృత అలంకార శాస్త్రంను రచించాడు.
3) లోహరా వంశం: 3వ జయసింహుని కాలంలో కల్హణుడు రాజతరంగిణిని రచించాడు. దీనిలో కాశ్మీర్ వర్ణన గూర్చి, పాలన గూర్చి ఉంది.
షమీర్ వంశానికి చెందిన జైనుల్ అబిదిన్ కాశ్మీర్ అక్చర్‌గా పేర్కోనబడతాడు.
కాశ్మీర్ పాలకుడు హర్షుడు నీరో ఆఫ్ కాశ్మీర్ గా పిలవబడతాడు.
బ్రాహ్మణ షాహీలు:
రాజధాని -ఉదబందాపూర్
స్థాపకుడు -లల్లియషాహీ
భీముని మనవరాలు రాణి దిగ్ద కాశ్మీర్‌కు చెందిన క్షేమగుప్తను వివాహమాడింది.
గజనీ దాడుల కారణంగా జయపాల రాజధానిని భతిండాకు మార్చాడు.
తర్వాత పాలకుడైన ఆనందపాల క్రీ.శ. 1007-08లో వైహింద్ యుద్దంలో గజనీ చేతిలో మరణించాడు.