లార్డ్ కర్జన్ (1899-1905):
కర్జన్ స్వీయ చరిత్రను రొనాల్డ్ షే రచించాడు.
భారత పురావస్తుశాఖను పునర్‌వ్యవస్టీకరించాడు
రైల్వే సంస్కరణల కొరకు - రాబర్ట్ కమిటీ,
పోలీస్ సంస్కరణల కొరకు - ప్రెజర్ కమిటీ,
విద్యా సంస్కరణల కొరకు - రౌలింగ్ కమిటీని నియమించాడు.
1903- ఢిల్లీ దర్చార్ (ఎడ్వర్డ్-4 వట్టాభిషకం సందర్భంగా)
1904- యూనివర్సిటీ చట్టం
1905 - బెంగాల్ విభజన (విభజించి పాలించు అనే సిద్ధాంతం ద్వారా)
వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఢిల్లీ దగ్గర పూసా వద్ద ఏర్పాటు చేశాడు.
వర్తకం మరియు పరిశ్రమ శాఖను ఏర్పాటు చేశాడు.
1905లో ఇతను లేనప్పుడు ఆంప్తిల్ (Ampthil) తాత్కాలిక గవర్నర్ జనరల్‌గా పనిచేశాడు.
కర్జన్, కమాండర్ ఇన్ చీఫ్(కిచ్‌నర్) మధ్య వివాదాలు ఉండేవి.
1906లో ముస్లిం లీగ్‌ను ఢాకాలో మొహ్స్‌న్-ఉల్-వాక్ నలీముల్తా, ఆగాఖాన్‌లు స్థాపించారు.
ముస్లింలీగ్ మొదటి సమావేశం అమృత్‌సర్‌లో జరిగింది. దీని మొదటి అధ్యక్షుడు సర్ సయ్యద్ అలీ ఇమామ్.
1908లో మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం పూనే వద్ద ఏర్పాటు చేయబడింది.
1909లో పంజాబ్ హిందూ మహాసభ స్థాపించబడింది. దీనిలో ఒక సభ్యుడైన లాల్‌చంద్ ఈ క్రింది విధంగా పేర్కొనేవాడు. “ముందు మనం పిందువులం...ఆ తర్వాతే భారతీయులం”
1909 మింటో-మార్లే సంస్కరణలు / 1909 చట్టం వచ్చింది.
1909 మింటో-మార్లే సంస్కరణల ప్రకారం మొదటిసారిగా మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్ణాలు కేటాయించారు.
హార్డింజ్-2(1910-1916)
'My Indian Years" అనే గ్రంథాన్ని రచించాడు.
1911 (ఢిల్లీ దర్బార్): బ్రిటీష్ చక్రవర్తి 5వ జార్జ్, అతని భార్య మేరి భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఢిల్లీ దర్చారు జరిగింది.
దీని ముఖ్యాంశాలు:
1) రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చుట
2) బెంగాల్ విభజన రద్దు
3) 5వ జార్జ్ పేరు మీదుగా నాణేలు ముద్రించుట
1912లో ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద 2వ హార్దింజ్‌పై దాడి జరిగింది.
ఇతను "Department of Education" ను ఏర్పాటు చేశాడు.
1915లో కాశీం బజారు(ఉత్తరప్రదేశ్) రాజు అధ్యక్షతన అఖిల భారత హిందూ మహాసభ అలహాబాద్‌లో ఏర్పడింది. ఇందులో అతి కీలకమైన వ్యక్తి -మదన్‌మోహన్ మాలవ్య (తర్వాత వి.డి.సావర్మర్)
చెమ్స్‌ఫోర్ట్(1916-21):
1917 ఆగస్టు డిక్లరేషన్ (1919 చట్టానికి నంబంధించినది) ప్రకటించబడింది.
1919 చట్టము లేదా మాంట్-ఫోర్డ్ చట్టం లేదా మాంటెగో చేమ్స్‌ఫోర్డ్ చట్టం వచ్చింది.
1921లో ఆగష్టు ఒప్పందంను ఆఫ్ఘనిస్థాన్‌తో కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ విదేశీ విధానాలను రూపొందించుకునే స్వేచ్చ కల్పించబడింది.
గాంది సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాడు.
పూనాలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది.
బీహార్ లెప్టినెంట్ గవర్నర్‌గా ఎస్.పి.సిన్హా నియామకం (గవర్నర్ పదవి పొందిన ప్రథమ భారతీయుడు సిన్హా బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులైన వారిలో ఇతను రెండోవాడు, మొదటి సభ్యుడు దాదాబాయ్ నౌరోజీ)
లార్డ్ రీడింగ్ (1921-26):
యూదుల వైస్రాయి అని అంటారు
చౌరీచౌరా సంఘటన జరిగింది
1925లో నాగ్‌పూర్‌లో హెగ్దేవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించాడు.
ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో "We" అనే పుస్తకాన్ని గోల్‌వాల్కర్ రచించాడు.
1923లో స్వరాజ్ పార్టీ స్థాపన.
1925లో కాన్పూర్ వద్ద సత్యభక్త నేతృత్వంలో సీపీఐ పునర్‌వ్యవస్థీకరించబడింది.
ఇర్విన్ (1926-31):
సైమన్ కమిషన్(1928)/వైట్ కమిషన్/ చట్టపరమైన కమిషన్ భారత్‌కు వచ్చింది.
1928-ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది.
1929-దీపావళి డిక్లరేషన్
1929-పూర్ణ స్వరాజ్ తీర్మానం లాహోర్‌లో చేయబడింది.
1930-శాసనోల్లంఘన ఉద్యమం
1930-మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
1931మార్చి 5-ఢిల్లీ ఒడంబడిక (గాంధీ ఇర్విన్ ఒడంబడిక)
హార్ట్ కార్ట్ బట్లర్ ఇండియన్ స్టేట్స్ కమిషన్ నియమించబడింది.
వెల్లింగ్‌టన్ (1931-36):
ఇతని కాలంలో 2వ, 3వ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.
1932-కమ్యూనల్ అవార్డు
1932 - పూనా ఒడంబడిక
1934-సోషలిస్ట్ పార్టీ స్థాపన
1935-భారత ప్రభుత్వ చట్టం
1936-అభిల భారత కిసాన్‌సభ ఏర్పాటు
1937-భారత్ నుంచి బర్మా విభజన
లిన్‌లిత్‌గో (1936-43):
1940-ఆగస్టు ఆఫర్ (భారతదేశానికి స్వపరిపాలన కల్పించబడుతుందనే ప్రకటన) .
1940 ఆగష్టులో ముస్లింలీగ్ తన లాహోర్ సమావేశంలో పాకిస్తాన్ దేశం కావాలి అని అధికారికంగా ప్రకటించింది.
1942 - ఆగస్టు తీర్మానం (క్విట్ ఇండియా ఉద్యమం)
1943 మార్చి 23 తేదీని ముస్లింలీగ్ “పాకిస్తాన్ దే లేదా పాకిస్తాన్ దినం'గా ప్రకటించింది.
వేవెల్(1943-47 మార్చి):
1945 -వేవెల్ ప్రణాళిక లేదా సిమ్లా సమావేశం
1945 (ఐఎన్‌ఏ విచారణ/ఎర్రకోట విచారణ): ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులలో ముగ్గురిని (ప్రేమ్‌కుమార్ సెహగెల్, షానవాజ్‌ఖాన్, ధిల్లాన్‌సింగ్) ప్రధాన నిందితులను చేస్తూ ఎర్రకోట వద్ద విచారణ జరిగింది.
ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను రక్షించుటకై వారి తరపున వాదించిన ప్రధాన లాయర్-పూలాబాయ్ దేశాయ్
ఇతర న్యాయవాదులు - జవహర్‌లాల్‌నెహ్రూ, తేజ్‌బహదూర్ సప్రూ, కె.ఎన్. కట్టు
ఈ విచారణ నవంబర్ 5 నుంచి నవంబర్ 11 మధ్య జరిగింది. దీనినే ఇండియన్ నేషనల్ ఆర్మీ వారం అంటారు. నవంబర్ 12వ తేదీని ఇండియన్ నేషనల్ ఆర్మీ రోజు అంటారు.
తర్వాత వీరందరికీ లార్డ్ అట్లీ క్షమించి విడుదల చేశాడు. అందువల్లనే అట్లీని క్లెమన్సు అంటారు.
1946 RIN తిరుగుబాటు (Royan Indian Navy)
బొంబాయిలోని HMIS తల్వార్ నౌకను రషీద్ అలీ భారతదేశ తిరంగ పతాకంతో కప్పాడు. దీనికి గాను ఇతను అరెస్ట్ చేయబడ్డాడు.
B.C. దత్ HMIS తల్వార్‌పై “క్విట్ ఇండియా” అని రాయుటచే ఇతను కూడా అరెస్ట్ చేయబడ్డాడు.
దీంతో HMIS తల్వార్ ఉద్యోగులు బ్రిటీష్‌కు వ్యతిరేకంగా బొంబాయిలో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు కరాఛీలోని HMIS హిందుస్థాన్‌కు కూడా చేరింది.
సర్దార్ వల్లబాయపటేల్ పిలుపు మేరకు ఈ తిరుగుబాటు నిలిపివేయబడింది.
1946-కేబినెట్ మిషన్
1947 ఫిబ్రవరి - భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వనున్నట్లు అట్లీ అధికారిక ప్రకటన. (1948 జూన్ 30 లోపు)
జూన్ 3 ప్రణాళిక లేదా డిక్కీబర్డ్ ప్రణాళిక లేదా మౌంట్ బాటన్ ప్రణాళిక
1947-48ల మధ్య భారత్, పాకిస్థాన్‌ల మధ్య మొదటి యుద్ధం
1948 జనవరి 30 -గాంధీ హత్యకు గురికావడం
రాజగోపాలాచారి(1948 ఆగస్టు-1950 జనవరి):
రాజ్యాంగం రచించబడింది.
రాజాజీ The Nations Voice అనే గ్రంథాన్ని రచించాడు.