ఖిల్జీ వంశము:
జలాలుద్దీన్ ఖిల్జీ(1290-96):
ఇతను ఖిల్జీ విప్లవం ద్వారా ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు.
ఇతను దీపాల్‌పూర్ వద్ద మంగోల్ దండయాత్రికుడు హలకు/అబ్దుల్లాను ఓడించాడు(1292).
'థగ్గులు' అనే బందిపోటు దొంగలను ఢిల్లీ నుంచి బెంగాల్‌కు తరిమివేశాడు.
ఇస్లాం మతంలోకి చేరిన మంగోలులను ఢిల్లీ వద్ద స్థిరపడుటకు అనుమతినిచ్చాడు. వీరినే నియో ముసల్మానులు అంటారు. వీరు స్థిరపడిన ప్రాంతాన్ని మొగలిపుర అంటారు.
ఇతని కాలంలో 'సిద్దిమౌలా” అనే గురువు ఏనుగుచే తొక్కించబడి చంపబడ్డాడు. ఇతని మరణ ఆదేశాలను జారీ చేసినవాడు ప్రిన్స్ అర్మాలీఖాన్
అల్లావుద్దీన్ ఖిల్జీ (1296-1316):
ఇతని బిరుదులు - జహాన్ సచ్ సికిందర్-ఇ-సామి (రెండవ అలెగ్జాండర్)
ఖలీఫా సామ్రాజ్యానికి కుడిభుజం
ఇతని నిర్మాణములు
1) సిరి పట్టణము: ఢిల్లీ వద్ద ఉంది. దీనిలో అతి ముఖ్యమైన కట్టడము హజార్ సితూన్ (వేయి స్తంభాలు)
2) జమాత్ ఖానా మసీదు: ఇది పూర్తిగాపర్షియన్ శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి మసీదు
3) హౌజ్‌ఖాస్
4) అలై దర్వాజా: ఇది కుతుబ్ మినార్ యొక్క ప్రవేశ ద్వారం.
జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో అల్లావుద్దీన్ దేవగిరిపై చాడిచేసి అత్యధిక సొత్తును సంపాదించాడు.
తర్వాతి కాలంలో తాను సుల్తాన్ అగుటకు కులీనీలను కొనుగోలు చేయుటకు ఈ సొత్తును ఉపయోగించాడు.
ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క మేనల్లుడు.
ఇతను మొత్తం ఢిల్లీ సుల్తానులలో గొప్పవాడు.
ఇతని ఆర్థిక సంస్కరణలలో అతి ముఖ్యమైనది - మార్కెట్ సంస్కరణలు
మార్కెట్‌ను షహ్నయ్-ఇ-మండీ అంటారు.
షహ్నయ్-ఇ-మండిలో 3 రకాల వస్తువులను అమ్మే మార్కెట్‌లు ఉండేవి.
1) ప్రతి రోజూ సాధారణ ప్రజలకు అవసరమయ్యే వస్తువులు అమ్మే మార్కెట్
2) గుర్రాలను అమ్మే మార్కెట్
3) విలాసవంతమైన వస్తువులను అమ్మే మార్కెట్
షహ్నాయ-ఇ-మండిలో ముగ్గురు అధికారులు
1) షహ్నాయ్-ఇ-మండి
2) దివాన్-ఇ-రియాసత్
3) బరీద్ (గుఢాచారులు)
చరాయి(పశుపోషణపై పన్ను), ఘర్షీ (నివాసములపై పన్ను) అనే పన్నులను విధించారు.
దివాన్-ఇ-ముస్తక్‌రాజ్ అనే బాకీలు వసూలు చేసే శాఖను ఏర్పాటు చేశాడు.
సైనిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
ఉదా॥ దాగ్-గుర్రములపై రాజముద్ర వేయుట,
చెహ్రా/హులియా-సైనికుల వివరములను తెలియజేయు పట్టిక విధానాలను ప్రవేశపెట్టాడు.
ఇతను తపాలా సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు
తపాలా శాఖలో పనిచేసే ప్రతీ అశ్వకుడు ప్రతీ రోజు కనీసం 100 కోసుల దూరం పయనించాలని పేర్కొన్నాడు. 1 కోస్
అనగా రెండున్నర కిలోమీటర్లు.
సైనికులకు, చహల్‌గనీలకు ఇచ్చిన భూములను రద్దు చేశాడు.
మద్యాన్ని బాహాటంగా అమ్మడాన్ని, సేవించడాన్ని నిషేధించాడు.
అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు:
1299 - గుజరాత్ -కర్ణదేవ-2
1301 - రణతంబోర్ (రాజస్థాన్)-హమీర్‌దేవ
1303 - చిత్తోర్ (రాజస్టాన్)-రాజారతన్‌సింగ్
1305 - మాళ్వా (మధ్యప్రదేశ్)-హరనాథ
1308 - మార్వార్ (రాజస్టాన్)-సీతల్‌దేవ
1311 - జాలోర్ (రాజస్టాన్)-కన్హర్‌దేవ
గుజరాత్‌ను ఆక్రమించినపుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యానికి మాలిక్‌కపూర్ పట్టుబడ్డాడు.
మాలిక్‌కపూర్ ను 1000 దినార్‌లకు కొనుగోలు చేసిన కారణంగా ఇతనికి హజరీ దినారీ అనేపేరు వచ్చింది
మాలిక్‌కఫూర్ బిరుదు -మాలిక్‌నాయక్
ఈ దండయాత్ర కాలంలోనే కమలాదేవి పట్టుబడి ఢిల్లీకి పంపబడింది. ఢిల్లీలో అల్లావుద్దీన్ ఈమెను వివాహం చేసుకొని పట్టమహిషి హోదాను ఇచ్చాడు:
రణతంబోర్‌లో 1301లో మొట్టమొదటిసారిగా రాజపుత్ర మహిళలు జౌహోర్ (సామూహిక ఆత్మహత్యలు)ను పాటించారు.
చిత్తోర్‌లో రాజా రతన్‌సింగ్ భార్య పద్మిని.
మాలిక్ మహమ్మద్ జైసీ యొక్క 'పద్మావతి' గ్రంథం ప్రకారం అల్లావుద్దీన్ రాణి పద్మినిని పొందుట కొరకు చిత్తోర్‌పై దాడి చేశాడు.
దక్షిణ భారతదేశ దండయాత్ర:
ఈ దండయాత్రలకు మాలిక్ కపూర్ నేతృత్వం వహించాడు.
1307 -దేవగిరి (యాదవులు)-రామచంద్రదేవ
1308-09 - వరంగల్(కాకతీయులు)-ప్రతాపరుద్ర-2
1310 - ద్వార సముద్రం (హోయసాలుకు) -వీరభల్ల-3
1311-12 - మధురై (పాండ్యులు)- సుందరపాండ్య, వీరపాండ్య
క్రీ.శ. 1312 చివరినాటికి అల్లావుద్దీన్ సామాజ్యం మొత్తం ఉత్తర ప్రాంతానికే కాకుండా దక్షిణ ప్రాంతానికి విస్తరించి భారతదేశం మొత్తం ఏకం చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్.
రైతులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకొన్న ఢిల్లీ సుల్తాన్‌లలో తొలివాడు.
పెద్దస్థాయిలో సిద్ధ సైన్యాన్ని ఏర్పరుచుకొని, తన ప్రత్యక్షాధికారంలోకి తెచ్చుకున్న మొదటి ఢిల్లీ సుల్తాన్.
అల్లావుద్దీన్ ఖిల్జీ "బ్లడ్ అంద్ ఐరన్ విధానం” పాటించాడు.
అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఖిల్జీ పాలకులు
- 1) షిహబుద్దీన్
- 2) ముబారక్‌షా
- 3) ఖుస్రోఖాన్/ నసీరుద్దీన్ ఖుస్రో
ఖుస్రోఖాన్ ఢిల్లీ సుల్తాన్ అవుటకు ఇస్తాం మతం స్వీకరించాడు.
ముబారక్ షా తనకు తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు.
ముబారక్ షా బిరుదు - అల్‌వాసిక్ బిల్లా