ఆదిహిందూ ఉద్యమం-Role of Aadi Hindu Udyamam in Nizam's State
బి.ఆర్.అంబేద్కర్ హైదరాబాద్‌లో అనేకసార్లు పర్యటించి దళిత ఉద్యమాన్ని బలోపేతం చేయుటకు ప్రయత్నించాడుబి.యస్.వెంకట్రావ్‌ను హైదరాబాద్ అంబేద్కర్ అంటారు.
అంబేద్కర్ అనుచరులు హైదరాబాద్‌లో జయభేరి అను పత్రికను ప్రచురించారు.
అంబేద్కర్ అనుచరులు హైదరాబాద్ రాష్ట్ర అంబేద్కర్ యువజన మండలిని స్థాపించారు.
ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరపున పోటీచేసి
*హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి దళితుడు - అరిగె రామస్వామి.
మాదిరి భాగ్యరెడ్డి వర్మతో పాటుగా అనేక మంది తెలంగాణలో బడుగు వర్గాల అభివృద్ధి కొరకు కృషి చేశారు. వారిలో కొందరు ప్రముఖులు
1. ఎం.యల్.ఆదయ్య :
ఇతడిని దళిత భీష్ముడిగా పేర్కొంటారు
ఇతను మొదటగా సికింద్రాబాద్‌లో ఆది హిందూ పాఠశాలను ఏర్పాటు చేశాడు. తర్వాత మొత్తం 26 ఆది హిందూ పాఠశాలలను ఏర్పాటు చేశాడు.
1922లో ఆదిహిందూ సోషల్ కాన్ఫరెన్స్ ఇతని అధ్యక్షతన జరిగింది
ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ సికింద్రాబాద్ శాఖకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
1934లో నిజాం ప్రభుత్వం పాఠశాలలన్నింటినీ స్వయంగా నడిపింది
2. బి.యస్.వెంకట్రావు
ఇతన్ని హైదరాబాద్ అంబేద్కర్ అంటారు
అభిమానులచే రావు సాహెబని అని పిలువబడ్డాడు
ఇతను పుణెలో ఒక శిల్పిగా పని చేశాడు. అప్పుడే జ్యోతిబా పూలే యొక్క ఉద్యమాలతో ప్రభావితుడయ్యాడు.
ఇతను 1922లో ఆది ద్రావిడ సంఘంను స్థాపించాడు
ఆది హిందూ లైబ్రరీని ఏర్పాటు చేశాడు.
దేవదాసీ నిర్మూలనకు కృషి చేశాడు
హైదరాబాద్‌లో దళితుల కోసం 18 దేవాలయాలు నిర్మించాడు.
1937లో ఇతని అధ్యక్షతన 43 ఆది హిందూ శాఖల సమావేశం జరిగింది. దీంట్లో భాగ్యరెడ్డివర్మ ఆది హిందువులకు ప్రత్యేక ప్రాతినిథ్యం గల 10 నియోజకవర్గాలను కేటాయించాలని తీర్మానం చేశాడు.
ఇతను విద్యామంత్రిగా పని చేశాడు
3. పీసరి వెంకన్న/వీరన్న:
1934లో గాంధీజీ హైదరాబాద్‌లో పర్యటించినపుడు ఇతను హరిజన్ అనే పదాన్ని వ్యతిరేకించి, తాము ఆది హిందువులమని పేర్కొన్నాడు
ఏపీసరి వెంకన్న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దళితుల తరపున వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాడు.
4. అరిగి రామస్వామి :
ఆదిహిందూ జాతీయ సభ స్థాపకుడు.
ఇతను సునీత బాలసంఘం స్థాపించి, దళితుల విద్య కొరకు కృషి చేశాడు.
ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరపున పోటీచేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి దళితుడు.
5. జెయస్.ముత్తయ్య :
ఇతను మన్య సంఘానికి కార్యదర్శిగా పని చేశాడు
1918 డిసెంబర్ 31న “ద పంచమి అనే ఆంగ్ల మాసపత్రికను స్థాపించాడు
6. పి.శ్యాంసుందర్ :
ఇతను ఐక్యరాజ్యసమితిలో నిజాం యొక్క ప్రతినిధిగా పనిచేశాడు
ఇతను కుల వివక్షతను ఖండించి 'ద బర్న్' అనే పుస్తకాన్ని రచించి దళితుల స్థితిగతులను తెలియజేసాడు.