సురేంద్రనాథ్ బెనర్జీ :

పుస్తకము - A Nation in the Making
సంస్థ - ఇండియన్ అసోసియేషన్ (ఆనందమోహన్‌బోస్‌తో కలిసి)
ఎస్.ఎన్. బెనర్జీ ఒక ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి
రాజకీయ ఆశయాలు నేత పరిశ్రమను ఆర్థికంగా పోత్సపించడానికి 'జాతీయ నిధి ఏర్పరచాలని సూచించిన మొదటి నాయకుడు.
1895లో పూనేలోను, 1902లో అవ్మాదాబాద్ సమావేశంలోను రెండుసార్లు కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు.
జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొంటున్నాడనే నెపంతో బ్రిటీష్ ఎస్. ఎన్. బెనర్జీని ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి తొలగించింది.
ఇండియన్ అసోసియేషన్ యొక్క శాఖ అయిన ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ బ్రిటీష్ వద్ద నుంచి పరిపాలనా సంస్కరణలను డిమాండ్ చేసింది.
1917 ఆగష్టు డిక్లరేషన్ (1919 చట్టానికి సంబంధించినది)ను సమర్థిస్తూ 1918లో నేషనల్ లిబరల్ పార్టీని ఏర్పాటు చేశాడు.
1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా విభజన ఉద్యమాలను మొట్టమొదటిగా ఎస్. ఎన్. బెనర్జీ, కృష్ణకుమార్
మిత్రాలు ప్రారంభించారు. (కె.కె.మిత్రా యొక్క సంజీవని వార్తాపత్రికలో మొదటిసారిగా “బహిష్కరణ” అనే పదం పేర్కోనబడింది)
కలకత్తా భారతీయ సంఘం (Indian Association):
1876లో సురేంద్రనాథ్‌బెనర్జీ ప్రోత్సాహంతో ఏర్పడింది.
సివిల్స్ వయోపరిమితిని 21 సం॥ నుంచి 19 సం॥లకు తగ్గించడంతో ఇండియన్ అసోసియేషన్ ఈ చర్యను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది.
1886లో ఈ సంస్థ ఐఎన్‌సీలో విలీనమైంది.
1883లో కలకత్తాలో జరిగిన ప్రథమ జాతీయ సమావేశంలో వందలమంది హిందూ, ముస్లింలు పాల్గొన్నారు. భారతీయ సంఘం రెండవ సమావేశం 1885 డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో కలకత్తాలో జరిగింది. భారతీయ సంఘం రెండు జాతీయ సమావేశాల్లో చర్చించిన సమస్యలనే 1885 డిసెంబర్ 28న బొంబాయిలో జరిగిన భారతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రతినిధులు చర్చించారు.
ఆనందమోహన్‌బోస్ :

1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించాడు.
ఈ సమావేశం తర్వాత కలకత్తాలోని టౌన్‌హాల్ వద్ద బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాలను, వందేమాతరం, స్వదేశీ ఉద్యమాలను బెంగాల్ అంతటా వ్యాప్తి చేయుటకు నిర్ణయించాడు.
మౌలానా అబుల్ కలామ్ అజాద్ : (11-11-1888 : 22-02-1958)

వార్తాపత్రికలు:
- అల్‌హిలాల్
- బిల్‌హిలాల్
- అల్ బలగ్
- గబ్బార్-ఇ-ఖాతిర్
పుస్తకము - India Wins Freedom
1945లో గవర్నర్ జనరల్ వేవెల్ ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశమునకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధిగా మౌలానా పాల్గొన్నాడు.
స్వతంత్ర భారతదేశమునకు మొట్టమొదటి విద్యామంత్రి -మౌలానా ఆజాద్
ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఫిరోజ్‌షా మెహతా:

ఇతను బద్రుద్దీన్ త్యాబి, కె.టి.తెలాంగ్‌లతో కలిసి బోంబే ప్రెసిడెన్సీ అసోసియేసన్‌ను స్థాపించాడు.
1893లో జరిగిన సంఘటనలు:
గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లుట
వివేకానంద చికాగో సర్వ మత నమ్మేళనంలో ప్రసంగించుట
అనిబిసెంట్ ఐర్లాండ్ నుండి భారతదేశానికి వచ్చుట
అరమిందో ఘోష్ 14 సం॥ల తర్వాత లండన్ నుండి భారత్‌కు వచ్చుట
తిలక్ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలను ప్రారంభించుట