తెలంగాణలో ఇతర సామాజక సంస్థలు - Role of Brahma Samajam in Nizam's State
కళావంతుల సంస్కరణల కోసం సిద్ధాబత్తుని శ్యాంసుందర్ కృషి చేశాడు
దక్కన్ మానవ సేవా సమితి నిర్వహించిన పాఠశాల ఎరుకల వారి అభ్యున్నతికి కృషి చేసింది
కులకర్ణి సంఘం ఏర్పడడానికి ముఖ్య కారణం - గంగరాజు
వీరి అభివృద్ధి కోసం వనం వెంకటేశ్వరరావు, అయితరాజు జీటికంటి రామారావు, లక్ష్మీనరసింహరాయశర్మ కృషి చేశారు
గోలకొండ కవుల సంచికలో ఆనాటి వెనుకబడిన కులాల వారి చైతన్యానికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి
తెలంగాణలో ఇతర సామాజక సంస్థలు
హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజం :
1828లో రాజా రామ్మోహనరాయ్ బ్రహ్మసభను స్థాపించాడు.
దేవేంద్రనాథ్ ఠాగూర్ మొదలగు వారి కృషితో బ్రహ్మసభ తర్వాత కాలంలో బ్రహ్మసమాజ్‌గా మారింది.
బ్రహ్మసమాజం ఏకేశ్వరోపాసన హరిజన ఉద్ధరణ, వేశ్యా వృత్తి నిర్మూలనకు కృషి చేసింది.
బ్రహ్మ సమాజం సంఘ సంస్కరణను, పత్రికాస్వేచ్చను ప్రబోధించింది.
హైదరాబాద్ ప్రభుత్వం బ్రహ్మ సమాజ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్న వారికి చట్టబద్ధత కల్పించింది
హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజం మొదటి సమావేశం 1914 సెప్టెంబర్ 20న రెసిడెన్సీ బజారులో జరిగింది.
అధ్యక్షుడు : నారాయణ గోవింద వెల్లింకర్ (సరోజినీనాయుడు సూచన మేరకు)
మొదటి సమావేశంలో భాగ్యరెడ్డివర్మ 14 మంది చేత బ్రహ్మసమాజ దీక్షను చేపట్టించాడు. కానీ తాను మాత్రం దీక్ష చేపట్టలేదు
హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజ వ్యాప్తికి బి.రామయ్య, ఎన్.ఆర్.ముకుందస్వామి, హెచ్.ఎస్.వెంకట్రామయ్య, వల్తాటి శేషయ్య, జె.ఎస్.ముత్తయ్య మొదలగు వారు కృషి చేశారు.
తెలంగాణలో బ్రహ్మసమాజ ప్రభావం కంటే ఆర్య సమాజ ప్రభావం ఎక్కువ.