Role of Aarya Samajam in Nizam's State-ఆర్య సమాజం

TSStudies

ఆర్య సమాజం  Aarya Samajam

ఆర్య సమాజం 1875 సంవత్సరంలో బొంబాయిలో మహర్షి దయానంద సరస్వతి స్థాపించారు. ఆర్యసమాజ్ ఎన్నో సామాజిక, మతపరమైన ఉద్యమాలు నడిపించింది. 20వ శతాబ్దంలో ఆర్యసమాజం ముఖ్యంగా హిందువుల యొక్క జీవన, ఆలోచనా విధానాలలో ఒక గొప్ప మార్పు చూపించిందని డాక్టర్  కె పి జైస్వాల్ పేర్కొన్నారు
1880 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యంలో ఆర్యసమాజ్ కార్యకలాపాలను ప్రధాన కేంద్రంగా బీడ్ జిల్లాలోని థరూర్ కేంద్రంగా ఉండేది. 1892 సంవత్సరంలో హైదరాబాద్ ఆర్య సమాజ్ రెసిడెన్సి ప్రాంతం (సుల్తాన్ బజార్) లో ప్రారంభించబడింది. 1892 సంవత్సరంలో ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి స్వామి ప్రియ శిష్యులైన స్వామి నిత్యానంద సరస్వతి హైదరాబాదుకు వచ్చి ధార్మిక ప్రవచనాల ఫలితంగా హైదరాబాదులో ఆర్యసమాజం బలపడింది 
దేవిదీన్  గారు ఆర్యసమాజానికి సుల్తాన్ బజార్ లో భూమి విరాళం ఇవ్వటం చేత ఆ ప్రదేశంలో ఆర్య బాల బాలికల పాఠశాల ఏర్పడింది 
1895 సంవత్సరంలో హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు మొదటిసారిగా శాలిబండ మరియు చాదరఘాట్లో ఆర్య సమాజం వారు నిర్వహించారు చాదరఘాట్ ఉత్సవాలను విద్యార్థులు నిర్వహించారు 
అనేక కారణాల వల్ల అన్యమతాలలో చేరిన హిందువులను తిరిగి హిందువుల గా మార్చుట కొరకు ఆర్యసమాజ్ శుద్ధి అనే కార్యక్రమాన్ని చేపట్టింది 
ఆర్య సమాజం యొక్క ముఖ్య లక్ష్యం హిందూమతంలో కాలదోషం పట్టిన మూఢనమ్మకాలను దూరంచేసి వేద సమ్మతమైన మత ప్రచారం చేయటం 
కోలాచల శ్రీనివాసరావు, నారాయణస్వామి, ఆదిపూడి సోమనాథ రావు, రాజా రత్నమాచారి, మంత్రిప్రగడ వెంకటేశ్వరరావు తదితరులు హిందీలో ఉన్న ఆర్యసమాజ్ వారి సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడంలో విశేష కృషి చేశారు 
1907 జనవరి 25వ తేదీన సికింద్రాబాదులో ఆర్యసమాజం వార్షికోత్సవం జరపాలని నిర్ణయించారు. కానీ నిజాం ప్రభుత్వం సభ జరపరాదని ఆంక్షలు విధించింది. ఊరేగింపు జరుపడానికి కూడా పోలీసులు ఎన్నో ఆటంకాలు కలిగించారు కానీ అంతర్జాతీయ ఆర్యన్ లీగ్ ఆదేశంతో హైదరాబాదులో సత్యాగ్రహం జరిపి విజయం సాధించారు 
సికింద్రాబాద్ లో స్వామి నిత్యానంద బ్రహ్మవిద్య రహస్యాన్ని గురించి చేసిన ప్రసంగం మెడికల్ విద్యార్థులలో నూతన చైతన్యం కలుగజేసింది. వీరేగాక నవాబ్ ముజఫర్ జంగ్ కూడా ఆర్యసమాజ్ సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు. 
హైదరాబాద్ ఆర్య సమాజం యొక్క మొదటి అధ్యక్షుడిగా పండిత్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా పని చేశారు.
అఘోరనాథ్ చటోపాధ్యాయ, కృష్ణమాచార్యులు ఆర్య సమాజం అంటే ఎంతో అభిమానం చూపేవారు 
ఆర్య సమాజం హిందూ సమాజాన్ని సంఘటిత పరచడానికి సంజీవనిలా పని చేసిందని పేర్కొంటూ, ఆర్యసమాజం వల్ల ఎందరో ప్రభావితమై అందులో పని చేశారు ఉదా|| వినాయకరావు విద్యాలంకార్, టి హయగ్రీవాచారి, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు మొదలైనవారు 
1908లో సెప్టెంబరులో మూసీనది వరదలు రావడంతో హైదరాబాద్ నగరంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడే ఆర్య సమాజం వారు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  
స్వామి దయానంద యొక్క 'సత్యార్థ ప్రకాశిక' గ్రంథం ఆర్యసమాజం వారి మూల గ్రంథం. ఈ గ్రంథం 1921లో తెలుగులోకి అనువదించబడింది. సత్యార్థ ప్రకాశిక చాలా బాగాన్నీ ఆదిపూడి సోమనాథ రావు అనువదించగా మిగిలిన దానిని రాజా రత్నమాచారి పూర్తి చేశారు. 
మంత్రిప్రగడ వెంకటేశ్వరరావు 'వైదిక ధర్మ గ్రంథ మండలి' స్థాపించి సులభశైలిలో రచించిన అనేక ధార్మిక గ్రంథాలను అతి తక్కువ ధరలకు అందజేశారు.  
దయానంద సరస్వతి పురాణాలను ఖండించాడు. హిందూ మతం గురించి తెలుసుకొనుటకు వేదాలను మాత్రమే పఠించాలని పేర్కొని 'గో బ్యాక్ టు వేదాస్' అనే నినాదాన్ని ఇచ్చాడు. 
హైదరాబాదులో ఆర్య సమాజ స్థాపన తో అక్కడి ప్రజల వేగవంతమైన రాజకీయ మేలుకొలుపు కనిపించింది 
ఆర్య సమాజం యొక్క బోధనలు 20వ శతాబ్దం కంటే ముందుగానే హైదరాబాదులో ఉండేవి కానీ ప్రముఖ దేశభక్తులు లాయర్ అయిన కేశవరావు కోరత్కార్ ఆర్యసమాజం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆర్య సమాజం యొక్క ప్రభావం ప్రజలలో బాగా వ్యాపించింది. 
ఈయన ఆర్య సమాజం యొక్క కార్యకలాపాలలో నూతన శక్తిని తెప్పించాడు ఇతడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్యసమాజం శాఖలను హైదరాబాద్ రాష్ట్రంలో అనేక చోట్ల ప్రారంభించి లైబ్రరీలు మరియు పాఠశాలల ద్వారా విద్యను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు 
హయగ్రీవాచారి, కాళోజి నారాయణరావు గారు వరంగల్ ప్రాంతంలో ఆర్యసమాజం శాఖలు ఏర్పరిచారు. సీతయ్య గుప్త 'సత్యార్థ ప్రకాశిక' గ్రంథాలను అచ్చు వేయించి ఉచితంగా పంచాడు. 
1939 జనవరి 25, మార్చి 22, ఏప్రిల్ 22, మే 22, జూన్ 22 తేదీలలో హైదరాబాద్ డేలను ఆర్యసమాజం నిర్వహించి నిజాం పాలనను ఖండించి స్వపరిపాలన ఉండాలనే డిమాండ్ చేసింది 
1947 డిసెంబర్ 4న ఆర్యసమాజ్ లోని  క్రాంతికార్ దళ్ కు చెందిన నారాయణరావు పవార్ హైదరాబాదులోని కింగ్ కోఠి వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై బాంబు దాడి చేశాడు.