ఢిల్లీ సుల్తానులు(1206-1506):
ఢిల్లీని 5 వంశాలు పాలించాయి
1) బానిస వంశము(1206-90) :
కుత్చీ : 1206-11
షంషీ : 1211-66
బాల్బానీ : 1266-90
2) ఖిల్జీ వంశము _ : 1290-1320
3) తుగ్లక్ వంశము : 1820-1415
4) సయ్యద్ వంశము : 1415-51
5) లోడీ వంశము : 1451-1526
బానిస వంశము:
బానిస వంశాన్ని స్థాపించినవాడు -కుతుబుద్దీన్ ఐబక్
కుతుబుద్దీన్ ఐబక్ (1206-10):
ఇతను ఇల్బారీ తెగకు చెందినవాడు.
ఇతని బిరుదులు - లాక్‌బక్ష్, సిపాసలార్
ఇతను ఢిల్లీలో కువ్వత్-ఉల్-ఇస్లామ్ అనే మసీదును నిర్మించాడు. ఇది ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడిన మెట్టమొదటి మసీదు.
ఇతను రెండవ మసీదును అజ్మీర్‌లో నిర్మించాడు. దీని పేరు అథైదిన్‌కా ఝంప్రో.
తన సూఫీ గురువు 'కుతుబ్-ఉద్దీన్ భక్తియార్ కాకీ జ్ఞాపకార్థం “కుతుబ్‌మినార్” నిర్మాణమును చేపట్టాడు.
ఇతని ఆస్థానంలోని హసన్ నిజామీ 'తాజుల్‌మజర్' అనే పుస్తకాన్ని రచించాడు.
1210లో గుర్రపు ఆట చౌగన్ లేదా పోలో ఆడుతూ గుర్రం పైనుంచి కిందపడి ప్రమాదవశాత్తూ మరణి చాడు.
ఇతని మరణానంతరం ఇతని కుమారుడు “ఆరమ్‌షా” ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు.
ఇల్‌టుట్‌మిష్ ఆరమ్‌షాను '“జుద్” యుద్ధంలో ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు.
ఇల్‌టుట్ మిష్ (1211-87):
ఇతను కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు
ఇతని వంశాన్ని 'షంషీ' వంశము అంటారు.
ఇతనిని సార్-ఇ-జందర్ అని పిలిచేవారు.
ఇతను మొట్టమొదటిసారిగా ఖలీఫా (ముస్తాసిర్ భిల్లా) వద్ద నుంచి 'సుల్తాన్' అనే బిరుదును పొందాడు. ఇతన్నే ఢిల్లీ సుల్తాన్‌ల నిజమైన స్థాపకుడని పేర్కొంటారు.
ఇతను తురుష్కుల యొక్క అనేక సాంప్రదాయాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు.
చివాల్‌గనీ(40 మంది తురుష్కుల కులీనీలు) విధానమును, ఇక్తా విధానము(సైనిక అధికారులకు జీతాలకు బదులుగా భూమి ఇచ్చుట) ప్రవేశపెట్టాడు.
వెండి-టంకా నాణెములను, రాగి-జిటల్ నాణెములను ప్రవేశపెట్టాడు.
1221లో మంగోల్ దండ యాత్రికుడు చెంఘిజ్‌ఖాన్ పర్షియా రాజు జలాలుద్దీన్ మంగాబరానీను వెంబడిస్తూ భారతదేశంపై దాడి చేశాడు.
1228లో 3వ తరాయిన్ యుద్ధంలో గజినీ పాలకుడు యాల్డాజ్‌ను ఓడించాడు.
అఖిల భారత మిలిటరీ మరియు పౌర సర్వీసును ప్రవేశపెట్టాడు.
తన కుమారుడు నజీరుద్దీన్ మొహమ్మద్ మరణించడంతో అతని జ్ఞాపకార్థం 'సుల్తాన్ ఘరీ అనే సమాధిని (ఢిల్లీలో) నిర్మించాడు. అందువల్లనే ఇల్‌టుట్‌మిష్‌ను “సమాధుల పితామహుడు” అంటారు.
ఇల్‌టుట్ మిష్ కుతుబ్‌మినార్ నిర్మాణమును పూర్తి చేశాడు.
ఇతని ఆస్థానంలోని మిన్హాజుల్ సిరాజ్ “తబాకత్ నజరీ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకంలో ప్రధానంగా రజియా స్తుల్తానా గురించి పేర్కొనబడింది.
ఈ పుస్తకం నజీరుద్దీన్ 'మొహమ్మద్‌కు అంకితం చేయబడింది.
ఇల్‌టుట్ మిష్ మరణానంతరం అతని కుమారుడు రుక్‌నుద్దీన్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు.
రుక్‌నుద్దీన్‌ను తొలగించి రజియా సుల్తానా ఢిల్లీ పాలకురాలు అయింది. ఈమె యొక్క వ్యతిరేకి జునైది.
రజియా సుల్తానా భర్త అల్లూనియా (భతిండా రాజు)
బందిపోటు దొంగల దాడి వల్ల ఢిల్లీ యొక్క ఏకైక మహిళా పాలకురాలు అయిన రజియా సుల్తానా మరణించింది.
ఈమె తర్వాత షంషీ వంశ పాలకులు
1) బహరంషా
2) అల్లావుద్దీన్ మసూద్
3) నజీరుద్దీన్ మహమ్మద్
నజీరుద్దీన్ మొహమ్మద్ యొక్క ప్రధాన మంత్రి -బాల్బ
బాల్బన్ యొక్క వ్యతిరేకి -ఇమాదుద్దీన్ రెహాన్
1226లో బాల్బన్ తన అల్లుడు మరియు పాలకుడైన నజీరుద్దీన్ మొహమ్మద్‌కు విషం ఇచ్చి హతమార్చాడు.
బాల్బన్ (1266-86):
ఇతని వంశాన్ని బాల్బానీ వంశం అంటారు.
ఇతని బిరుదులు - మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషి, జిల్లేహ్ అల్లా
ఇతను ఢిల్లీలో ఎర్ర భవంతిని నిర్మించాడు.
దివాన్-ఇ-అరీజ్ అనే మిలిటరీ శాఖను (సైనికశాఖ) ఏర్పాటు చేసి చిహల్‌గనీలను, ఇతర తిరుగుబాటులను అణిచివేశాడు.
ఇతను పర్షియాలో “అఫ్రాషియాబొ వంశానికి చెందినవాడినని ప్రకటించుకున్నాడు.
ఇతను ఎల్లప్పుడూ ఖరీదైన దుస్తులను ధరించేవాడు.
సాధారణ ప్రజలతో నేరుగా. మాట్లాడేవాడు కాదు.
ఇరాన్ / పర్షియాకు చెందిన సిజిదా -సాష్టాంగ నమస్కారం, పైబోస్ - సుల్తాన్ పాదములకు ముద్దు పెట్టుట విధానాలను ప్రవేశపెట్టాడు.
నౌరోజి ఉత్సవాలను, జరోఖదర్శన్‌ను ప్రవేశపెట్టాడు.
హోళి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. తనను తానే దేవుని నీడగా బాల్బన్ చెప్పుకొనేవాడు.
భారతదేశ చిలుకనని తనకు తానే సగర్వంగా చెప్పుకొన్న ప్రముఖ పర్షియా దేశ కవి 'అమీర్ ఖుస్రో' ఇతని ఆస్థానాన్ని అలంకరించాడు.
తన ఆస్థానంలోకి విదేశీ యాత్రికులు ఎవరైనా వస్తే వారు మోకాళ్లపైన మాత్రమే నడవాలి.
తన ఆస్థానంలో ఎల్లప్పుడూ నిశ్శబ్దాన్ని పాటించాడు.
వాయువ్య భారతదేశంలోని మంగోలు దండయాత్రను సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.
తన కుమారుడు ప్రిన్స్ మొహమ్మద్ వాయువ్య భారతదేశంలోని తామర్ మంగోల్ దండయాత్రను 1285లో త్రిప్పికొట్టాడు. కానీ గాయాలకు గురైన ప్రిన్స్ మొహ్మద్ మరణించాడు.
బాల్బన్ ప్రిన్స్ మొహమ్మద్‌కు “ఖాన్-ఇ-షహీద్” అనే బిరుదును ఇచ్చాడు. తర్వాత బాల్బన్ అనారోగ్యానికి గురై
1286లో మరణించాడు.
బాల్బన్ మరణానంతరం అతని మనవడు కైకూబాద్ ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించబడ్దాడు.
అప్పటి కులీనీలలో గొప్పవాడైన జలాలుద్దీన్ ఖిల్టీ, కైకూబాద్ మరియు కైమూర్‌లను హతమార్చి 1290లో ఢిల్లీ పై ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. దీనినే ఖిల్జీ విప్లవం అంటారు.