పరివర్తన కాలం-1

TSStudies

పరివర్తన కాలం:

ఉత్తర భారతదేశం : క్రీ.శ. 750-1200
దక్షిణ భారతదేశం : క్రీ.శ. 550-1200
దక్షిణ భారతదేశం :
తూర్పు ప్రాంతం:
1. పల్లవులు 
2. చోళులు
పశ్చిమ ప్రాంతం:
3. బాదామి చాళుక్యులు
 4 రాష్ట్రకూటులు 
5. కల్యాణీ చాళుక్యులు 

ఉత్తర భారతదేశం :
క్రీ.శ. 750 నుంచి 1200 మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని ప్రధానంగా రాజపుత్రులు పాలించారు. రెండు రకాల  రాజపుత్రులు ఉండేవారు. వారు
అగ్నికుల రాజపుత్రులు (విదేశీ):
1 చౌహానులు
2. గూర్జర ప్రతీహారులు
3. పరమారులు
4. సోలంకీలు
అగ్నికుల రాజపుత్రులు (స్వదేశీ):
1. కాలచూరీలు (ఖేది)
2. చందేళులు
3. గహద్వాలులు
4. రాథోడ్‌లు (జోథ్‌పూర్‌)
బెంగాల్‌ను పాల, సేన వంశాలు పాలించాయి
కాశ్మీర్‌ను కర్కోటకు, ఉత్పాల, లోహార వంశాలు పాలించాయి.
వాయువ్య భారతదేశంలో బ్రవ్మాణ షాహీలు పాలించారు.

చౌహానులు:
రాజధాని - శాకాంబరి
స్థాపకుడు... - వాసుదేవ/ సింహరాజు
అతిగొప్పవాడు - పృథ్విరాజ్‌ చౌహాన్‌ (3వ పృథ్విరాజు)
అజ్మీర్‌ పట్టణాన్ని అజయరాజు నిర్మించాడు.
క్రీ.శ. 1191 మొదటి తరాయిన్‌ యుద్ధంలో ఘోరీ మహమ్మద్‌, పృథ్వీరాజ్‌పై దాడిచేసి ఓడిపోయాడు. 
క్రీ.శ. 1192 రెండవ తరాయిన్‌ యుద్ధంలో ఘోరీ మహమ్మద్‌ పృథ్వీరాజ్‌ను ఓడించాడు.
పృథ్వీరాజ్‌ కాలంలో సూఫీ సన్యాసి మొయినోద్దీన్‌ చిస్తీ అజ్మీర్‌లో స్థిరపడ్డారు.
ఈయన ఆస్థానంలో చాంద్‌ బర్ధాయ్‌ హిందీలో ప్పథ్వీరాజ్‌ రాసో, సంస్కృతంలో 'పృథ్వీరాజ్‌ విజయ' అనే గ్రంథాలను
రచించాడు.
పృథ్విరాజ్‌ చౌహాన్‌ కనోజ్‌ పాలకుడైన జయచంద్రుని కుమార్తె సంయోగితను(సన్యోగిత) ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు.

గూర్జర ప్రతీహరులు :
మొదటి రాజధాని - భిమ్మల్‌
రెండవ రాజధాని - కనోజ్‌
స్థాపకుడు - 1వ నాగభట్టుడు
అతి గొప్పరాజు - మిహిర్‌ భోజుడు
రాజపుత్రుల్లో రాజకీయంగా మొట్టమొదటగా ప్రసిద్ధి చెందినవారు -ప్రతిహారులు
ప్రతిహార అంటే ద్వార పాలకుడు/ కోట రక్షకుడు
వీరు రామాయణంలో లక్ష్మణుడి సంతతి వారమని ప్రకటించుకున్నారు.
అరబ్‌ యాత్రికుడు సులేమాన్‌ మిహిరభోజుని రాజ్యాన్ని సందర్శించాడు.
మిహిర్‌ భోజుడు భోజ్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించాడు.
మిహిర్‌ భోజునికి 'ఆదివరాహి, “ప్రబోసి అనే బిరుదులు ఉన్నాయి.
మహేంద్రపాల లేదా మహిపాల ఆస్థానంలోని రాజశేఖరుడు ఈ క్రింది పుస్తకాలు రచించాడు.
1) కర్పూర మంజరి
2) బాల రామాయణ
3) బాల భారతం
4) విద్యాశాలభంజిక

పరమారులు :
రాజధాని - ధార్‌
స్థాపకుడు - ఉపేంద్ర
గొప్పవాడు. - భోజుడు
భోజరాజు గొప్ప కవి.
ఇతను కవి పండిత పోషకుడు, తత్వ వ్యాకరణ , అలంకార, శిల్ప వాస్తు, ఖగోళ, న్యాయ శాస్త్రాల్లో పండితుడు.
23కు పైగా గ్రంథాలు రచించాడు. వీటిలోముఖ్యమైనవి
1. సమరాంగణ సూత్రధార
2. పతంజలి యొక్క యోగ సూత్రపై వ్యాఖ్యానం
3. ఆయుర్వేద సర్వస్వం
4. రామాయణ చంపు
5. యుక్తికల్ప తరావు
6. సరస్వతి కంఠాభరణ
7. తత్వప్రకాశ

ఇతని ఆస్థానంలో గల ప్రముఖ కవులు
1 ధనపాలుడు 
2 శాంతిసేనుడు
3 ప్రభాచంద్రసూరి 
4 ఉవాతుడు
ఇతను గొప్ప భవన నిర్మాత. ఇతను థార్‌లో సరస్వతీ ఆలయంను నిర్మించాడు.
భోజుడు భోజ్‌పూర్‌ సరస్సును తవ్వించాడు.
వకవతిరాజా ముంజ కాలంలో వద్మగుప్తుడు “నవసహసాంక చరిత్ర అనే పుస్తకాన్ని రచించాడు.
మెరుటుంగా -ప్రబంధ చింతామణి రచించాడు.
వకపతిరాజా-ముంజసాగర చెరువును థార్‌లో త్రవ్వించాడు.
పరమార రాజు ఉదయాదిత్యుడు ఉదయ్‌పూర్‌లోని నీలకంలేశ్వరాలయాన్ని నిర్మించాడు.

సోలంకీలు:
రాజధాని - అనిల్‌ పాటక
స్థాపకుడు - మూలరాజ-1
గొప్పవాడు - జయసింహ సిద్ధిరాజు
ఇతను 1113-14లో సింహ శకమును ప్రారంభించాడు.
ఇతని ఆస్థానంలోని హేమచంద్రుడు 'పరిశిష్ట పర్వన్‌' అనే పుస్తకాన్ని రచించాడు.
కుమారపాల వ. కూడా హేమచంద్రుడు ఉన్నాడు.
మొదటి భీమరాజు కాలంలో గజనీ మహమ్మద్‌ సోమనాథ ఆలయాన్ని దోచుకున్నాడు.
మౌంట్‌ అబూలోని ప్రసిద్ధ దిల్‌వారా ఆలయాన్ని ఈయన కాలంలో విమల అనే సైన్యాధిపతి నిర్మించడం జరిగింది.
2వ భీమదేవ కాలంలో మొహ్మద్‌ ఘోరీ సోమ్‌నాథ్‌ దేవాలయంపై దాడి చేశాడు.
సునక్‌లోని నీలకంఠ మహాదేవ దేవాలయం, దెల్‌వెల్‌లోని లింబోజీమాత దేవాలయం వీరి కాలం నాటివే.