ఆదిహిందూ ఉద్యమం-Role of Aadi Hindu Udyamam in Nizam's State
1927 అలహాబాదులో జరిగిన అఖిల భారత ఆదిహిందూ సదస్సుకు భాగ్యరెడ్డివర్మ దక్షిణ భారతదేశ ఆదిహిందువుల
ప్రతినిధిగా హాజరయ్యాడు.
1930లో లక్నోలో జరిగిన అఖిల భారత ఆదిహిందూ సదస్సుకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించాడు.
ఈ సదస్సులోనే డా॥ బి.ఆర్. అంబేద్కర్ అప్పటి 9 కోట్ల మంది బడుగు వర్గాల వారికి ఏకైక నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు.
భాగ్యరెడ్డివర్మ ఆంధ్ర మహాసభలలో దళితులకు సంబంధించి కొన్ని ముఖ్య తీర్మానాలను తన నందేశాల ద్వారా
ప్రతిపాదించాడు.
1931లో స్వస్తిక్‌దళ్ నాయకుడైన బి. చిత్తరంజన్ ఆధ్వర్యంలో నిజాం డొమినియన్ డిప్రెస్ట్ క్లాసెస్ అనే రాజకీయ సమావేశం బొల్లారంలో జరిగింది.
1933లో జరిగిన నాగ్‌పూర్ ఆదిహిందూ సమావేశంలో భాగ్యరెడ్డివర్మ చివరిసారిగా పాల్గొన్నాడు.
1934లో గాంధీజీ హైదరాబాద్‌లో పర్యటించినపుడు పీసరి వెంకన్న అనే వ్యక్తి హరిజన్ అనే పదాన్ని వ్యతిరేకించి తాము ఆది హిందువులమని పేర్కొన్నాడు.
పీసరి వెంకన్న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దళితుల తరపున వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాడు.
భాగ్యరెడ్డివర్మ భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించాడు. తర్వాత ఇది ఆదిహిందూ అనే మాసపత్రికగా మారింది (1937)
1937 డిసెంబర్ 19న మజ్లిస్ ఎఖ్వనిన్ సంస్కరణలపై ఆది హిందువుల 43 శాఖల సమావేశం బాగ్యరెడ్డివర్మ ఆధ్వర్యంలో బి.యస్.వెంకట్రావు అధ్యక్షతన జరిగింది.
ఈ సభలో భాగ్యరెడ్డివర్మ ఆది హిందువులకు ప్రత్యేక ప్రాతినిథ్యం గల 10 నియోజకవర్గాలు కేటాయించాలని తీర్మానం చేశాడు. 1937లో అరుంధతీయులలో చైతన్యం కోసం జాంబవర్ణ సేవాసమితి ఏర్పడింది
1939లో భాగ్యరెడ్డివర్మ మరణించాడు
ఇతని మరణానంతరం ఇతని కుమారుడు ఎం.బి.గౌతమ్ ఆదిహిందూ ఉద్యమాన్ని కొనసాగించుటకు ప్రయత్నించాడు.
మాల మాదిగల మద్య విభేదాలు ఉద్యమాన్ని నీరుగార్చాయి
ఎం.బి.గౌతమ్ ఆదిహిందూ సామాజిక సేవాసంస్థ ను స్థాపించాడు
భాగ్యరెడ్డివర్మ తెలంగాణలో సమాంతర న్యాయ వ్యవస్థ నడిపాడు.
గ్రామాలలో తన అనుచరులచే న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేశాడు.
న్యాయ పంచాయతీలు ఇచ్చిన తీర్పులపై అప్పీలు చేసుకొనుట కొరకు తన నేతృత్వంలో కేంద్ర న్యాయ పంచాయతీని ఏర్పాటు చేశాడు
మత్తుపానీయాల నిషేధం కొరకు ఇతను అత్యధికంగా పోరాటం చేశాడు
భాగ్యరెడ్డివర్మతో పాటు మరియు అనంతరం దళితుల కొరకు పోరాటం చేసిన ముఖ్యులు - టి.వి.నారాయణ, తక్కెళ్ల
వెంకయ్య, ఎం.యల్. ఆదయ్య, వి.యస్.వెంకట్రావ్, అరిగే రామస్వామి, జె.యస్.ముత్తయ్య, పీసరి వెంకన్న మిలిటరీలో పనిచేసే తక్కెళ్ల వెంకయ్య 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి యూరప్ వెళ్లారు
యూరప్ వెళ్లి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో దళితులకు జరిగే అన్యాయాలపై పోరాడాడు.