కాలచూరీలు(చేది) :
రాజధాని - త్రిపురి
స్థాపకుడు - కొక్కల
గొప్పవాడు - లక్ష్మీకర్ణ (ఇతన్ని త్రి కళింగాధిపతి అంటారు) -
ఈ వంశానికి చెందిన 'గార్గేయ దేవుడు' కూడా ఒక గొప్ప వీరుడు.
గార్గేయ దేవుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దిగ్విజయ యాత్ర చేశాడు.
ఇతని బిరుదులు -విక్రమాదిత్య, శ్రీకళింగాధిపత్య
గార్గేయ దేవుని కుమారుడు -కర్ణదేవ
కర్ణదేవుడు వందకుపైగా యుద్దాలు చేశాడని పేర్కొంటారు.
చందేల రాజు త్రిలోక్యమల్లుడు కాలచూరి చివరి రాజు అయిన జయసింహుని ఓడించడంతో వీరి వంశం అంతమయింది.
చందేలులు :
రాజధాని - ఖజురహో
స్థాపకుడు- నన్నుక
వీరి పటిష్టమైన కోట -కలింజర్ కోట
వీరు బుందేల్ ఖండ్ నుండి పాలించారు
ఈ వంశానికి చెందిన ధంగరాజు ఖజురహోలో ఈ క్రింది దేవాలయాలు నిర్మించాడు
1 విశ్వనాథ దేవాలయం
2 జీననాథ దేవాలయం
3 వైద్యనాథ దేవాలయం
పై దేవాలయాలను ఇండో ఆర్యన్ శైలిలో నిర్మించాడు.
విద్యాధర్ కాలంలో మహ్మద్ గజిని చందేల రాజ్యంపై దాడి చేశాడు.
ఈ వంశానికి చెందిన యశోవర్మ(లక్ష్మణ వర్మ) ఖజురహోలో యశోవర్మ చతుర్భుజ (విష్ణు) దేవాలయాన్ని నిర్మించాడు.
గహద్వాలులు:
రాజధాని - కనోజ్
స్థాపకుడు - చంద్రధర
గొప్పవాడు. - జయచంద్ర
క్రీ.శ. 1194లో మహమ్మద్ ఘోరీ చాంద్వార్ యుద్ధంలో జయచంద్రను హతమార్చాడు.
గహద్వాలు పాలకులలో గోవింద చంద్రుడు మంత్రి లక్ష్మీధరుడు స్ట్రుతికల్ప తరావ/కల్పద్రుమంతో సహా అనేక న్యాయ గ్రంథాలను రచించాడు
గోవిందచంద్రుడు “తురువ్కదండి' అనే పన్నును విధించాడు
రాథోడులు :
రాజధాని - జోధ్ పూర్
వీరు జయచంద్ర నంతతికి చెందినవారమని ప్రకటించుకున్నారు.
వీరి ఆస్థానంలోని శ్రీహర్షుడు నైషధ, ఖండన ఖాండ ఖాంద్యక అనే పుస్తకాలను రచించాడు.
'నైషధ చరిత' రచయిత అయిన శ్రీహర్షుడుని జయచంద్రుడు పోషించాడు.
ఇతర అంశాలు:
రాజ్యాన్ని భోగాలుగా, విషయాలుగా విభజించారు. గ్రామం అన్నింటికంటే చిన్న విభాగం.
బహుశా ఆడ పిల్లలకు వివాహాలు చేయడం కష్టం కావడం వల్ల పుట్టగానే ఆడపిల్లలను చంపే దురాచారం ఆ రోజుల్లో ప్రారంభమైంది.
వీరి కాలంలో సోమదేవుడు 11వ శతాబ్ధంలో రచించిన “కథా సరిత్సాగరం” ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన చారిత్రక
గ్రంథం.
విక్రమాంకదేవ చరిత్రలో బిల్హణుడు చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుని జీవిత చరిత్ర రాశాడు.
ఈ కాలంలో అసభ్యకరమైన కవిత్వం కూడా వెలువడింది. జయదేవుని “గీత గోవిందం”లో బిల్హణుడి “చౌర పంచాశిఖిలో వెలువడింది.
రాజపుత్రులు దేవాలయాలు “నాగర' శైలిలో నిర్మించారు. వీరి వాస్తుకళ “అబూ శిఖరం'లోని జైన దేవాలయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంది.